యోరుషలేము పాపములు

22 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు హత్యలకు ఆలవాలమైన నగరమునకు తీర్పుచెప్పుటకు సిద్ధముగానున్నావా? నీవు దాని దుష్టకార్యములను దాని కెరిగింపుము.

3. నీవు యావే ప్రభుడనైన నా పలుకులను నగరమునకు ఇట్లు ఎరిగింపుము. నీవు నీ ప్రజలలో చాలమందిని చంపితివి. విగ్రహములను కొలిచి అపవిత్రురాల వైతివి. కనుక నీకు కాలము  సమీపించినది.

4. నీ హత్యల ద్వారా నీవు పాపము మూటకట్టుకొింవి. నీవు చేసిన ప్రతిమలద్వారా అపవిత్రురాలవైతివి. కనుక నీ శిక్షాదినము సమీపించినది. కావున జాతులు నిన్ను గేలి చేయునట్లును, రాజ్యములు నిన్నెగతాళి చేయునట్లును  నేను చేసితిని.

5. దగ్గరిదేశములును, దూరదేశములునుగూడ నీ అక్రమములను, అపజయ ములను చూచినవ్వును.

6. యిస్రాయేలు నాయకు లెల్లరును తమ బలమును నమ్ముకొని హత్యలకు పాల్పడుచున్నారు.

7. నగరములోని వారెవరును తల్లి దండ్రులను గౌరవించుట లేదు. మీరు పరదేశులను వంచించుచున్నారు. అనాథలను, వితంతువులను పీడించుచున్నారు.

8. పవిత్ర స్థలములను గౌర వించుటలేదు. విశ్రాంతిదినములను పాించుటలేదు.

9. మీలో కొందరు ఇతరులమీద కొండెములు చెప్పి వారిని చంపించుచున్నారు. మరికొందరు విగ్రహముల కర్పించిన నైవేద్యములు భుజించుచున్నారు. ఇంకను కొందరు కామకలాపములకు పాల్పడుచున్నారు.

10. కొందరు తమ మారు తల్లులతో శయనించుచున్నారు. మరికొందరు ముట్టుతలను బలవంతము చేసి కూడు చున్నారు.

11. కొందరు పొరుగువాని పెండ్లముతో వ్యభిచరించుచున్నారు. కొందరు తమ కోడండ్రను, కొందరు మారుచెల్లెండ్రను చెరచుచున్నారు.

12. మీలో కొందరు లంచము తీసికొని హత్యలు చేయుచున్నారు. కొందరు తోడి యిస్రాయేలీయులకు సొమ్ము వడ్డీకి ఇచ్చుచున్నారు. వారిని మోసగించి సొమ్ము చేసికొను చున్నారు. వేయేల? మీరు నన్ను విస్మరించితిరి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

13. నగరమా! నేను నీవు చేసిన హత్యలకును, దోపిడులకును నీపై చేయెత్తి నిన్ను శిక్షింతును.

14. నేను నిన్ను దండించుటకు పూనుకొనినపుడు నీకు ధైర్యము చాలునా? బలము చాలునా? ప్రభుడనైన నేను మాటపలికితిని. నేను చేయుదునన్న కార్యమును చేసితీరుదును.

15. నేను నీ ప్రజలనెల్ల దేశములందును, ఎల్లజాతులమధ్యను చెదరగొట్టుదును. నీ పాపకార్యము లను తుదమ్టుింతును.

16. అన్యజాతులు నిన్ను అవమానించును. కాని నీవు నేను ప్రభుడనని గుర్తింతువు.”

ప్రభువు పుటము వేయును

17. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 18. ”నర పుత్రుడా! యిస్రాయేలీయులు మష్టువలె నిష్ప్రయో జకులైరి. అందరును కొలిమిలో వేసిన సీసము, తగరము, ఇనుము, ఇత్తడివిం వారైరి. వారు వెండి మష్టువిం వారైరి.

19. కనుక యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను: వారెల్లరును కొలిమిలో మిగిలిన మష్టు వింవారు. నేను వారిని అందరిని యెరూషలేమున ప్రోగుజేయుదును.

20. నరులు వెండి, రాగి, ఇనుము, తగరము, సీసములతో గూడిన ముడి పదార్థములు కుంపిలో ప్టిె కరగించినట్లే, నేనును వారిని ప్రోగుచేసి నా కోపముతోను, నా ఉగ్రత తోను కరగింతును.

21. నేను వారిని యెరూషలేమున ప్రోగుచేసి నా కోపాగ్నిని ఊదగా వారు కరిగిపోవు దురు.

22. వారు యెరూషలేమున కుంపిలో వెండి వలె కరుగుదురు. అప్పుడు వారు ప్రభుడనైన నేను నా కోపమును వారిపై కుమ్మరించితినని గ్రహింతురు.”

యిస్రాయేలు నాయకుల పాపములు

23. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 24. ”నర పుత్రుడా! నీవు యిస్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. వారి దేశము అపవిత్రమైపోయినది కనుక నేను కోపముతో దానిని శిక్షింతును.

25. ప్రభుని ఆగ్రహదినమున నీకు వర్షమురాదు. ఆ దినములలో ప్రవక్తలు కుట్రలు చేయుచూ, గర్జించు సింహము వేటను చీల్చునట్లు, వారు ప్రజలను భక్షింతురు. వారి సొమ్మును, ఆస్తిని అపహరింతురు. వారి భార్యలను వితంతువులను చేయుదురు.

26. యాజకులు నా నియమములను మీరుచున్నారు. వారు పవిత్రవస్తువులను లెక్కచేయుటలేదు. పవిత్రవస్తువుల కును, లౌకికవస్తువులకును మధ్య వ్యత్యాసమును గూడ గుర్తించుటలేదు. విశ్రాంతదినములను గమనించుట లేదు. కావున యిస్రాయేలీయులు నన్ను  గౌరవించుట లేదు. నేను అపవిత్రము చేయబడితిని.

27. వారిలో అధికారులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింపజేయుటలోను తాముప్టిన యెరను చీల్చు తోడేళ్ళవలె నున్నారు.

28. ప్రవక్తలు మ్టిగోడకు సున్నము పూసినట్లుగా ఈ పాపకార్యములనెల్ల కప్పిపెట్టుచున్నారు. వారు అనృత దర్శనములను చూచుచున్నారు. అబద్ధప్రవచనములు చెప్పుచున్నారు. వారు యావే ప్రభుడనైన నా పలుకు లను విన్పించుచున్నట్లు కన్పించుచున్నారు. కాని నేను వారికి నా పలుకులను తెలియజేయలేదు.

29. ధన వంతులు మోసమునకును, దొంగతనమునకును పాల్పడుచున్నారు. పేదలను పీడించి, పరదేశులను వంచించుచున్నారు.

30. నేను దేశమును పాడుచేయ కుండునట్లు, దాని ప్రాకారములను దిట్టపరుచుటకు ప్రాకారసందులలో నిలుచుటకు అర్హులైనవారు ఎవరై నను ఉన్నారాయని ఎంత వెదకినను ఒకడును కనపడ డాయెను.

31. కావున నేను వారిపై నా కోపమును క్రుమ్మరింతును. వారి దుష్కార్యములకుగాను నా కోపాగ్నితో వారిని భస్మము చేయుదును. ఇది ప్రభువు వాక్కు.”