5. సొలోమోను సూక్తులు

రెండవ సంకలనము

25 1.      ఈ క్రిందివి కూడ సొలోమోను సూక్తులే.

వీనిని యూదా  రాజగు హిజ్కియా ఆస్థాన పండితులు

ఎత్తి వ్రాసిరి:

2.           విషయములను మరుగుచేయుట

               దేవుని మహిమ.

               సంగతులను శోధించుట రాజుల ఘనత.     

3.           ఉన్నతమైన ఆకాశమువలె, అగాధమైన భూమివలె

               రాజుల హృదయములుకూడ ఎరుగ శక్యముకానివి.

4-5. వెండినుండి మష్టు తొలగించినచో

               అది శుద్ధిని పొంది తళతళలాడును.

               రాజు కొలువులోనుండి

               దుర్మార్గులను తొలగించినచో

               అతని రాజ్యము ధర్మబద్ధమై వెలయును.

6-7. రాజు ఎదుట గొప్పవాడవుగా కన్పింపవలదు.

               అధికుని యెదుట మీ గొప్పలు ప్రదర్శింపవలదు.

               నీవు ఇటు పైకిరమ్మని పిలిపించుకొనుట గౌరవము.

               కాని నీ ఆసనమును మరియొకనికిమ్మని

               అనిపించుకొనుట అవమానకరము.

8.           నీవు నీ కింతో ఏ కార్యమునైన చూచినచో

               త్వరపడి న్యాయస్థానమున

               అభియోగము తేవలదు.

               అచటెవరైన సాక్షి నిన్ను ప్రతిఘించినచో

               నీవేమి చేయుదువు?

9-10. నీవును నీ పొరుగువాడును కలహించినచో

               మీ వాదములు మీరు పరిష్కరించుకోవలయునేగాని

               నీవతని ఇతర రహస్యములను పొక్కనీయరాదు.

               లేనిచో రహస్యములు దాచలేనివాడవని

               లోకులు నిన్ను నిందింతురు.

11.           ఉపయుక్తముగా పలుకబడిన మాట

               వెండిపళ్ళెరమున ఉంచబడిన

               బంగారు పండ్లవలెనుండును.

12.          వినయవిధేయతలు గలవారికి

               పెద్దవారి మందలింపులు

               బంగారపు ఉంగరమువలెను,

               శ్రేష్ఠమైన సువర్ణాభరణమువలెను విలువైనవి.

13.          కోతకాలపు బెట్టలో కురిసినమంచువలె

               నమ్మదగినదూత తనను పంపినవారికి

               ఆహ్లాదము చేకూర్చును.

14           నరుడు వాగ్ధానముచేసి వస్తువులను ఈయకుండుట

               మబ్బు గాలి ఆర్భాటము చేసియు

               వాన కురియకుండుట వింది.

15.          శాంతవచనములతో రాజునుగూడ

               ఒప్పింపవచ్చును.

               మృదువైన జిహ్వ గ్టియెముకనుగూడ

               విరుగగొట్టును.

16-17. తేనెనుగూడ మితము మీరి భక్షింపరాదు.

               భక్షించినచో వాంతి అగును.

               అట్లే పొరుగువాని ఇంికికూడ

               మాిమాికి వెళ్ళరాదు.

               వెళ్ళినచో అతనికి విసుగెత్తి నిన్ను చీదరించుకొనును.

18.          తోడివారి మీద అబద్ధసాక్ష్యములు చెప్పువాడు

               కత్తివలె, గదవలె, వాడి బాణమువలె హానికరుడు.

19.          ఆపదలో నమ్మగూడని వానిమీద ఆధారపడుట

               పిప్పిపింతో నములుట వింది,

               కుింకాలితో నడచుట వింది,  

20.        విచారముగా ఉన్నవానియెదుట

               పాటలు పాడుటవింది,

               చలిగానున్నపుడు

               చొక్కాయిని తీసివేయుటవింది,

               పుండుమీద కారము చల్లుటవింది.

21-22. నీ శత్రువులు ఆకలిగొనియున్నచో

               అన్నము పెట్టుము.

               దప్పికగొనియున్నచో దాహమిమ్ము.

               అటులచేసినచో నీవతనిని

               అవమానమున ముంచినట్లగును.

               ప్రభువు నిన్ను బహూకరించును.

23.        ఉత్తరపుగాలివలన వాన తప్పకవచ్చును.

               చాడీలు చెప్పుటవలన కోపము తప్పకకలుగును.

24.         సణుగుకొను భార్యతో కాపురము చేయుటకంటె

               ఇంిమిద్దె మీద ఒకప్రక్కన పడియుండుట మేలు.

25.        దప్పికగొనినవానికి చల్లని నీర్లో,

               దూరదేశమునుండి వచ్చిన చల్లని కబురట్లు

26. సత్పురుషుడు దుష్టునికి చిక్కి భ్రష్టుడగుట

               చెలము ఎండిపోవుట వింది,

               బావి మలినమగుట వింది.

27.         తేనెను మితముమీరి ఆరగించుట మంచిదికాదు.

               అధికముగా పొగడ్తను బడయుటకూడ మేలుకాదు.     

28.        తనను తానదుపులో పెట్టుకోలేనివాడు

               ప్రాకారములు లేకుండ

               రక్షణను కోల్పోయిన నగరము వింవాడు.