57 1. నీతిమంతులు వినాశనము చెందుదురు.
కాని దానినెవరును మనస్సున పెట్టరు.
దుష్టుల కపటయోచనలనుండి
తప్పించుటకై, నీతిమంతులు
వారినుండి తీసుకొనిపోబడుదురు.
దీనిని ఎవరును యోచింపరు.
2. ధర్మబద్ధముగా జీవించువారు
చనిపోయినపిదప శాంతిని బడయుదురు.
3. మాంత్రికుల పుత్రులారా!
వ్యభిచారిణుల సుతులారా!
వేశ్యల తనయులారా! మీరు తీర్పునకురండు.
4. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు!
మీ నాలుకలు చాచి ఎవరిని గేలిచేయుచున్నారు?
మీరు పాపాత్ములు, అసత్యవాదులు
5. మీరు సింధూరముల క్రింద,
ప్రతి పచ్చనిచెట్టుక్రింద కామక్రియలు సల్పుదురు.
ఏరుల చెంతగల కొండగుహలలో
మీ పసిబిడ్డలను బలియిత్తురు.
విగ్రహారాధనమును గూర్చి శోకగీతము
6. మీరు ఏరులలోని గుండ్రాళ్ళను
దైవములుగా కొలుచుచున్నారు.
వాని ముందట పానీయార్పణగా
ద్రాక్షారసమును పోయుచున్నారు.
వానికి ధాన్యబలులు అర్పించుచున్నారు.
ఈ కార్యములవలన
నేను ప్రీతిజెందెదను అని అనుకొింరా?
7. మీరు ఎత్తయిన కొండలమీది కెక్కిపోయి,
అక్కడ కామక్రియలు సల్పి
బలులర్పించుచున్నారు.
8. మీ గడపకును, తలుపునకును చేరువలోనే విగ్రహమును నెలకొల్పితిరి.
మీరు నన్ను తిరస్కరించి, బట్టలు విప్పుకొని,
వెడల్పుగానున్న మంచముల మీదికెక్కి,
మీరు డబ్బిచ్చి పొత్తుజేసికొనిన
కాముకులతో శయనించి,
మీ కామతృష్ణను తీర్చుకొనుచున్నారు.
9. అత్తరులను, లేపనములను పూసికొని
మోలెకుదేవతను కొలువబోవుచున్నారు.
మీరు అన్యదైవములను వెదకుటకు
పాతాళలోకమువరకును దూతలను పంపుదురు.
10. మీరు పరదేవతను వెదకివెదకి అలసిపోయితిరి.
అయినను మీ పట్టుదలను విడువనైతిరి.
మీ విగ్రహములు
మీకు బలమును ఒసగునని భావించితిరి.
కనుక అలసట చెందరైతిరి.
11. మీరు ఈ దైవములకు భయపడి
నన్నువిడనాడితిరి, నన్ను పూర్తిగా విస్మరించితిరి.
కాని మీ దైవములు ఏపాివారు?
నేను ఇంతకాలము
కన్నులు మూసికొని ఊరకుండినందున
మీరు నాకు భయపడరైతిరి కాబోలు.
12. మీరు మీ కార్యములు
మంచివే అనుకొనుచున్నారు.
కాని నేను మీ ప్రవర్తనను
బట్టబయలు చేయుదును.
మీ విగ్రహములు మీక్టిె సాయముచేయలేవు.
13. మీరు మొరప్టిెనపుడు
అవి మిమ్ము ఆదుకోగలవేమో చూతము.
అవి నరుడు విడిచిన శ్వాసవలె ఎగిరిపోవును.
కాని నన్ను నమ్మువాడు
భూమిని స్వాధీనముచేసికొనును.
నా పవిత్రపర్వతమును భుక్తము చేసికొనును.
ఓదార్పు గీతము
14. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”మార్గము నిర్మింపుడు, బాట సిద్ధము చేయుడు.
త్రోవలోని ఆటంకములనెల్ల తొలగించి
నా జనులను తిరిగిరానిండు”.
15. మహోన్నతుడు శాశ్వతుడు
పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు:
”నేను ఉన్నతమైన
పవిత్రస్థలమున వసించువాడను.
అయినను వినయాత్ములును,
పశ్చాత్తాపమనస్కులైన వారితోను వసింతును.
వారికి నూత్నబలమును దయచేయుదును.
16. నా ప్రజలను నిరంతరము నిందింపను.
వారిమీద సదా కోపింపను.
అట్లయిన నేను జీవమొసగిన నరులు,
ఆత్మయందు క్షీణించిచత్తురు.
17. వారి పాపములకును, దురాశకును
నేను వారిమీద కోపించితిని.
వారిని శిక్షించి చేయివిడచితిని.
ఆ జనులు మొండితనముతో
తమదారిన తామువెళ్ళిపోయిరి.
18. నేను వారి చెయిదములను గమనించితిని.
అయినను వారిని స్వస్థపరుచుదును,
వారిని నడిపింతును. శోకార్తులను ఓదార్తును.
వారి నోట స్తుతిపలుకులు పలికింతును.
19. సమీపముననున్న వారికి దూరముననున్న
వారికి కూడ శాంతినిదయచేయుదును.
నా ప్రజలకు చికిత్సచేయుదును.
20. దుష్టులు సంక్షోభముచెందిన
సముద్రము వింవారు.
దాని అలలు మ్టిని మురికిని వెళ్ళగ్రక్కును.
21. దుష్టులకు శాంతిలేదు సుమా!”
ఇవి ప్రభువు పలుకులు.