ఐగుప్తునకు దూతలను పంపుట

30 1.     ప్రభువు ఇట్లనెను:

                              ”అయ్యో! నన్నెదిరించు ప్రజలకు అనర్ధము.

                              వారు నేను చేయని నిర్ణయములను

                              పాించుచున్నారు.

                              నా యాత్మ అనుమతింపని

                              నిబంధనలను చేసికొనుచున్నారు.

                              ఆ రీతిగా నిరంతరము

                              పాపము కట్టుకొనుచున్నారు.

2.           వారు నన్ను సంప్రతింపకయే

               ఐగుప్తునకు వెళ్ళుచున్నారు.

               ఫరో రక్షణ బడయవలెనని వారి కోరిక.

3.           కాని ఐగుప్తు మరుగుజొచ్చినందుకు

               మీరు సిగ్గుపడుదురు.

               ఫరోరక్షణ ఆశించినందులకు

               అవమానము చెందుదురు.

4.           వారి మంత్రులప్పుడే సోవానును చేరుకొనిరి.

               వారి రాయబారులు హానేసులో ప్రవేశించిరి.

5.           నిరుపయోగమైన ప్రజను నమ్ముకొనినందుకు, తాము ఆశించిన సాయము చేయజాలక

               తమను అవమానమున ముంచు జనులను

               నమ్ముకొనినందుకు వారెల్లరును సిగ్గుపడుదురు.”

దూతలను పంపుటగూర్చి

రెండవ ప్రవచనము

6.           దక్షిణపుఎడారి నేగేబు ప్రదేశములోని

               మృగములను గూర్చి దైవోక్తి:

               కష్టమునకును, అపాయమునకును

               నిలయమైన దేశముగుండ

               రాయబారులు ప్రయాణము చేయుచున్నారు.

               అచట సింగములును,

               గర్జించుసింహములును ఉండును.

               విషసర్పములును, మిన్నాగులును ఉండును. వారు తమకు ఉపయోగపడని జాతియొద్దకు

               గాడిదలపైన, ఒంటెలపైన

               బహుమతులు మోయించుకొని పోవుచున్నారు.

7.            ఐగుప్తుచేయు సహాయము ఎందుకును పనికిరాదు

               కావుననే ‘ఏమియు చేయజాలని రహాబు భూతము’

               అని నేను ఐగుప్తునకు పేరిడితిని.

యెషయా తన సందేశమును పదిలపరచుట

8.           ప్రభువు ప్రజలు చూచుచుండగనే

               నన్ను ఈ సందేశమును

               వ్రాతపరికరములపై వ్రాయుమని చెప్పెను.

               భావితరముల వారికి

               ఈ ప్రజలు ఎి్టవారో తెలియచేయుటకు

               ఈ వ్రాత శాశ్వతముగా ఉపయోగపడును.

9.           ఈ ప్రజలు దేవునిమీద

               తిరుగుబాటుచేయువారు, అబద్ధమాడువారు,

               ప్రభువు సందేశమును విననివారు.              

10.         వీరు ప్రవక్తలతో

               ”మీరు దర్శనములు చూడవలదు.

               దీర్ఘదర్శులు సత్యము చెప్పవలదు.

               మీరు మాకు ప్రీతికలిగించు సంగతులు చెప్పుడు,

               కల్లబొల్లి దర్శనములు తెలియజేయుడు.

11.           మీరు మా త్రోవకు అడ్డుగా నిలవకుడు.

               యిస్రాయేలు పవిత్రదేవునిగూర్చి

               మాతో మాటలాడకుడు” అని పలుకుదురు.

12.          కావున యిస్రాయేలు పవిత్రదేవుడు

               ఇట్లనుచున్నాడు:

               ”మీరు  నా హెచ్చరికను నిరాకరించి మోసమును,

               దౌర్జన్యమును అంగీకరించితిరి.

13.          కనుక దోషులైతిరి.

               ఎత్తయినగోడ నిలువుననెఱ్ఱెవిచ్చి,

               దిడీలున కూలిపోవునట్లుగా మీరునుకూలుదురు.

14.          మ్టికుండను ముక్కలుముక్కలుగా పగులగొట్టగా

               ఊటనుండి నీిని తెచ్చుటకు గాని,

               పొయ్యినుండి నిప్పుకణికలు తెచ్చుటకు గాని

               ఆ ముక్కలలో ఒక్కియు పనికిరాదు.

               మీరును ఇట్లే అగుదురు.

15.          మీరు నాయొద్దకు తిరిగివచ్చి నెమ్మదిగా

               ఉందురేని, సురక్షితముగా మనుదురు.

               నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే

               మీ బలము ఇమిడియున్నది”

               అని పవిత్రుడైన యిస్రాయేలు మహాప్రభువు

               మీతో చెప్పుచున్నాడు.

               కాని మీరు అందులకు అంగీకరించుటలేదు.

16.          మీరు ”గుఱ్ఱములనెక్కి పారిపోవుదము”

               అనుకొనుచున్నారు.

               సరే, మీరు కోరినట్లే పారిపోవుదురు!

               మీరు మీ గుఱ్ఱములు వేగముగా

               పోవుననుకొనుచున్నారు,

               కాని మీ వెంటబడువారు అంతకంటెను

               వేగముగా వత్తురు.

17.          ఒక్క శత్రువును చూచి

               మీలో వేయిమంది పారిపోవుదురు.

               ఐదుగురు శత్రువులను చూచి

               మీరెల్లరు దౌడు తీయుదురు.

               కడన కొండమీద పాతిన జెండాకఱ్ఱతప్ప,

               మీ సైన్యమున ఏమియు మిగులదు.

18.          కాని ప్రభువు 

               మీపట్ల దయజూపుటకు వేచియున్నాడు.

               మిమ్ము కరుణించుటకు సిద్ధముగానున్నాడు. ప్రభువు న్యాయవంతుడు.

               అతనిని నమ్మువారు ధన్యులు.

ప్రజలు సంపన్నులగుదురు

19. యెరూషలేమువాసులారా! మీరిక విలపింప నక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయుమని అర్థించినపుడు, ఆయన దయతో మీ మొరవినును.

20. ప్రభువు మిమ్ము కష్టములపాలు చేయును. కాని ఆయన మీకు మరుగుకాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు.

21. మీరు త్రోవదప్పి కుడివైపునకుగాని, ఎడమ వైపునకుగాని జరిగినప్పుడు ”త్రోవ యిది, మీరీ మార్గమున నడువుడు” అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును.

22. మీరు వెండి బంగారములతో తాపడము చేసిన మీ విగ్రహముల వస్త్రములను ఈసడింతురు. వీని పీడ ఇంతితో ‘వదలినది’ అనుకొని వానిని విసరిపార వేయుదురు.

23. మీరు పైరులు వేసినపుడు ప్రభువు వానలు కురిపించును. కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చికపట్టులలో మేయును.

24. మీ పొలములు దున్ను ఎడ్లును, గాడిదలును మేలైన తిండి తినును.

25. ఆ దినమున మీరు శత్రువుల పట్టణ ములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అపుడు ప్రతి ఉన్నత పర్వతమునుండి వాగులు, నదులు పారును.

26. అపుడు చంద్రుడు సూర్యునివలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే, ఏడురెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి ఏడుదినముల సూర్య ప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును. వారి దెబ్బలను నయము చేయును.

అస్సిరియాకు శిక్ష

27. ప్రభువు శక్తి దూరము నుండి విచ్చేయుచున్నది.

               ఆయన కోపము నిప్పువలె మండుచున్నది.

               దట్టమైన పొగవలె రాజుకొనుచున్నది.

               ఆయన పెదవులు ఆగ్రహపూరితములై ఉన్నవి.

               ఆయన నాలుక జ్వలించు అగ్నివలెనున్నది.

28.        ఆయన శ్వాసము

               నిండుగా పొర్లిపారు ఏరువింది.

               అది జాతులన వినాశనమను జల్లెడతో జల్లించును

               వారి నోికి కళ్ళెము పెట్టును.

29.        మీరు ఉత్సవరాత్రులందువలె

               సంతసముతో పాటలు పాడుదురు.

               వేణునాదము ఆలించుచు

               యిస్రాయేలు రక్షకుడైన ప్రభువు పర్వతమునకు

               యాత్రచేయువారివలె ఆనందము నొందుదురు.

30.        ప్రభువు తన మహాధ్వానమును

               ఎల్లరికిని విన్పించును.

               తన కోపమెల్లరును చవిచూచునట్లు చేయును.

               అగ్నిజ్వాలలును, కుంభవర్షములను,

               వడగండ్ల వానలును,

               ప్రవాహములును నెలకొనును.

31.          ప్రభువు భీకరనాదమువిని అస్సిరియా భీతిల్లును. అది ఆయన దండతాడనమునకు తల్లడిల్లును.

32.        ప్రభువు అస్సిరియా ప్రజలను

               దెబ్బమీద దెబ్బకొట్టగా, ఆయన ప్రజలు

               డప్పులు తంత్రీవాద్యములతో

               తాళము వేయుదురు

               ప్రభువు అస్సిరియాతో స్వయముగా  పోరాడును.

33.        పూర్వమే ‘తోపెతు’ అను ఒక చోటును

               సిద్ధము చేసియుంచిరి.

               అందలి అగ్ని అస్సిరియా రాజును దహించును.

               అది లోతుగా, వెడల్పుగా ఉన్న గుంత.

               దానిలో కట్టెలను పేర్చియుంచిరి.

               ప్రభువు శ్వాస గంధక ప్రవాహమువలె వచ్చి

               దానికి నిప్పింంచును.