దైవపుత్రులు – మానవాంగనలు

1. మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి. వారికి కుమార్తెలు ప్టుిరి.

2. దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి, వారిలో తమకు నచ్చినవారిని పెండ్లాడిరి.

3. కాని దేవుడు ”నా ఆత్మ మనుష్యునితో ఎల్లప్పుడును వాదించదు. అతడు భౌతికదేహము ధరించిన దుర్బలప్రాణి. నరుడు నూట యిరువది యేండ్లు మాత్రమే బ్రతుకును” అని తలంచెను.

4. ఆ రోజులలో భూమిపై నెఫీలులను మహాకాయులు ఉండిరి. దేవపుత్రులు2 మానవస్త్రీలను కూడగా జన్మించినవారే ఈ మహాకాయులు. వారే ప్రసిద్ధుల యిన పురాతనవీరులు.3

జల ప్రళయము మనుష్యుల దుర్బుద్ధి

5. భూమిపైగల మానవులు పరమదుష్టులై పోయిరి. వారు ఎల్లప్పుడు చెడుపనులు చేయవలె ననియే తలంచుచుండిరి.

6. ఇదిచూచి దేవుడు భూమిమీద మానవుని సృష్టించినందులకు పరితాపము నొంది హృదయములో నొచ్చుకొనెను.

7. అంతట దేవుడు ”నేనే సృష్టించిన ఈ మానవజాతిని జంతువు లతో, ప్రాకెడుపురుగులతో, పకక్షులతో సైతము భూమి మీద కానరాకుండ మొదలంట తుడిచి వేయుదును. ఈ  మానవులను సృజించినందులకు చింతించు చున్నాను” అని అనుకొనెను.

8. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను.

9. నోవా వంశచరిత్ర ఇది: నోవా నీతిమంతుడు. తన కాలమువారిలో ఉత్తముడు. దేవునకు సహచరుడై జీవించెను.

10. అతనికి షేము, హాము, యాఫెతు అను ముగ్గురు కుమారులు ఉండిరి.

11. భూమిమీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించు కొనుచుండిరి.

12. దేవుడు పరిశీలించి చూచెను. భూలోకము పూర్తిగా చెడిపోయెను. సర్వ మానవులు దుష్టులైరి.

నోవా ఓడను నిర్మించుట

13. దేవుడు నోవాతో ఇట్లనెను: ”మానవులకు చివరిగడియలు సమీపించినవి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. వారిని సర్వనాశ నము చేయవలెనని నిశ్చయించుకొింని.

14. చితి సారకపు చెట్టుకొయ్యతో నావను నిర్మింపుము. దానిలో గదులను ఏర్పరుచుము. నావకు లోపల వెలుపల కీలువేయుము.

15. ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు మూడువందల మూరలు, వెడల్పు ఏబదిమూరలు, ఎత్తు ముప్పదిమూరలు.

16. ఓడకు పై కప్పు ఉండవలయును. అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందికి కికీ వ్రాలునట్లు చూడుము. ఒక ప్రక్కన తలుపును అమర్పుము. ఓడకు పై భాగమున ఒక అంతస్తు, నడుమ ఒక అంతస్తు, క్రింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము.

17. ఆకాశము క్రింద ప్రాణమున్న ప్రతి శరీరి నాశనమగునట్లు నీిలో భూమిని తెప్పలదేలింతును. భూమిమీద ఉన్న ప్రతిప్రాణి నాశనమైపోవును.

18. కాని నేను నీతో ఒడంబడిక చేసికొందును. నీవు ఓడలోనికి వెళ్ళుము. నీవేకాదు. నీ భార్య, నీ కొడుకులు కోడండ్రు అందరును ఓడలోనికి రావలెను.

19. నీతోపాటు బ్రతికి ఉండుటకు ప్రతిజాతి ప్రాణులను  రెండేసి చొప్పున ఓడలోనికి కొనిరమ్ము. వానిలో ఒకి ఆడుది, మరియొకి మగది అగునట్లు చూడుము.

20. అన్నిరకముల పకక్షులు, మృగములు, ప్రాకెడు పురుగులు ఒక్కొక్క జంటచొప్పున బ్రతుకుటకై నీయొద్దకు చేరును.

21. నీవు అన్ని విధములైన ఆహారపదార్థములను సేకరించి ఓడలో నిలువ జేయుము. ఆ ప్రాణులకును, నీకును అవియే ఆహార మగును.”

22. నోవా ఏమరుపాటు లేకుండ దేవుడు ఆజ్ఞాపించినట్టే చేసెను.

Previous                                                                                                                                                                                                 Next                                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము