3. మానవ చరిత్రలో జ్ఞానము, దేవుడు

ఆదాము

10 1.       లోకమునకు పితయు,

               దేవునిచే మొదిగా రూపొందింపబడినవాడును

               తానొక్కడే సృష్టింపబడినపుడు,

               అది అతనిని స్వీయ అతిక్రమమునుండి కాపాడెను.

2.           అతనికి అన్నిని పాలించు బలమునిచ్చెను.

కయీను

3.           ఒక పాపాత్ముడు కోపముతో,

               జ్ఞానమును తృణీకరించెను.

               కనుక అతడు ఆగ్రహముతో

               సోదరుని హత్యకు పాల్పడి నశించెను.

నోవా

4.           అతని పాపమువలన భూమి

               జలప్రళయమున మునిగిపోగా,

               జ్ఞానము ధరణిని మరల కాపాడెను.

               అదియొక పుణ్యపురుషుని

               చిన్న కొయ్యపడవపై నడిపించెను.

అబ్రహాము

5.           అన్యజాతులు దుష్కార్యములుచేసి

               అవమానమున మునిగియున్నపుడు,

               జ్ఞానమొక ధర్మాత్మునెన్నుకొని అతడు దేవుని

               సమక్షమున నిర్దోషిగామనునట్లు చేసెను.

               ఆ పుణ్యాత్మునికి మనోధైర్యము నొసగి

               తడు తన పుత్రుని కొరకు

               పరితపింపకుండునట్లు చేసెను.

లోతు

6.           దుర్మార్గులెల్ల నాశమగునపుడు

               జ్ఞానమొక సజ్జనుని కాపాడెను.

               పంచనగరములను దహించు

               అగ్నినుండి అతడు తప్పించుకొనెను.

7.            ఆ నగరముల దుష్కార్యములకు సాక్ష్యముగా

               నేికిని అచి పొలములు పంటపండక,

               పొగ వెళ్ళగ్రక్కుచున్నవి.

               అచి చెట్లు కాయలు కాయునేగాని అవి పండవు. దేవుని నమ్మని వ్యక్తికి సాక్ష్యముగా

               అచటనొక ఉప్పుకంబము నిలిచియున్నది.

8.           ఆ పట్టణముల పౌరులు జ్ఞానమును

               అనాదరము చేసిరి.

               కనుక మంచిని గుర్తింపజాలరైరి.

               మరియు వారు తమ తెలివితక్కువతనమునే

               తమకు గుర్తుగా వదలిపోయిరి.

               వారి తప్పిదములను లోకము

               ఏనాడును మరచిపోదు.

9.           కాని జ్ఞానము తన భక్తులను

               ఆపదలనుండి కాపాడును.

యాకోబు

10.         తన అన్న కోపమునకు వెరచి పారిపోవు

               పుణ్యశీలుని జ్ఞానము

               ఋజుమార్గమున నడిపించెను.

               అది అతనికి దైవరాజ్యమును చూపించెను.

               పరిశుద్ధవస్తువులను గూర్చి తెలియజేసెను.

               అతని కార్యములు విజయవంతములై

               సత్ఫలితము నొసగునట్లు చేసెను.

11.           ఆశపోతులు అతని సొత్తు దోచుకొనబోగా

               జ్ఞానమతనికి అండగా నిలిచి

               అతనిని సంపన్నుని చేసెను.

12.          అది అతనిని శత్రువుల నుండి కాపాడెను.

               విరోధులు పన్నిన ఉచ్చులనుండి

               అతనిని రక్షించెను. ఘోరమైన పోరాటమున

               అతనికి విజయము నొసగెను.

               దైవభక్తికిమించిన శక్తిలేదని

               అతడు గ్రహించునట్లు చేసెను.

యోసేపు

13.          వినయాత్ముడొకడు బానిసగా అమ్ముడుపోగా

               జ్ఞానమతనిని విడనాడదయ్యెను.

               పాపము నుండి అతనిని కాపాడెను.

14.          అది అతనితోపాటు చెరలోనికి వెళ్ళెను.

               అతనికి సంకెళ్ళు పడినపుడు

               అతనిని పరిత్యజింపదయ్యెను.

               అతనికి రాజ్యాధికారము సంపాదించిపెట్టెను.

               అతనిని  పీడించిన జనులపై

               అతనికి అధికారము దయచేసెను.

               ఆ పుణాత్మునిపై నేరము మోపినవారు

               దుష్టులని నిరూపించి,

               అతనికి శాశ్వతకీర్తిని సంపాదించి పెట్టెను.

ఐగుప్తు నుండి వెడలివచ్చిన యిస్రాయేలీయులు

15.          జ్ఞానము పవిత్రులును, నిర్దోషులైన ప్రజలను

               పీడకులబారినుండి కాపాడెను.   

16.          అది ఒక దైవభక్తుని హృదయము లోనికి

               ప్రవేశించి తన అద్భుతముల ద్వారా

               భయంకరులైన రాజులను ఎదిరించెను.         

17.          పునీతులైన ప్రజలకు వారి కష్టములకు తగిన

               ఫలితమొసగెను.

               వారిని అద్భుతమార్గమున నడిపించెను.

               పగిపూట వారికి వెలుగునొసగెను.

               రేయి నక్షత్రకాంతి నొసగెను.

18.          వారిని ఎఱ్ఱసముద్రముగుండ నడిపించెను.

               మహాజలరాశిగుండ ముందునకు కొనిపోయెను.

19. ఆ ప్రజల శత్రువులను మాత్రము మ్రింగివేసి,

               వారిని మరల సముద్రగర్భము నుండి

               బయికి వెళ్ళగ్రక్కెను.

20. ఆ రీతిగా పుణ్యాత్ములు దుష్టులను దోచుకొనిరి.

               ప్రభూ! ఆ సజ్జనులు నీ దివ్యనామమును స్తుతించిరి.

               తమను కాపాడినందులకుగాను

               నిన్ను ఏకకంఠముతో కొనియాడిరి.

21.          జ్ఞానము మూగవారికి పలుకులొసగెను.

               చింబిడ్డలు కూడ మాటలాడునట్లు చేసెను.