పాస్కను జరుపుకొనుటకు సన్నాహములు
35 1. యోషీయా యెరూషలేమున పాస్క ఉత్సవ మును జరిపించెను. మొదినెల పదునాలుగవ దిన మున పండుగకు పశువులను వధించిరి.
2. అతడు దేవాలయమున యాజకులను వారివారి పనులకు నియమించెను. వారిని ప్రోత్సహించి వారు తమ బాధ్యతలను సంతృప్తికరముగా నిర్వర్తించునట్లు చేసెను.
3. లేవీయులు ప్రజలకు బోధకులు, ప్రభువునకు అంకితులుగదా! రాజు వారితో ”మీరు దావీదు కుమారుడగు సొలోమోను క్టిన మందిర మున పవిత్రమందసమును పదిలపరుపుడు. ఇక మీదట మీరు దానిని భుజములపై మోసికొని పోనక్కర లేదు. మీరు ప్రభువును, అతని ప్రజను సేవించిన చాలును.
4. దావీదు రాజును, అతని కుమారుడైన సొలోమోనును మీకు ఒప్పగించిన బాధ్యతల ప్రకారము మీరు మీ వంశముల వారిగా మీమీ స్థానములలో నుండి దేవాలయమున పరిచర్యచేయుడు.
5. మీలో మీరు బృందములుగా ఏర్పడి యిస్రాయేలు కుటుంబముల కెల్ల దేవాలయమున సేవలుచేయుడు.
6. పాస్క ఉత్సవమున బలిగా సమర్పించు పశువులను మీరు వధింపవలెను. కనుక మిమ్ము మీరు శుద్ధిచేసికొనుడు. మీ తోి యిస్రాయేలీయులుకూడ ప్రభువు మోషే ద్వారా జారీచేసిన ఆజ్ఞలు పాించునట్లు మీరు వారికి తోడ్పడుడు” అని చెప్పెను.
పాస్క పండుగను జరుపుకొనుట
7. పాస్క పండుగలో పాల్గొను ప్రజలకొరకు యోషీయా రాజు తన సొంతమందల నుండి ముప్పది వేల మేకపిల్లలను, గొఱ్ఱెపిల్లలను ఇచ్చెను. మూడువేల కోడెలను ఇచ్చెను.
8. అధిపతులు ప్రజలకును, యాజ కులకును, లేవీయులకును బలిపశువులను ఇచ్చిరి. దేవాలయాధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు దేవాలయమున అర్పించుటకు యాజకులకు రెండు వేల ఆరువందల గొఱ్ఱెపిల్లలను, మేకపిల్లలను ఇచ్చిరి. మూడువందల కోడెలనిచ్చిరి.
9. లేవీయుల నాయకు లైన కొనన్యా, షెమయా, అతని సోదరుడు నెతనేలు, హషబ్యా యేయీయేలు, యోసాబాదు ఐదు వేల గొఱ్ఱె పిల్లలను లేవీయులకిచ్చిరి. ఐదువందల కోడెలను గూడ ఇచ్చిరి.
10. పాస్కోత్సవమునకు ఎల్ల కార్య ములును సిద్ధముకాగా రాజాజ్ఞను అనుసరించి యాజకులును, లేవీయులును వారి వారి స్థానములలో నిలిచిరి.
11. లేవీయులు గొఱ్ఱెపిల్లలను వధించి వానిని బలికి సిద్ధముచేసిరి. యాజకులు వాని నెత్తుిని బలిపీఠముపై చిలుకరించిరి.
12. ప్రజలకు వారివారి వంశములననుసరించి దహనబలికిగాను పశువులను యాజకులకిచ్చిరి. వారు ధర్మశాస్త్ర నియమముల ప్రకారము ఆ బలులు అర్పింపవలయును. కోడలెను కూడ అట్లే పంచియిచ్చిరి.
13. పాస్కా నియమ ములను అనుసరించి పాస్క పశువులను నిప్పులపై కాల్చిరి. పవిత్ర నైవేద్యములను కుండలలోను, పెనము లలోను, బోవాణములలో వండి త్వరత్వరగా ప్రజలకు వడ్డించిరి.
14. ఈ కార్యము ముగిసిన తరువాత లేవీ యులు తమ కొరకును, అహరోను వంశజులైన యాజకులకొరకును పాస్క పశువులను సిద్ధము చేసికొనిరి. యాజకులు రాత్రియగువరకు దహన బలులు అర్పించుటయందును, కొవ్వును వ్రేల్చుట యందును నిమగ్నులైయుండిరి. కనుక లేవీయులే దహనబలి పశుమాంసమును సిద్ధము చేయవలసి వచ్చెను.
15. ఆసాపు, హేమాను, దావీదునకు దీర్ఘ దర్శియైన యెదూతూను మరియు ఆసాపు వంశము నకు చెందిన సంగీతకారులును పూర్వము దావీదు జారీచేసిన ఉత్తర్వులననుసరించి వారివారి స్థానము లలో నిలిచిరి. దేవాలయద్వారములకు కావలికాయు వారు తమ స్థానములలోనుండి కదలవలసిన అవ సరము కలుగలేదు. లేవీయులే వారికి సిద్ధముచేసిరి.
16. ఆ రీతిగా యోషీయా ఆజ్ఞలననుసరించి ఆ దినము ప్రభువును ఆరాధించుటకును, పాస్కోత్సవ మును జరుపుకొనుటకును, బలిపీఠముమీద దహన బలిని అర్పించుటకును ఎల్లకార్యములు సిద్ధమాయెను.
17. అచట హాజరైన యిస్రాయేలీయులెల్లరును ఏడు దినములపాటు పాస్కోత్సవమును పొంగనిరొట్టెల పండుగను జరుపుకొనిరి.
18-19. ప్రవక్త సమూవేలు కాలమునుండి యిస్రాయేలీయులలో ఇి్ట పాస్క ఉత్స వము ఎన్నడును జరుగలేదు. యోషీయా, యాజకులు, లేవీయులు, యిస్రాయేలు, యూదా యెరూషలేము ప్రజలును కలిసి యోషీయా రాజు పరిపాలనాకాలము పదునెనిమిదియవయేట జరుపుకొనిన ఈ పాస్కోత్స వము విం ఉత్సవమును పూర్వము రాజులెవరును జరిపియుండలేదు.
విషాదకరమైన మరణము
20. యోషీయా దేవళమును చక్కదిద్దుటకు ఈ కార్యములెల్ల నిర్వహించినపిదప ఐగుప్తు ఫరోయగు నెకో తనదండుతో యూఫ్రీసు నదీతీరమునందలి కర్కెమీషు మీదికి దండెత్తిపోవుచుండగా యోషీయా అతనినెదిరింపబోయెను.
21. కాని ఫరో యోషీయాకు ఈ క్రింది సందేశమంపెను: ”యూదారాజా! ఈ యుద్ధముతో నీక్టిె సంబంధములేదు. నేను నా శత్రువులతో పోరాడవచ్చితినిగాని నీ మీదికిరాలేదు. దేవుడు నన్ను త్వరగా పోరు ప్రారంభింపుమనెను. ఆయన నా పక్షమున ఉన్నాడు. ఇప్పుడు నీవు నన్నెదిరింతువేని ఆయన నిన్ను నాశనము చేయును.”
22. కాని యోషియా నెకోతో పోరాడనెంచెను. నెకోరాజు ద్వార దేవుడు వినిపించిన పలుకులు అతడు ఆలింపడయ్యెను. కనుక అతడు మారువేషమున పోయి మెగిద్దో మైదానమున జరిగిన యుద్ధములో పాల్గొనెను. 23. యుద్ధమున విలుకాండ్రు యోషీయాను బాణములతోకొట్టగా అతడు తన సేవకులతో ”నేను మిగులగాయపడితిని. మీరు నన్ను వెలుపలికి కొని పొండు” అనెను.
24. సేవకులు అతనిని తన రథము మీదినుండి ఎత్తి మరియొక రథముమీద కూర్చుండబ్టెి యెరూషలేమునకు కొనివచ్చిరి. అచట అతడు మృతి నొందగా, తన పితరులసమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదీయులు, యెరూషలేము పౌరులెల్లరును అతని మృతికి సంతాపము తెల్పిరి.
25. రాజు మృతికి యిర్మీయా శోకగీతమును రచించెను. నేికిని యోషీయా మృతికి సంతాపము తెల్పునపుడు యిస్రాయేలు గాయనీగాయకులు ఈ గీతమును ఆలపించుట ఆచారమైయున్నది. ఈ పాట విలాపవాక్యములలో కన్పించును.
26-27. యోషీయా చేసిన ఇతరకార్యములు, ప్రభువుపట్ల అతడు చూపిన భక్తి, ధర్మశాస్త్రముపట్ల అతడు ప్రదర్శించిన విధేయత, మొదినుండి తుదివరకును అతని క్రియలన్నియు యూదా యిస్రాయేలురాజులచరితమున లిఖింప బడియే యున్నవి.