తూరు

26 1. అంతట పదునొకొండవ యేడు, మాసపు మొదిదినమున ప్రభువు వాక్కు నాతో ఇట్లనెను:

2. ”నరపుత్రుడా!

               యెరూషలేమును గూర్చి తూరు ఇట్లనెను:

               ‘ఆహా! జాతులు ప్రవేశించు ద్వారము విందైన

               యెరూషలేము నాశనమయ్యెను.

               దాని సంపద ధ్వంసమయ్యెను.

               అదిక నాతో పోీ పడజాలదు.

               కనుక నేను వృద్ధిలోనికి వత్తును.’

3.           కనుక యావేప్రభుడనైన నేనిట్లు నుడువుచున్నాను.

               తూరు నగరమా! నేను నీకు శత్రువునగుదును.

               నేను పెక్కుజాతుల ప్రజలను నీమీదికి గొనివత్తును.

               వారు సాగర తరంగములవలె నీ మీదికెత్తివత్తురు.

4.           వారు నీ ప్రాకారములను,

               బురుజులను పడగొట్టుదురు.

               నేను నీ ధూళినంతిని తుడిచివేసి,

               నీయందు వ్టి కొండబండను

               మాత్రము మిగుల్తును.

5.           సాగరగర్భముననున్న ఆ కొండబండపై

               బెస్తలు తమ వలలను ఎండబెట్టుకొందురు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

               అన్యజాతి ప్రజలు నిన్ను దోచుకొందురు.

6.           వారు తమ కత్తులతో నీ చుట్టుపట్ల ఉన్న

               నగరములోని నరులను వధింతురు.

               అపుడు నీవు నేను ప్రభుడనని గుర్తింతువు”

7.            యావే ప్రభుడనైన నా పలుకిది:

               ”నేను ఉత్తరదిక్కునుండి రాజాధిరాజైన

               నెబుకద్నెసరును నీ మీదికి గొనివత్తును.

               అతడు మహాసైన్యముతోను,

               గుఱ్ఱములు, రథములు, రౌతులతోను వచ్చును.

8.           నీ చుట్టుపట్ల ఉన్న నగరములలోని

               ప్రజలు పోరున చత్తురు.

               అతడు నీ చుట్టును ముట్టడిదిబ్బలు పోయును

               గుంతలు తవ్వును, డాళ్ళను గోడవలె పేర్చును

9.           గోడలనుకూల్చు యంత్రములతో

               నీ గోడలు పడగొట్టును.

               ఇనుప గడెలతో నీ బురుజులు కూల్చును.

10.         అనంతమైన అతని అశ్వదళము

               లేపిన ధూళి నిన్ను క్రమ్మును.

               అతడు బండ్లను, రథములనులాగు

               గుఱ్ఱములతో వచ్చి శత్రువు తాను జయించిన

               నగరమునందువలె నీ యందు ప్రవేశించి

               కూలిపోయిన నీ ద్వారములగుండ

               పోవునపుడు జనించిన శబ్దము వలన

               నీ గోడలు దద్దరిల్లును.

11.           అతని రౌతులు నీ వీధులను ఆక్రమించి

               నీ ప్రజలందరిని ఖడ్గముతో వధింతురు.

               నీ మహాస్తంభములు నేలకొరగును.

12.          శత్రువులు నీ సొత్తును,

               వర్తకపు సరకును దోచుకొందురు.

               నీ గోడలుకూల్చి సుఖప్రదములైన

               నీ ఇండ్లను బ్రద్దలు చేయుదురు.

               నీ బండలను, కలపను, రాతి ముక్కలను ఎత్తి

               సముద్రమున పడవేయుదురు.

13.          నేను నీ పాటలను మాన్పించెదను.

               నీ తంత్రీవాద్యముల నుండి

               సంగీతము వెలువడనీయను.

14.          బెస్తలు తమ వలలను ఆరబెట్టుకొనుటకు

               నీ యందు వ్టి కొండబండను మాత్రము

               మిగుల్తును. ఇక నిన్నెప్పికిని పునర్నిర్మింపరు.

               ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

15. యావే ప్రభువు తూరుతో ఇట్లు నుడువు చున్నాడు: ”శత్రువులు నిన్ను జయించినపుడు, వారి కత్తికి బలియైన నీ పౌరుల ఆర్తనాదములను విని నీ తీరములందు వసించు ప్రజలు భీతిల్లుదురు.

16. సముద్ర తీరవాసుల రాజులు తమ సింహాసనముల మీదినుండి క్రిందికి దిగుదురు. వారు తమ రాజ వస్త్రములను, బ్టుాలు వేసిన ఉడుపులను తొలగించి, గడగడవణకుచు నేలపై చతికిలబడుదురు. వారు నీ పతనమును గాంచి భీతిల్లి శరీరకంపమును ఆపుకో జాలకుందురు.

17. వారు నీపై ఈ శోకగీతము పాడుదురు.

               ‘సుప్రసిద్ధ నగరమా! నీవు నాశనమైతివి గదా!

               సముద్రము నుండి నిన్ను తొలగించిరిగదా!

               నీవు సాగరముల నేలితివి.

               నీవును నీ పౌరులును తీర వాసులనెల్ల

               గడగడ లాడించితిరి.

18. నీవు పతనమైన దినమున ద్వీపములు తల్లడిల్లెను.

               నీ వినాశనమును గాంచి ద్వీపములు

               నిర్ఘాంతపోయెను.’

19. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు: నేను నిన్ను నాశనముగావించి నిర్జన నగరమును చేయు దును. నిన్ను అగాధ జలములలో ముంచివేయుదును.

20. నిన్ను మృతలోకమునకు పంపుదును. అచట నీవు పురాతన ప్రజలను కలిసికొందువు. పాతాళమున శాశ్వతశిథిలములమధ్య మృతులతో కలిసివసింతువు. నరులు నీ యందు మరల వసింపరు. నీవు మరల జీవవంతుల లోకమున కనిపింపవు.

21. నిన్ను తలంచుకొని ఎల్లరును భీతిచెందుదురు. నీవు అంత మగుదువు. జనులు నీ కొరకు గాలింతురుగాని నీవు కనిపింపవు.”