14 1. నారికి జన్మించిన నరులు అల్పాయుష్కులు,

                              బహువేదనలకు

               గురి అయ్యెడి వారలుకూడ.

2.           వారు పూలవలె వికసించి

               అనతికాలముననే వాడిపోవుదురు.

               కదలిపోవు నీడవలె శీఘ్రమే కనుమరుగై పోవుదురు

3.           ప్రభూ! ఇి్ట నరుడినా నీవు లక్ష ్యము చేయునది?

               ఇి్టవానినా నీవు తీర్పునకు పిల్చునది?

4.           అశుద్ధుడైన నరునినుండి

               శుద్ధ్దగుణమునెవడు వెలికి తీయగలడు?

5.           నరుడెంతకాలము జీవించునో

               నీవు ముందుగనే నిర్ణయించితివి.

               అతడు జీవించు నెలలను నిశ్చయించితివి.

               దాటరాని యెల్లలను అతనికి విధించితివి.

6.           కనుక ఆ పేదనరుని ఇక వదలిపెట్టుము.

               వాని తిప్పలు వాడుపడును.

               బానిసవలె తన దినములు

               ఎలాగో ముగించుకొనును

7.            నరికిన చెట్టు మరల చిగిర్చి

               తిరుగ కొమ్మలుసాచునను ఆశకలదు.

8.           దాని వ్రేళ్ళు ఎండిపోయినను,

               మ్రోడు శిథిలమైపోయినను

9.           నీరు తగులగనే అది మరల చిగురించి

               లేత మొక్కవలె కొమ్మలు వేయును.

10.         కాని నరుడు చనిపోయిన పిమ్మట

               ఏమి మిగులును?

               మానవుడు మరణించిన పిమ్మట

               ఇక ఎక్కడనుండును?

11.           నదులు ఎండిపోయినట్లు,

               సరస్సులు ఇంకిపోయినట్లు

               నరులు మ్టిలోగలిసి పోవుదురు.    

               వారు పండుకొని తిరిగిలేవరు.

12.          పైన ఆకాశము ఉన్నంతకాలము వారు

               మరల లేవరు, దీర్ఘనిద్రనుండి మేల్కొనరు.

13.          ప్రభూ! నీ కోపము చల్లారినవరకు

               నీవు నన్ను పాతాళమున దాచియుంచి,

               అటుపిమ్మట నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనిన

               ఎంత బాగుండును?

14.          చచ్చిన నరుడు మరల బ్రతుకునా?

               కాని నేను మంచిరోజులకొరకు వేచియుందును

               నా కష్టములు తీరువరకు కాచుకొనియుందును

15.          అప్పుడు నీవు నన్ను పిలువగా

               నేను నీకు బదులు పలుకుదును.

               నీవు స్వయముగా సృజించిన నన్ను

               నీవు మరల దర్శింపగోరుదువు.

16.          ఇప్పుడు నీవు నా చర్యలను

               జాగ్రత్తగా గుర్తించుచున్నావు.

               కాని అప్పుడుమాత్రము నా పాపములను గణింపవు

17.          నా అపరాధములను పూర్తిగా క్షమించి

               నా దోషములనెల్ల తుడిచివేయుదువు.

18.          కానికాలము రాగా, కొండలు కూలిపోవును.

               శిఖరములు శిథిలములై పోవును.

19.          జలప్రవాహములు కొండలను అరగదీయును,

               కుంభవర్షములు నేలను కోసివేయును.

               అట్లే నీవు నరుని జీవితాశను

               నాశనము చేయుదువు.

20.        నీవు నరుని అణుగద్రొక్కి అతనిని

               శాశ్వతముగా నాశనము చేయుదువు.

               మనుజుని రూపుమాపి అతనిని

               నీ సమక్షము నుండి బహిష్కరింతువు.

21.          ఆ మీదట అతని తనయులు

               పేరుప్రతిష్ఠలు తెచ్చుకొన్నను,

               అపకీర్తి తెచ్చుకొన్నను అతనికేమియు తెలియదు

22.         అతడు తన దేహబాధను మాత్రము స్మరించుకొనును

               తన ప్రాణమును గూర్చి మాత్రము

               తాను పరితపించును.”   

Previous                                         Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము