దేవుని తీర్పు
2 1. ఓ మనుష్యుడా! ఇతరులకు నీవు తీర్పు చెప్పుదువా! ఎవరివైనను నీకు తగదు . ఏలయన, ఇతరు లకు తీర్పుచెప్పుచు నీవే అట్టి కార్యములు చేయు చుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు.
2. అట్టి కార్యములొనర్చు వారిపై దేవునిదండన న్యాయసమ్మతమే.
3. మిత్రమా! వేనికొరకై ఇతరు లకు తీర్పుచెప్పుచుందువో, వానినే నీవు చేయుచు న్నావుగదా! అటులైనచో, నీవు దేవునిదండనను తప్పించుకొనగలననుకొందువా?
4. లేక, నీవు దేవుని నిండుదయను, సహనమును, ఓర్పును తృణీకరించు చున్నావా? దేవునిదయ నీ హృదయపరివర్తన నిమిత్తమే అని ఎరుగవా!
5. నీ హృదయము కఠిన మైనది, మొండిది. కనుకనే, దేవుని ఆగ్రహమును, న్యాయమగు తీర్పును వ్యక్తపరుపబడు ఆనాడు నీ శిక్షను నీవే ఎక్కువ చేసికొనుచున్నావు.
6. ఏలయన, వాని వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తిని బహూ కరించును.
7. ఓర్పుతో సత్కార్యములు చేయుచు, కీర్తి, ప్రతిష్ఠ, అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వతజీవమును ఒసగును.
8. కాని, విభేదములు కలిగించుచు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహ మును, రౌద్రమును కురియించును.
9. దుష్కార్యము లొనర్చు ప్రతి వ్యక్తికి కష్టములు, బాధలు తప్పవు. మొదట యూదులకు, తదుపరి గ్రీకులకు కూడ అవి వచ్చును.
10. కాని సత్కార్యములు చేయు ప్రతివ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసా దించును. మొదట యూదులకు, ఆపై గ్రీకులకు కూడ అవి కలుగును.
11. ఏలయన, దేవుడు అందరును సమానముగా చూచును కదా!.
12. మోషే ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధము లేకుండానే నాశనమగుదురు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపముకట్టుకొన్న యూదులు, ఆ ధర్మశాస్త్రము వలననే దండింపబడుదురు.
13. ఏలయన, కేవలము ధర్మ శాస్త్రమును వినుట మాత్రముచే కాక, ధర్మశాస్త్రము నందలి నియమములను అనుసరించుట చేతనే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులు గావింప బడుదురు.
14. జాతులకు ధర్మశాస్త్రము లేదు. కాని వారికై వారు స్వభావసిద్ధముగా ధర్మశాస్త్రము నందలి శాసనములను పాటించినచో, వారు ధర్మ శాస్త్రము లేనివారే అయినను, వారికి వారే ఒక ధర్మ శాస్త్రమగుదురు.
15. ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడియున్నదని వారి ప్రవర్తనయే చాటును. ఇదియే యథార్థమేయని వారి అంతరాత్మ కూడ నిరూపించును. ఏలయన, వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును.
16. మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నింటికి యేసుక్రీస్తు ద్వారా, దేవుడు తీర్పుచేయు ఆ రోజున నేను బోధించు సువార్తానుసారముగ ఇట్లే జరుగును.
యూదులు – ధర్మశాస్త్రము
17. నీ విషయమేమి? యూదుడనని నీవు చెప్పుకొందువుగదా? ధర్మశాస్త్రము పై ఆధారపడి దేవుని యందు నీ గొప్పలు చెప్పుచుందువు గదా!
18. దేవుని చిత్తము నీకు తెలియును. మంచిని ఎన్ను కొనుటను నీవు ధర్మశాస్త్రము నుండి నేర్చు కొంటివి.
19. నీవు గ్రుడ్డివారికి మార్గదర్శకుడవని, చీకిలో ఉన్న వారికి దీపమని, 20. మూర్ఖులకు బోధకుడవని, పిన్నలకు గురువువనియు నీవెరిగినదే. విజ్ఞానపరిపూర్ణత, సత్యసంపూర్ణత అనునవి ధర్మ శాస్త్రము నందు ఇమిడియున్నవని నీవు నమ్ముచు న్నావు.
21. మరి ఇతరులకు బోధించు నీవు, నీకు నీవే ఎందుకు బోధించుకొనవు? దొంగిలింపకుము అని బోధింతువు గదా! కాని, నీవు దొంగిలింతువా?
22. వ్యభిచరింపకుము అని చెప్పుచున్న నీవు వ్యభిచ రింతువా? విగ్రహములను అసహ్యించు కొనుచున్న నీవు దేవాలయములను దోచుకొందువా?
23. నీకు దేవుని ధర్మశాస్త్రమున్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా?
24. ఏలయన:
”యూదులారా! మిమ్ము బట్టి అన్యజనులు
దేవుని నామమును దూషించుచున్నారు”
అని వ్రాయబడియున్నది.
25. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది. కాని నీవు ధర్మ శాస్త్రమునకు విధేయత చూపనిచో, సున్నతి లేనట్లే.
26. ఒకవేళ సున్నతిపొందని అన్యుడు ధర్మశాస్త్రము యొక్క నియమ ములను పాటించినచో దేవుడు అతనిని సున్నతి పొందిన వానినిగ భావింపడా?
27. అప్పుడు మీరు అన్యులచే తీర్పు పొందుదురు. ఏలయన, వ్రాత రూపమున ధర్మశాస్త్రమును పొందియు, సున్నతి కలిగి యుండియు, మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘింతురు. కానివారు శారీరకముగ సున్నతిని పొందక ధర్మ శాస్త్రమునకు విధేయత చూపుదురు.
28. నిజమైన యూదుడు బాహ్యముగ మాత్రమే యూదుడైన వాడు కాడు. అట్లే, నిజమైన సున్నతి బాహ్యశారీరక సున్నతి కాదు.
29. అంతరంగమున యూదుడైన వాడు నిజమైన యూదుడు. అసలైనసున్నతి హృదయ మునకు సంబంధించినది. అది ఆధ్యాత్మికమైనదే కాని వ్రాత పూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. అట్టివాడు మనుష్యులచే కాక దేవునిచే మెప్పు పొందును.