1. ప్రభువు గుడారమును నిర్మించుటకు నేర్పును సామర్థ్యమును అనుగ్రహించిన బేసలేలు, ఒహోలియాబు మరియు మిగిలిన పనివారు యావే ఆజ్ఞాపించినట్లే సమస్తకార్యములను చేసి ముగించెదరు.
కానుకలను నిలిపివేయుట
2. దేవుని నుండి నేర్పును సామర్థ్యమును పొంది గుడారమును నిర్మించుటకు పూనుకొనిన పనివారిని, అనగా బేసలేలును, ఒహోలియాబును, మిగిలిన పనివారిని మోషే పిలువనంపెను.
3. గుడారము కట్టుటకై యిస్రాయేలీయులు కొనివచ్చిన కానుకలను మోషేనుండి వారు స్వీకరించిరి. ప్రజలు ప్రతిదినము కానుకలు కొనివచ్చుచునే యుండిరి.
4. అపుడు గుడారమున ఆయావస్తువులు చేయుపనివారందరు తమ పనులను చాలించి, 5. మోషే వద్దకు వచ్చి అతనితో ”ప్రభువు ఆజ్ఞాపించిన వస్తువులు సిద్ధము చేయుటకు అవసరమైన దానికంటె అధిక సామగ్రిని ఈ ప్రజలు తీసికొనివచ్చుచున్నారు” అని చెప్పిరి.
6. కనుక మోషే ”ఆడవారుగాని మగవారుగాని యిక గుడారమును కట్టుటకు కానుకలు కొనిరానక్కరలేదు” అని శిబిరమున వార్త చాించెను. కనుక ప్రజలు కానుకలు తెచ్చుట మానివేసిరి.
7. వారు అది వరకే తెచ్చిన వస్తుసామగ్రి గుడారమును కట్టుటకు సంపూర్ణముగా సరిపోయెను.
గుడారము
8. పనివాండ్రలో మిగుల నిపుణులైన వారు గుడారమును నిర్మించిరి. వారు పదివస్త్రములతో గుడారమును తయారుచేసిరి. అవి ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, పేనిన సన్ననిదారముతో నేయబడియుండెను. వాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను.
9. ప్రతి తెర ఇరువదిఎనిమిది మూరలపొడవు, నాలుగు మూరల వెడల్పు ఉండెను. తెరలన్నికి ఇదియే కొలత.
10. మోషే ఈ తెరలలో ఐదింని కలిపి క్టుించెను. ఆ రీతిగనే మిగిలిన ఐదింనిగూడ కలిపిక్టుించెను.
11. ప్రతి ఐదింలో చివరితెర అంచులకు ఊదా దారముతో ఉచ్చులు వేయించెను.
12. మొది ఐదుతెరలలో మొదిదానికి ఏబది ఉచ్చులు అదే విధముగా రెండవ అయిదుతెరలలో చివరిదానికి ఏబదిఉచ్చులు తగిలించెను.
13. ఏబది బంగారు గుండీలు చేయించి, ఆ ఉచ్చు ముడు లన్నింని కలిపివేసెను. అప్పుడది ఏకమందిరము అయ్యెను.
14. అటుతరువాత అతడు మేకవెంట్రుకలతో పదునొకొండు కంబళి దుస్తులు తయారుచేయించి గుడారముగా మందిరముపై కప్పు వేయించెను.
15. ఈ తెరలు ముప్పది మూరలపొడవు, నాలుగు మూరల వెడల్పు ఉండెను. అన్నికిని అదియే కొలత.
16. వానిలో ఐదింని ఒక తెరగా, ఆరింని మరియొక తెరగా క్టుించెను.
17. ఐదు తెరలలో కడపి దానికి ఏబది ఉచ్చులు, ఆరుతెరలలో కడపి దానికి ఏబది ఉచ్చులు క్టుించెను.
18. ఏబది ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల రెండు కొనలనున్న ఉచ్చులను కలిపి ఒకటే గుడారమగునట్లు గుండీలను ఉచ్చులకు తగిలించి దానికికూర్చెను.
19. ఎఱ్ఱని అద్దకము వేయించిన పొట్టేళ్ళ చర్మముతో గుడారము నకు పైకప్పు వేయించెను. దానిమీద నాణ్యమైన గ్టితోళ్ళతో మరియొక కప్పువేయించెను.
గుడారపు చట్రములు
20. అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలుపు చట్రములు చేయించెను.
21. ప్రతిచట్రము పదిమూరల పొడవు, ఒకిన్నర మూర వెడల్పు ఉండునట్లు చేసెను.
22. ప్రతి చట్రమునకు క్రింద సమదూరమున రెండుకొసలుచెక్కి, వాని సహాయ ముతో చట్రములన్నిని కలిపివేసెను. చట్రము లన్నిని ఈ రీతిగనే రెండుకొసలతో తయారు చేయించెను.
23. గుడారమునకు దక్షిణమువైపున ఇరువది చట్రములు చేయించెను. నలువది వెండి దిమ్మలనుకూడ చేయించి వానిని చట్రముల క్రింద జొన్పించెను.
24. ఒక్కొక్క చట్రపు రెండుకొసలు రెండేసి దిమ్మల లోనికి చొచ్చుకొని పోయెను.
25. ఆ రీతిగనే గుడారపు ఉత్తరభాగమునకు ఇరువది చట్రములు చేయించెను.
26. నలువది వెండిదిమ్మలు గూడ చేయించి ఒక్కొక్క చట్రము క్రింద రెండు దిమ్మల చొప్పున అమర్చెను. 27. పడమర నున్న గుడారపు వెనుక భాగమునకు ఆరుచట్రములు చేయించెను.
28. వెనుకి భాగపు రెండు మూలలకు రెండు చట్రములు చేయించెను.
29. ఈ మూల చట్రము లను క్రింది భాగమునుండి మీది భాగమున మొది కడియము వరకు ఒకదానితో ఒకి కలిసికొని పోవునట్లు చేసెను. అతడు వెనుకి మూల చట్రములు రెండింని తయారుచేసిన వైనమిది.
30. కనుక వీనితోకలిపి ఇవి మొత్తము ఎనిమిది చట్రములు, వానిక్రింద పదునారు వెండి దిమ్మెలు అయ్యెను. 31. అతడు తుమ్మకొయ్యతో అడ్డకఱ్ఱలు గూడ చేయించెను.
32. ఉత్తరమున నున్న చట్రము లన్నిని ఒక్కిగా కలిపివేయుటకు ఐదింని, దక్షిణపువైపున నున్న చట్రములన్నిని ఒక్కిగా కలిపివేయుటకు ఐదింని, పడమవైపున నున్న చట్రములన్నిని ఒక్కిగా కలిపి వేయుటకు ఐదింని తయారుచేయించెను.
33. చట్రముల మధ్యనున్న అడ్డకఱ్ఱ, చట్రముల సగమెత్తు నడిమికి ఒక కొననుండి మరియొక కొనవరకు చట్రములలో దూరియుండినట్లు చేయించెను.
34. చట్రములకు బంగారమును పొదిగి, వానికి బంగారు కడియము లను వేయించెను. అడ్డకఱ్ఱలకు గూడ బంగారము పొదిగి వానిని కడియములలో జొన్పించెను.
గుడారమునందలి అడ్డుతెర
35. అతడు అడ్డుతెరను తయారు చేయించెను. అది పేనిన దారముతో ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో నేయబడియుండెను. దాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను.
36. ఆ తెరను నాలుగు తుమ్మస్తంభములకు వ్రేలాడ దీసెను. ఆ స్తంభములను బంగారముతో పొదిగి, వానికి బంగారుకొక్కెములు తగిలించెను. ఆ స్తంభము లను వెండి దిమ్మలలో అమర్చెను.
37. గుడారపు ద్వారమునకుగూడ తెరను తయారుచేయించెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో నేయబడియుండెను. దానిమీద కళాత్మకమైన అల్లికలు కలవు.
38. ఈ తెరను కట్టుటకు ఐదు తుమ్మస్తంభములను చేయించి వానికి కొక్కెములు తగిలించెను. ఆ స్తంభముల పై భాగము లను, వానిలోనుండి దూరిపోవు కఱ్ఱలను బంగార ముతో పొదిగించెను. స్తంభములను ఇత్తడి దిమ్మెలలో బిగించెను.