జనులు యిర్మీయాను ఐగుప్తునకు గొనిపోవుట

43 1. యిర్మీయా ప్రజలకు వారి దేవుడు ప్రభువు సెలవిచ్చిన సంగతులెల్ల చెప్పి ముగించెను.

2. హోషియా కుమారుడైన అజర్యా, కారెయా కుమారు డైన యోహానాను, గర్వాత్ములైన ఇతర ప్రజలు యిర్మీయాతో ”నీవు అబద్ధములాడుచున్నావు. మా దేవుడైన ప్రభువు మేము ఐగుప్తునకువెళ్ళి అక్కడ వసింపకూడదని నీతో చెప్పలేదు.

3. నేరీయా కుమారు డైన బారూకు నీవు మాకు ప్రతికూలముగా మ్లాడు నట్లు చేసెను. ఫలితముగా ఇప్పుడు బబులోనీయులు మమ్ము లొంగదీసికొని మమ్ము చంపుటకుగాని, లేదా తమ దేశమునకు బందీలనుగా గొనిపోవుటకుగాని సిద్ధమగుదురు” అనిరి.

4. కారెయా కుమారుడైన యోహానాను కాని, సైన్యాధిపతులు కాని, ప్రజలు కాని ప్రభువు ఆజ్ఞకులొంగి యూదాలో వసించుటకు ఇష్ట పడరైరి.

5. కారెయా కుమారుడైన యోహానాను, ఇతర సైన్యాధిపతులు యూదాలో ఉన్నవారిని, పూర్వము అన్యదేశములలో చెల్లాచెదరై అచినుండి తిరిగి వచ్చినవారిని, ఐగుప్తునకు తీసికొనిపోయిరి. 

6. వారు నెబూజరదాను గెదల్యా సంరక్షణలోనుంచిన వారి నందరిని అనగా స్త్రీలను, పురుషులను, పిల్లలను, రాజ పుత్రికలను గొనిపోయిరి. ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడైన బారూకును కూడ తోడుకొని పోయిరి.

7. ఆ రీతిగా వారు ప్రభువాజ్ఞను ధిక్కరించి ఐగుప్తు ప్రవేశించి తహపనేసు నగరము వరకును పోయిరి.

నెబుకద్నెసరు ఐగుప్తును ముట్టడించును

8. ఆ నగరమున యిర్మీయాతో ప్రభువు ఇట్లు చెప్పెను: 9. ”నీవుకొన్ని పెద్దరాళ్ళను తీసికొని వచ్చి తహపనేసు నగరములోని ఫరోరాజు భవనమునకు ముంది ఆవరణమునందలి మ్టిలో పాతిపెట్టుము.  నీవీ పని చేయుచుండగా యూదాప్రజలు చూడవలెను.

10. నీవు వారితో ఇట్లు చెప్పుము: ‘సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడనైన ప్రభువు సెల విచ్చునది ఏమనగా, నా సేవకుడును బబులోనియా రాజునైన నెబుకద్నెసరును ఇచికి గొనివత్తును. అతడు నేను  పాతిప్టిెన ఈ రాళ్ళపై తన సింహాసనమును నిర్మించి తన గుడారమును  పన్నును.

11. అతడిచికి వచ్చి ఐగుప్తును జయించును. అపుడు అంటురోగము వాత బడువారు అంటురోగము వలన చత్తురు. బందీలుగా గొనిపోబడువారు బందీలుగా వెళ్ళిపోవు దురు. పోరున చచ్చువారు పోరున చత్తురు.

12. నేను ఐగుప్తు దైవముల గుళ్ళకు నిప్పు అంింతును. బబులోనియారాజు ఆ దైవములను తగులబెట్టనైన తగులబెట్టును, లేదా ఎత్తుకొనిపోనైన పోవును. గొఱ్ఱెలకాపరి తన బట్టలనుండి పేలను విది లించినట్లే బబులోనియా రాజు ఐగుప్తును విదిలించి విజయముబడసి వెడలిపోవును.

13. అతడు ఐగుప్తు లోని సూర్య నగరమునందలి పవిత్ర శిలాస్తంభములను విరుగగొట్టును. ఆ దేశపు దేవతలగుళ్ళను కాల్చి వేయును.’ ”