స్త్రీలు
9 1. నీవు అనురాగముతో చూచుకొను భార్యను
శంకింపకుము.
శంకింతువేని ఆమెను నీకు కీడు చేయ
ప్రోత్సాహించినట్లగును.
2. ఏ స్త్రీకిని మనసిచ్చి దాసుడవుకావలదు.
3. పరకాంతతో సాంగత్యమువలదు,
నీవు ఆమె వలలో చిక్కుకొందువు.
4. పాటకత్తెతో చెలిమి వలదు,
ఆమె నిన్ను బుట్టలోవేసికొనును.
5. కన్నెవైపు వెఱ్ఱిగా చూడకుము,
ఆమెకు నష్టపరిహారము చెల్లింపవలసివచ్చును.
6. వేశ్యకు హృదయమును అర్పింపకుము.
నీ ఆస్తి అంతయు గుల్లయగును.
7. నగరవీధులలో నడచునపుడు
నలువైపుల తేరిపారచూడకుము.
నరసంచారములేని తావులలోనికి పోవలదు.
8. అందకత్తె ఎదురుపడినపుడు
నీ చూపులు ప్రక్కకు త్రిప్పుకొనుము.
పరకాంత సౌందర్యముమీదికి మనసు పోనీకుము స్త్రీ సౌందర్యమువలన చాలమంది తప్పుత్రోవప్టిరి
అది అగ్నివలె ఉద్రేకజ్వాలలను రగుల్కొల్పును.
9. పరకాంత సరసన కూర్చుండి భోజనము చేయకుము
ఆమెతో కలిసి పానీయము సేవింపకుము.
నీవు ఆమె ఆకర్షణనకు లొంగిపోయి,
ఉద్రేకమునకు గురియై,
స్వీయనాశనము తెచ్చుకోవచ్చును.
తోడి నరులతో మెలగవలసిన తీరు
10. పాతమిత్రుని పరిత్యజింపకుము.
క్రొత్తమిత్రుడు అతనికి సాిరాడు.
నూత్న మిత్రుడు నూత్న ద్రాక్షారసము వింవాడు
పాతపడిన పిదపగాని
మధువుసేవించుటకు ఇంపుగానుండదు.
11. పాపి విజయమునుగాంచి అసూయ చెందవలదు
వానిక్టిె వినాశనము దాపురించునో నీవెరుగవు.
12. దుష్టులు అనుభవించు
ఆనందములను ఆశింపకుము.
బ్రతికియుండగనే వారికి శిక్షపడును.
13. నిన్ను చంపగోరు వానికి దూరముగా ఉండుము,
అప్పుడు నీవు మృత్యుభయమును
తప్పించుకొందువు.
అతని వద్దకు వెళ్ళవలసి వచ్చెనేని జాగ్రత్తతో మెలగుము.
లేదేని అతడు నిన్ను మట్టుపెట్టును.
నీవు ఉచ్చులనడుమ నడుచుచున్నావని,
అపాయమునకు గురికానున్నావనియు
గ్రహింపుము.
14. నీ ఇరుగుపొరుగు వారిని గూర్చి
బాగుగా తెలిసికొనుము.
జ్ఞానులను మాత్రమే సలహా అడుగుము.
15. విజ్ఞులతో మాత్రమే సంభాషణ జరుపుము.
మహోన్నతుని ధర్మశాస్త్రము గూర్చి
మాత్రమే సంభాషింపుము.
16. సజ్జనుల సరసన మాత్రమే
కూర్చుండి భుజింపుము.
దైవభీతియే నీ గొప్పతనమనుకొనుము.
17. నేర్పరియైన పనివాడు
తాను చేసిన వస్తువుద్వార కీర్తిబడయును.
నాయకుడు తన పలుకులద్వారా గణతికెక్కును.
18. వదరుబోతును చూచి ఎల్లరును దడియుదురు.
నోికివచ్చినట్లు వాగునని అందరును
వానిని అసహ్యించుకొందురు.