అబ్షాలోము సైన్యములు ఓడిపోవుట

18 1. దావీదు తన సైన్యములను లెక్కించి వేయి మందికి, నూరుమందికి అధిపతులను నియమించెను.

2. అతడు సేనలను మూడుభాగములుచేసి యోవాబును ఒక భాగమునకు, అతని తమ్ముడు అబీషయిని ఇంకొక భాగమునకు, గిత్తీయుడు ఇత్తయిని వేరొక భాగమునకు నాయకులను చేసెను. తానుగూడ దండులతో పోరు నకు పోవ సమకట్టెను.

3. కాని అతని దళములు ”నీవు రావలదు. మేము ఓడిపోయినచో ఎవరికిని బాధ కలుగదు. మాలో సగముమంది గతించినను ఎవరికిని దిగులు పుట్టదు. కాని నీ వొక్కడివే మాబోివాండ్రు పదివేలమందికి సరిసమానుడవు. పైగా నీవు పట్టణ ముననే ఉన్నచో ఎప్పికప్పుడు మాకు క్రొత్తదళము లను పంపుచుండవచ్చును” అని అనిరి.

4. రాజు ”సరియే, మీరు చెప్పినట్లే కానిండు” అనెను. అంతట వందలమందితో, వేలమందితో సైన్యములు కదలి పోవుచుండగా దావీదు నగరద్వారమువద్ద నిలుచుండి వీక్షించెను.

5. అతడు యోవాబు, అబీషయి, ఇత్తయి లతో ”నా మొగము చూచియైన ఆ పడుచువాడు అబ్షాలోముపై చేయిచేసికొనకుడు” అని ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేనానాయకులకు ఇి్ట ఆజ్ఞ ఇచ్చెనని సైనికు లందరును తెలిసికొనిరి.

6. దావీదు సైన్యములు యిస్రాయేలీయుల మీదికిపోయెను. ఎఫ్రాయీము అడవిలో ఇరువైపులవారికి పోరుజరిగెను.

7. దావీదు దండులు యిస్రాయేలీయులను తునుమాడెను. వారి పక్షమున ఇరువదివేలమంది కూలిరి. 8. అడవి యందంతట పోరునడచెను. కత్తివాదరకెరయైన వారికంటె ఆ కారడవిలో చిక్కి మడిసిన వారే ఎక్కువ.

అబ్షాలోము మృతి

9. అడవిలో దావీదు అనుచరులకు అబ్షాలోము ఎదురుపడెను. అతడు ఒక కంచర గాడిదనెక్కి వచ్చు చుండెను. ఆ కంచరగాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టుకొమ్మల క్రిందుగా సోగి పోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింకి మింకి మధ్య వ్రేలాడజొచ్చెను. అతడెక్కిన కంచరగాడిద కదలిపోయెను.

10. అపుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో ”అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు” అని చెప్పెను.

11. యోవాబు అతనితో ”నీవు అబ్షాలోమును చూచి చావబొడిచి నేలమీద కూలద్రోయకేల విడిచితివి? నేను నీకు పదివెండినాణెములు, నడికట్టు బహూకరించి యుండెడివాడనుగదా” అనెను.

12. కాని ఆ సైనికుడు ”పదిగాదుగదా వేయివెండికాసుల నిచ్చినను నేను రాజకుమారునిపై చేయిచేసికొనను. మేము వినుచుండ గనే రాజు నిన్ను, అబీషయిని, ఇత్తయిని పడుచువాడైన అబ్షాలోమును ముట్టుకోవలదని ఆజ్ఞాపించెనుగదా?

13. కపటబుద్ధితో నేను అతనిని పొడిచియుందునేని, రాజు తప్పక తెలిసికొనెడివాడు.  అపుడు రాజు దగ్గర నీవుకూడా నాకు విరోధివియగుదువుకదా!” అని పలి కెను.

14. యోవాబు ఇపుడు నీతో కాలయాపనము చేయనేల అని పలికి మూడు బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడెడి అబ్షాలోము గుండెలో పొడిచెను.

15. వెంటనే యోవాబు అంగరక్షకులు పదిమంది అబ్షాలోముపై పడి అతనిని మట్టుప్టిెరి.

16. అంతట యోవాబు బాకానూది పోరు చాలింపుడని తన అనుచరుల నాజ్ఞాపించెను. వారు యిస్రాయేలీయులను వెన్నాడుటమానిరి.

17. యోవాబు భటులు అబ్షాలోము శవమును అడవిలో ఒక లోతైన గోతిలో పడవేసిరి. దానిమీద పెద్ద రాళ్ళగుట్ట నిలిపిరి. యిస్రాయేలీయులు పారిపోయి తమతమ గుడారము లలో జొరబడిరి.

18. అబ్షాలోము బ్రతికియుండగనే తన జ్ఞాప కార్థముగా రాజు లోయలో ఒక స్తంభము నిలిపెను. అతడు ”నా పేరు నిలబెట్టుటకు కుమారులెవరును లేరుగదా!” అనుకొని ఆ కంబమునకు తన పేరు పెట్టుకొనెను. నేికిని అది అబ్షాలోము కంబమనియే పిలువబడుచున్నది.

దావీదు అబ్షాలోము మరణవార్త వినుట

19. సాదోకు కుమారుడగు అహీమాసు యోవాబుతో ”నేను పరుగెత్తుకొనిపోయి రాజునకు శుభవార్త వినిపింతును. యావే రాజుశత్రువులను రూపుమాపెనని విన్నవింతును” అనెను.

20. కాని యోవాబు ”ఓయి! నేడేమి శుభవార్తలు వినిపింప గలవు? మరియొకనాడు వినిపించిన వినిపింప గలవేమోగాని నేడు మాత్రము శుభవార్తలేమియు లేవు. రాజపుత్రుడు కాలముచేసెనుగదా!” అనెను.

21. ఇట్లని యోవాబు కూషీయుని ఒకనిని పిలిచి ”వెళ్ళి నీవు కన్నది రాజునకు ఎరిగింపుము” అనెను. అతడు యోవాబునకు దండము ప్టిె రివ్వున పరుగుతీసెను.

22. సాదోకు కుమారుడు అహీమాసు మరల యోవాబుతో ”ఆరు నూరైనను నూరారైనను కూషీయు నితో పాటు నేను కూడ పరుగిడవలసినదే” అనెను. యోవాబు ”ఓయీ! నీవు ఊరకే పరుగిడనేల. నీ వార్తలకు నేడు ప్రతిఫలమేమియు ముట్టదుసుమా!” అని చెప్పెను.

23. అతడు మరల ”ఏమైనను కానిమ్ము. నేనిపుడు దౌడు తీయకతప్పదు” అని పలికెను. యోవాబు ”సరియే పొమ్ము” అనెను. అహీమాసు పొలమునకు అడ్డముగాపడి పిక్కబలముతో కూషీయుని కంటె ముందుగా పరుగుతీసెను.

24. దావీదు నగర జంటగుమ్మముల నడుమ కూర్చుండియుండెను. నగరమునకు కావలికాయువాడు గుమ్మము పైబురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారజూడగా, ఒంటరిగా పరుగెత్తుకొనివచ్చు వాడొకడు కంటపడెను.

25. వెంటనే అతడు రాజునకు ఆ సంగతి గొంతెత్తి విన్నవించెను. రాజు ”అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని మేలివార్త కొని వచ్చుచుండును” అనెను. అంతలో ఆ పరుగిడువాడు దగ్గరకు వచ్చెను.

26. అపుడు కావలివాడు పరుగువెట్టు వానిని వేరొకడును చూచి అదిగో మరియొకడు ఒంటరిగా పరుగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారరక్షకుని తట్టు తిరిగి చెప్పగా, దావీదు ”అతడును మేలి వార్త లనే గొనివచ్చుచుండును” అనెను.

27. కావలి బంటు ”నేను ముందట ఉరుకు వానిని గుర్తుప్టితిని. సాదోకు కొడుకు అహీమాసువలె ఉన్నాడు” అనెను. దావీదు ”అతడు చాల మంచివాడు కనుక మంచి కబురులే కొనివచ్చుచుండును” అనెను.  

28. అహీమాసు దావీదు దగ్గరకు వచ్చి ”రాజా! శుభము” అని నేలమీదికి సాష్టాంగనమస్కారము చేసి ”రాజుపై తిరుగబడినవారిని మనవశము చేసిన యావే దేవుడు స్తుతింపబడునుగాక!” అని పలికెను.

29. రాజు ”పడుచువాడు అబ్షాలోము క్షేమముగానున్నాడా?” అని అడిగెను. అహీమాసు ”యోవాబు నన్నిచటకు పంపుచుండగా అక్కడ కలకలమొకి వినిపించినది. కాని దాని భావమేమో నాకుతెలియదు” అనెను.

30. రాజు ”నీవు ప్రక్కకు తొలగినిలువుము” అనెను. అతడట్లే తొలగినిలచెను.

31. అంతట కూషీయుడును వచ్చి ”ప్రభువుల వారికి శుభము. దేవరమీద తిరుగబడినవారిని రూపు మాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగతీర్చు కొనెను” అని పలికెను.

32. రాజు ”కుఱ్ఱడు అబ్షాలోము కుశలమేగదా!” అని ప్రశ్నించెను. కూషీయుడు ”రాజు శత్రువులకు, రాజుపై తిరుగబడి అతనికపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి ప్టిన గతియే పట్టునుగాక!” అనెను.

Previous                                                                                                                                                                                                    Next