అంతియోకసు మరణము,  దేవాలయమునకు శుద్ధి

8 1. యూదా మక్కబీయుడు, అతని అనుచరులు రహస్యముగా గ్రామగ్రామము తిరిగి యూద మతమును నిష్ఠతో పాించువారిని ఆరువేల మందిని ప్రోగుజేసి కొనిరి.

2. వారు వివిధజాతులచే పీడింపబడు యూద జాతిని, అన్యజాతులు అమంగళము చేసిన దేవాలయ మును, పాడుపడి నేలమట్టమైయున్న యెరూషలేము నగరమును కరుణతో చూడుమని దేవునికి మనవి చేసిరి.

3. మరియు ప్రభువు హత్యకు గురియైన వారి మొరను ఆలింపవలెననియు, 4. అన్నెముపున్నెము ఎరుగని పసిబిడ్డలను చంపినవారిని, తనను దూషించిన వారిని దండింపవలెననియు వేడుకొనిరి.

5. యూదా మక్కబీయుడు తన జనమును ప్రోగు జేసికొనిరాగా, అన్యజాతివారు అతనిని ఎదిరింప జాలరైరి. ప్రభువు పూర్వము యూదులమీద కోపము చూపెను. కాని ఇప్పుడు ఆ కోపము  కరుణగా  మారెను. 

6. యూదా తలవని తలంపుగా నగరముల మీదను, పల్లెలమీదను, దాడిచేసి వానిని కాల్చివేయ మొద లిడెను. కీలకమైన దుర్గములను పట్టుకొని శత్రువులను తరిమికొట్టెను.

7. అతడు మామూలుగా రాత్రులలో ఈ దాడులు చేసెడివాడు. ప్రజలెల్లరు అతడి పరాక్రమ మును గూర్చి చెప్పుకొనసాగిరి.

తొలి విజయములు

8. యెరూషలేమునకు పాలకుడుగానున్న ఫిలిప్పు మక్కబీయుడు నానాికి బలము పుంజుకొని విజయ ములు సాధించుచున్నాడని గ్రహించెను. కనుక అతడు పెద్దసిరియాకు అధిపతిగానున్న ప్టోలమీకి కమ్మ వ్రాసెను. అతడు సేనలను పంపి రాజునకు సహాయము చేయ కోరెను.

9. ప్టోలమీ, నికానోరును సైన్యాధిపతిగా ఎన్ను కొనెను. అతని తండ్రియగు పోక్లసు రాజమిత్రులలో అగ్రగణ్యుడు. ప్టోలమీ  యూద జాతినంతిని తుడిచి పెట్టుటకుగాను నానాజాతులనుండి ఇరువది వేల మంది సైనికులనెన్నుకొని, వారిని నికానోరు వెంట పంపెను. నికానోరునకు తోడుగా  రణరంగమున కాకలు తీరిన గోర్గియాసును కూడ పంపెను.

10. ఆంతియోకసు రాజు రోమీయులకు రెండువేల వీసెల వెండి అప్పు బడియుండెను. పోరున బందీలైన యూదులను బాని సలుగా అమ్మి ఆ అప్పులను తీర్పవచ్చునని నికానోరు ఆశించెను.

11. కనుక అతడు వెంటనే సముద్రతీర నగరములకు మనుష్యులను పంపి తాము వీసె వెండికి తొంబదిమంది యూద బందీలను బానిసలుగా అమ్ము చున్నామని ప్రకటనము చేయించెను. కాని సర్వోన్న తుడైన ప్రభువు నికానోరునకు ఎి్ట తీర్పు విధింపను న్నాడో అతడికి తెలియదయ్యెను.

12. నికానోరు సైన్యముతో తన మీదికి దండెత్తి వచ్చుచున్నాడని యూదా వినెను. అతడు తన అను చరులకు ఆ సంగతి తెలియజేసెను.

13. వారిలో పిరికివారు, ప్రభువు సహాయమును నమ్మనివారు వెంటనే కాలికి బుద్ధి చెప్పిరి.

14. మిగిలినవారు తమ ఆస్తి పాస్తులను అమ్ముకొనిరి. దుర్మార్గుడు నికానోరు తమను కలువకముందే, అతనిచే బానిసలుగ అమ్మ బడినవారిని కాపాడమని వారు ప్రభువును వేడుకొనిరి.

15. వారు ప్రభువు తమకొరకు తమను కాపాడకు న్నను, పూర్వము తాను పితరులతో చేసికొనిన నిబంధ నను బ్టియు, ఇప్పుడు తమను తన ప్రజగా ఎన్ను కొనుట బ్టియు, తమను కాపాడవలెనని మనవి చేసికొనిరి.

16. యూదా తన ఆరువేల మంది బంటులను ప్రోగుజేసికొనెను. శత్రువులనుచూచి భయపడవలదని వారిని హెచ్చరించెను. అకారణముగా తమమీదికి దాడిచేసిన అన్యజాతి వారి బలమును చూచి వెనకంజ వేయవలదని చెప్పెను. ధైర్యముతో పోరాడుడని వారిని ప్రోత్సహించెను.

17. అన్యజాతి వారు దేవాలయ మును నాశనము చేసి, యెరూషలేమును పాడుచేసి, యూదుల ఆచారములను మంటగలిపిరని చెప్పెను.

18. ”శత్రువులు వారి ఆయుధములమీదను, సాహసము మీదను ఆధారపడవచ్చుగాక. మనము మాత్రము సర్వోన్నతుడైన దేవునిమీద ఆధారపడువారలము. ఆయన తల ఊపినంతనే ఈ శత్రుసైన్యములేకాక సర్వప్రపంచము బుగ్గి అగును”  అని పలికెను.

19. ఇంకను యూదా పూర్వము ప్రభువు యూదులకు తోడ్పడిన సందర్భములనుగూడ వారికి జ్ఞప్తికితెచ్చెను. సన్హెరీబు కాలమున శత్రువులు లక్షఎనుబదిఐదు వేల మంది మడిసిరి.

20. బబులోనియా దేశమున జరిగిన గలాతియా యుద్ధమున ఎనిమిది వేలమంది యూదులు ఆపదలోనున్న నాలుగువేలమంది మాసిడోనియనులకు సాయముచేసిరి. ఆ ఎనిమిదివేలమంది దైవబలముతో నూట ఇరువదివేలమంది గలతీయులను ఓడించి కొల్లసొమ్మును దోచుకొనిరి.

21. సైనికులు యూదా మాటలు విని ధైర్యము తెచ్చుకొని తమదేశముకొరకును, ధర్మశాస్త్రము కొర కును ప్రాణములు అర్పించుటకుకూడ సంసిద్ధులైరి. అతడు తన సైన్యమును నాలుగుభాగములుగా విభ జించెను.

22. ఒక్కొక్క దానిలో పదిహేనువందల మంది సైనికులుండిరి. ఆ నాలుగు భాగములకు తాను, తన ముగ్గురు సోదరులగు సీమోను, యోసేపు,   యోనాతాను  నాయకులైరి.

23. అంతట అతడు ఎలియాసరును పవిత్రగ్రంథము చదివి వినిపింపుమని ఆజ్ఞాపించెను. ”ప్రభువు నుండి మనకు సహాయము లభించును” అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. తదనంతరము తన దళముతోపోయి నికానోరు సైన్య ముమీదపడెను.

24. ప్రభువు వారి తరపున పోరాడగా వారు శత్రుసైన్యమున తొమ్మిదివేలమందిని చంపిరి. చాల మందిని గాయపరచిరి. విరోధి బలగమునంతిని తరిమిక్టొిరి.

25. తమను బానిసలుగా కొనవచ్చిన వారియొద్దనుండి సొమ్ము లాగుకొనిరి. అటుపిమ్మట శత్రువులను చాలదూరమువరకు వెన్నాడి వెనుకకు మరలివచ్చిరి.

26. విశ్రాంతిదినము ప్రారంభము కానున్నది కనుక విరోధులను ఇంకను దూరమువరకు తరుమజాలరైరి.

27. తదనంతరము శత్రువుల ఆయు ధములను, కొల్లసొమ్మును ప్రోగుజేసికొని విశ్రాంతి దినమును పాించిరి. ఆ దినమున ప్రభువు వారిపట్ల తనకుగల కరుణకు మొది ఆనవాలు చూపెను గనుక వారతనిని కొనియాడిరి. 28. విశ్రాంతిదినము ముగిసిన పిదప కొల్లసొమ్ములో కొంతభాగమును హింసలకు గురియైనవారికి, వితంతువులకు, అనాథబాలలకు పంచియిచ్చిరి. మిగిలిన సొమ్మును తామును, తమ పిల్లలును కలిసి పంచుకొనిరి.

29. అటుపిమ్మట బహి రంగ ప్రార్థనము జరిపి కరుణాళువైన ప్రభువును తమపై దయచూపుమని వేడుకొనిరి.

తిమొతి, బఖిడసులు ఓడిపోవుట

30. యూదులు తిమొతి, బఖిడసులమీద కూడ యుద్ధముచేసి వారి సైనికులను ఇరువదివేలమందిని హతముచేసిరి. ఎత్తయిన దుర్గములు పట్టుకొని చాల కొల్లసొమ్మును దోచుకొనిరి. ఆ సొమ్మును తామును, వితంతువులును, అనాథ శిశువులును, వృద్ధులును, హింసలకు గురియైనవారు సమానముగా పంచుకొనిరి.

31. వారు శత్రువుల ఆయుధములను ప్రోగుజేసి ఆయా ముఖ్యమైన తావులలో భద్రపరచిరి. కొల్ల సొమ్మును మాత్రము యెరూషలేమునకు కొనిపోయిరి.

32. యూదులు తిమొతి సైన్యముల అధిపతిని మట్టు ప్టిెరి. అతడు పరమ దుర్మార్గుడు. యూదులను చాల తిప్పలుప్టిెనవాడు.

33. ఇంకను వారు యెరూషలేమున విజయోత్సవమును జరుపుకొనుచు దేవాలయ ద్వార ములను తగులబ్టెినవారిని బంధించి సజీవముగా దహించిరి. వారిలో కలిస్తెనీసుకూడ ఉండెను. అతడొక చిన్న ఇంిలో దాగుకొనియుండి పట్టుబడెను. ఆ రీతిగా వారు తమ దుర్మార్గమునకు తగిన ప్రతిఫలమును అనుభవించిరి.

నికానోరు పారిపోవుట

34. పరమ దుర్మార్గుడైన నికానోరు యూదులను కొనుటకుగాను వేయిమంది బేరగాండ్రను తీసికొని వచ్చెనుగదా!

35. అతడు ఎవరిని చిన్నచూపు చూచెనో వారిచేతనే, దైవబలమువలన ఓడింపబడెను. అతడు తాను తాల్చియున్న వైభవోపేతములైన ఉద్యోగ వస్త్ర ములను తొలగించి పలాయనము చిత్తగించు బానిస వలె ఒంటరిగా పొలముగుండ పారిపోయెను. తన సైన్యమునంతిని కోల్పోయెనుగాని అదృష్ట వశమున తానుమాత్రము ప్రాణములతో అంియోకియా చేరుకొనెను.

36. యెరూషలేము పౌరులను బానిస లుగా అమ్మి రోమునకు బాకీపడియున్న సొమ్మును తీర్పగోరిన ఇతడు కడన యూదులు అజేయులని తెలిసికొనెను. వారు ప్రభువు దయచేసిన ఆజ్ఞలు పాించిరి కనుక ప్రభువే వారికి రక్షకుడయ్యెను.