బారూకును గూర్చిన దైవోక్తి
45 1. యోషీయా కుమారుడైన యెహోయాకీము యూదాను పరిపాలించిన నాలుగవయేట బారూకు నేను చెప్పిన ఈ సంగతులనెల్ల లిఖించెను.
2. నేనతనితో ”బారూకూ! యిస్రాయేలు దేవుడైన ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు: 3. ‘నాకు నిరాశ పుట్టు చున్నది. ప్రభువు నాకు బాధలతోపాటు విచారమును తెచ్చిపెట్టెను. నేను దుఃఖించి దుఃఖించి, అలసిపోతిని. నాకు విశ్రాంతి లభింపదయ్యెను’ అని నీవు పలుకు చున్నావు.
4. కాని ప్రభుడనైన నేను, నేను నిర్మించిన దానిని కూలద్రోయుదును. నేను నాిన దానిని పెల్లగింతును. నేను భూమి అంతికిని ఇట్లే చేయుదును.
5. నీవొక్కడవే ఈ బాధలను తప్పించుకోజూచు చున్నావా? అటులచేయవలదు. నేను ప్రజలందరిని నాశనము చేయుదును. నీవు మాత్రమెచికి వెళ్ళినను ప్రాణములతో బ్రతికెదవు. ఇది ప్రభుడనైన నా వాక్కు”