కోతకాలపు పాట

ప్రధానగాయకునికి

తంత్రివాద్యములతో పాడదగిన దావీదు గీతము

67 1.      దేవా! మా మీద దయజూపి

                              మమ్ము దీవింపుము.

                              నీ ముఖకాంతిని

                              మా మీద ప్రకాశింపనిమ్ము.

2.           అప్పుడు సకలజాతులు

               నీ మంచితనమును తెలిసికొనును.

               సకల జాతులు

               నీ రక్షణమును అర్థము చేసికొనును.

3.           దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక!

               సకలజాతులు నిన్ను కొనియాడునుగాక!

4.           అన్యజాతులు ఆనందనాదముతో

               కీర్తనలు పాడునుగాక!

               నీవు జాతులకు న్యాయముతో తీర్పుతీర్తువు.

               భూమి మీది జాతులనెల్ల నడిపించునది నీవే.

5.           దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక!

               సకలజాతులు నిన్ను కొనియాడునుగాక!

6.           పొలము పంట పండినది.

               దేవుడు, మన దేవుడు, మనలను దీవించెను.

7.            దేవుడు మనలను ఆశీర్వదించెను.              

               నేల నాలుగుచెరగుల వరకునుగల

               జనులెల్లరు అతనిని గౌరవింతురుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము