దావీదు సౌలును చంపక వదలివేయుట

24 1. సౌలు ఫిలిస్తీయులతో పోరాడివచ్చిన పిమ్మట దావీదు ఎంగెడీ కొండస్థలములలో ఉన్నాడని వార్తలు వచ్చెను.

2. అతడు యిస్రాయేలీయుల నుండి మూడువేలమంది యోధులనెన్నుకొని దావీదును, అతని బలగమును పట్టుకొనుటకై అడవిమేకలు వసించు కొండకు తూర్పువైపుగా పయనమైపోయెను.

3. అచట త్రోవచెంత గొఱ్ఱెలదొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యములకై గుహ ప్రవేశించెను. అపుడు దావీదు కూడ అనుచరు లతో ఆ గుహాంతరముననే దాగియుండెను.

4. సౌలు కంటబడగానే దావీదు బలగమువారు ”నేడు శత్రువును నీ చేతికప్పగించెదను. అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననిన ప్రభువచనము నెరవేరినది గదా!” అనిరి. అపుడు దావీదు మెల్లగాపోయి సౌలుకు తెలియ కుండగనే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను.

5. కాని తరువాత దావీదు అి్ట పని చేసినందు లకు మిక్కిలి చింతించెను.

6. అతడు అనుచరులతో ”నా యజమానునకు కీడు తలపెట్టను. రాజునకు ద్రోహము చేయను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడుగాక!” అనెను.

7. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను.

8. అంతట సౌలు గుహవెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదుకూడ గుహవీడి వెలుపలకు వచ్చి ”ప్రభూ!” అని సౌలును కేకవేసెను. సౌలు వెనుకకు తిరిగి చూచెను. దావీదు నేలమీదికి వంగి సాష్టాంగ నమస్కారము పెట్టెను.

9. అతడు సౌలుతో ”దావీదు నీకు కీడుతలపెట్టెనని కొండెములు పలుకు వారిని నీవు విశ్వసింపనేల?

10. నేడు ప్రభువు నిన్ను కొండబిలమున నా చేతిలోని వానినిగా చేసెను గదా! అయినను నేను ‘రాజు మీద చేయిచేసికోరాదు. అతడు ప్రభువు అభిషిక్తుడు’ అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును.

11. పైగా, ప్రభూ! ఇటు చూడుము. నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితి ననిన, నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని ఋజువగుట లేదా? నేను నీకు ద్రోహము చేయలేదు. అయినను నీవు నన్ను వెాండి నా ప్రాణ ములు తీయగోరుచున్నావు.

12. మన ఇరువురికిని ప్రభువే తీర్పరిగా ఉండుగాక! నాకొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినను నేను మాత్రము నీమీద చేయిచేసి కొనను.

13. ఏదో సామెత చెప్పినట్లు, దుష్టులనుండి దౌష్ట్యము పుట్టుచున్నది. అయిననేమి నేను మాత్రము నీ మీదికిరాను.

14. యిస్రాయేలురాజు ఎవరివెంట బడుచున్నాడు?, ఏపాివాడిని తరుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కనుకదా! ఒక మిన్నల్లినిగదా!

15. మన కిరువురకు ప్రభువే తీర్పుతీర్చును. అతడే నా వ్యాజ్యెము చేప్టి తీర్పుచేసి నీ బారినుండి నన్ను కాపాడుగాక!” అని పలికెను.

16. దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా, సౌలు దావీదుతో ”ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా?” అని పెద్దపెట్టున ఏడవ సాగెను.

17. సౌలు దావీదుతో ”నా కంటె నీవు నీతి మంతుడవు. నేను నీకు కీడుతలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి.

18. నేడు నాపట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి! యావే నన్ను నీ చేతికప్పగించెను. అయినను నీవు నన్ను చంపవైౖతివి.

19. చేజిక్కిన శత్రువునెవడైన పోనిచ్చునా? నాయనా నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలుచేయుగాక!

20. నీవు రాజువగుదువని నాకు నిక్కముగా తెలియును. నీవలన యిస్రాయేలు రాజ్యము స్థిరపడును.

21. కనుక నేను దాిపోయిన తరువాత మా వంశీయు లను రూపుమాపనని, మాపూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావేపేరిట బాసచేయుము” అనెను.

22. దావీదు అట్లే బాసచేసెను. అటుపిమ్మట సౌలు ఇంికి మరలిపోయెను. దావీదు అనుచరు లతో కూడ కొండగుహలకు వెడలిపోయెను.

Previous                                                                                                                                                                                                 Next