6 (13:1-7) 1. రాజశాసన మిది: ”హిందూ దేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూట యిరువదియేడు సంస్థానముల పాలకులకును, వారి క్రింది అధికారులకును, మహాప్రభువైన అహష్వేరోషు వ్రాయునది.

2. మేము చాల జాతులకు ప్రభువులమై ప్రపంచమంతిని యేలు వారము. అయినను అధికారగర్వముతో ఉప్పొంగక న్యాయసమ్మతము గాను, దయాపూర్వకముగాను పరిపాలన చేయగోరె దము. మా ప్రజల్టెి ఉపద్రవములకు గురికాక, సుఖముగా జీవింపవలెననియు, మా సామ్రాజ్యమున శాంతిభద్రతలు నెలకొనగా జనులెల్లరు ఒక మూల నుండి మరియొక మూలవరకు సురక్షితముగా రాక పోకలు సలుపవలెననియు మా కోరిక. లోకములోని జనులెల్లరు వాంఛించు  శాంతి ఈ సామ్రాజ్యమునను నెలకొనవలెననియే మా అభీష్టము.

3. ఈ ఆశయమునెట్లు సాధింపవలెనాయని  మా సలహాదారులను అడిగితిమి.వారిలోఒకనిపేరు హామాను. ఇతడు చాల వివేకము, రాజభక్తి, విశ్వసనీయత కల వాడు. అధికారమున మా తరువాత మాయంతివాడు.

4. ఈ హామాను మా సామ్రాజ్యమునందలి వివిధ జాతులతో కలిసి జీవించు విరోధిజాతి ఒకి కలదని మాకు విన్నవించెను. మరియు వారి ఆచారవ్యవహార ములు ఇతర జాతుల ఆచారవ్యవహారములకంటె భిన్న ముగానుండుననియు, వారెల్లప్పుడు రాజశాసనము లను ధిక్కరించుచుందురనియు, ఈ రాజ్యమును ఏకము చేయవలెనన్న నా సత్సంకల్పమును ఎల్లప్పుడు చెరచుచుందురనియు అతడు తెలిపెను.

5. కనుక ఈ ఒక్కజాతి మా యేలుబడిలోని ఇతర జాతులన్నికి విరోధముగా వర్తించుచున్నదనియు, దాని ఆచార వ్యవహారములు దోష దూషితముగానున్నవనియు మేము గుర్తించితిమి. ఈ జాతి మాకు వ్యతిరేకముగా  ఘోరమైన అపరాధములు చేయుచున్నదనియు, దీని వలన మా సామ్రాజ్య భద్రతకే ముప్పు వాిల్లనున్న దనియు మేము గ్రహించితిమి.

6. కనుక మా శ్రేయస్సు నిమిత్తమై మేమే స్వయముగా ఎన్నుకొనగా మాకు ప్రధానోద్యోగియు, రెండవ తండ్రి వింవాడునగు హామాను వ్రాయించిన ఈ తాకీదులలో పేర్కొనబడిన జాతి జనులందరిని ఎి్ట దయాదాక్షిణ్యములు చూప కుండ, వారి భార్యలను, పిల్లలను కత్తికి ఎరజేయ వలెను. ఈ సంవత్సరము వచ్చు అదారు పేరుగల పండ్రెండవ నెలలో పదునాలుగవ దినమున ఈ కార్య మును జరుపవలెను. ఇది మా ఆజ్ఞ.

7. ఈ రీతిగా పూర్వమునుండి మమ్ము ఎదిరించుచు వచ్చిన ఈ దుష్టజాతిపీడ నేితో విరుగడకాగా, ఇకమీదట మా సామ్రాజ్యము శాశ్వతముగా శాంతి భద్రతలను అనుభవించును  గాక!”

14. ఈ శాసనమును ప్రతి రాష్ట్రమున ప్రకింప వలెననియు నిర్ణయించిరి. అట్లు చేసినచో ప్రతి సంస్థా నము నిర్ణీతదినమున యూదులను వధించుటకు సిద్ధ ముగా ఉండునని వారి తలపు.

15. రాజాజ్ఞపై వార్తా వహులు త్వరపెట్టబడి పై శాసనపు తాకీదులను వివిధ సంస్థానములకు కొనిపోయిరి.మొదట రాజధాని షూషను దుర్గముననే రాజశాసనమును ప్రకించిరి. ఒక ప్రక్క రాజుహామానుతో విందారగించుచు ఆనందించు చుండగా మరియొక ప్రక్క షూషనునగరము ఈవార్త విని గగ్గోలుపడెను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము