7 1. మానవజీవితము యుద్ధమున
నిర్బంధపోరాటము విందికాదా?
కూలివాడు కూలికి పనిచేయుట
విందికాదా?
2. బానిస నీడకొరకు తపించుచు
శ్రమచేయుట వింది.
పనివాడు జీతముకొరకు కాయకష్టము
చేయుట వింది.
3. ఎి్ట ఆశయు లేకయే నేను నెలలు గడపితిని.
విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని.
4. నేను పరుండినపుడు
‘పగలెప్పుడు వచ్చునా’ అనుకొందును. తిరిగి ‘ఎప్పుడు లేచెదనా’ అనుకొందును.
వేకువదాక నిద్దురపట్టక బాధపడుదును.
5. నా ఒడలి నిండ పుండ్లు లేచి పురుగులు పడినవి.
నా చర్మము పగిలి రసికారుచున్నది.
6. నా రోజులు నేతగాని
నాడెకంటె వేగముగా పరుగిడుచున్నవి.
అవి నాక్టిె ఆశ మిగుల్పకుండనే
వెడలిపోవుచున్నవి.
7. ప్రభూ! నా జీవితము శ్వాసవలె క్షణికమైనది.
నా కన్ను ఇక మేలును చూడదు.
8. పూర్వము నన్నెరిగినవారికి నేనిక కన్పింపబోను.
నీవు నన్ను చూచుచుండగనే మరుగైపోయెదను.
9. మబ్బు కరిగి మాయమైపోవును.
అట్లే పాతాళమునకు పోవువాడు
మరల పైకి రాజాలడు.
10. అతడు తన ఇంికి తిరిగిరాడు.
ఇక అతడినెవరు జ్ఞప్తియందుంచుకొనరు.
11. ఇి్ట పరిస్థితులలో నేను మౌనముగా ఉండజాలను
నా బాధలలో నేను మాటలాడక తప్పదు.
నా మనోవేదనలో నేను మొరపెట్టెదను.
12. ప్రభూ! నన్ను నిరంతరము
నీ అదుపులో ఉంచుకొనుటకు
నేనేమి సముద్రమును అనుకొింవా?
లేక సముద్రములోని మహాసర్పమను కొింవా?
13. ‘నేను పడకపై పరుండి విశ్రాంతి పొందగోరెదను.
నా బాధలనుండి ఉపశాంతి చెందగోరెదను’.
14. కాని నీ స్వప్నములతో
నీవు నన్ను భయపెట్టుచున్నావు.
నీ దర్శనములతో నన్ను కలవరపెట్టుచున్నావు.
15. ఈ వేదనలు అనుభవించుటకంటె
నేను చచ్చుట మేలు.
ఎముకల గూడునైన
నేను మరణమును ఆశించుచున్నాను.
16. నాకు నిరాశ కలిగినది, ఇక జీవించి లాభములేదు
నీవిక నా జోలికి రాకుము,
నా జీవితము నిరర్థకమైనది.
17. నీవు ఇంతగా ప్టించుకొనుటకు,
ఇంతగా పరిశీలించి చూచుటకు,
నరుడు ఏ పాివాడు? అతని బండారమెంత?
18. నీవు ప్రతిదినము
అతనిని పరీక్షించి చూడవలయునా?
ప్రతిక్షణము అతనిని పరిశీలించి చూడవలయునా?
19. నీ నేత్రములను నానుండి ప్రక్కకు త్రిప్పవా?
కనీసము గుటక వేయునంత కాలమైన
నన్ను విడిచిపెట్టవా?
20. నీవేమో అహోరాత్రులు నరులను
గమనించుచున్నావుగాని, నేను తప్పుచేసినను
నా పాపము నిన్నెట్లు బాధించినదో చెప్పుము.
నీవు నన్ను నీ కోపమునకు గురిచేయవలయునా?
నేను నీకు అంత భారమైతినా?
21. నీవు నా పాపమును సహింపలేవా?
నా దోషమును మన్నింపలేవా?
నేను శీఘ్రమే మ్టిలో కలిసిపోయెదను.
నీవు నన్ను వెదకుదువుగాని నేను నీ కంటబడను”