దావీదు సీబాను బహూకరించుట

16 1. దావీదు కొండకొనమీదుగా కొంచెము దూరము నడచిపోవగానే మెఫీబోషెతు దాసుడగు సీబా వచ్చెను. అతడు రెండుగాడిదలకు జీనులు క్టి వానిపై రెండువందల రొట్టెలు, నూరు ఎండినద్రాక్షపండ్ల గుత్తులు, నూరు అంజూరపుపండ్లు, ఒక తిత్తెడు ద్రాక్షసారాయము కొనితెచ్చెను.

2. రాజు ”ఇవి యన్నియుదేనికి” అని అడుగగా, సీబా ”ఈ గాడిదలు రాజకుటుంబము వారు ఎక్కిపోవుటకు. రొట్టెలు, పండ్లు సైనికులకొరకు. ద్రాక్షసారాయము ఎడారిలో అలసిపోయినవారికి” అనెను.

3. దావీదు ”నీ యజమానుని కుమారుడేడి?” అని అడిగెను. సీబా ”అతడు యెరూషలేముననేయున్నాడు. నేడు యిస్రా యేలీయులు తన తండ్రి రాజ్యమును తిరిగి తనకు ఇప్పింతురని అనుకొనుచున్నాడు” అని చెప్పెను.

4. దావీదు ”ఇంతవరకు మెఫీబోషెతు అధీనమున నున్న ఆస్తిపాస్తులన్నింని ఇకమీదట నీవు అనుభవింపుము” అనెను. సీబా ”ప్రభూ! నేను నీ మన్ననకు పాత్రుడనైన చాలును, అదియే పదివేలు” అని బదులు చెప్పెను.

షిమీ దావీదును శపించుట

5. దావీదు బహూరీముచేరెను. సౌలు కుటుంబ మునకు చెందిన గేరా కుమారుడైన షిమీ పట్టణము వెడలివచ్చి దావీదును శపింపమొదలిడెను.

6. అతడు దావీదుమీద, అతని పరిజనముమీద రాళ్ళురువ్వెను. సైనికులు, యోధులు దావీదునకిరువైపుల ఉండిరి. అతని పొగరు తగ్గలేదు.

7. షిమీ ”నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు. శీఘ్రమే ఇటనుండి వెడలి పొమ్ము!

8. నీవు సౌలురాజ్యమును అపహరించితివి. అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగతీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్య మును నీ కుమారుడు అబ్షాలోము వశముచేసెను. నీవు రక్తపాతమునకు ఒడిగ్టితివి కనుక, నీ అపరాధమే నిన్నిపుడు నాశనము చేసినది” అని దావీదును చెడ దిట్టెను.

9. ఆ తిట్టులాలించిన సెరూయా పుత్రుడగు అబీషయి రాజుతో ”ఈ చచ్చినకుక్క యేలికను శపించు టయా! ప్రభువు సెలవిచ్చిన నేను వీని తలనెగుర గొట్టెదను” అనెను.

10. కాని రాజు ”మనము ఇతని మాటలు ప్టించుకోనేల? వానిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపుమని సెలవిచ్చె నేమో! వలదనుటకు మనమెవ్వరము?” అని బదులు పలికెను.

11. మరియు దావీదు అబీషయితో, పరి జనులతో ”నా కడుపునప్టుిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీనీయుడు ఊరకుండునా? ప్రభువే షిమీనిట్లు పురికొల్పెనేమో! ఇతనిని శపింపనిండు.

12. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో!” అని పలికెను. 13. దావీదు, అతని అనుచరులు సాగిపోయిరి. కాని షిమీ దావీదుపై రాళ్ళురువ్వుచు, శపించుచు, దుమ్మెత్తి పోయుచు కొండప్రక్కగా కదలిపోయెను.

14. రాజు, అతని అనుచరులు పయనము సాగించి అలసి పోవువరకు నడిచి, యోర్ధానున విశ్రమించి బడలిక తీర్చుకొనిరి.

హూషయి అబ్షాలోమును కలసికొనుట

15. అబ్షాలోము యిస్రాయేలీయులతో యెరూ షలేమున ప్రవేశించెను. అహీతోఫెలు కూడ అతనితో వచ్చెను.

16. దావీదు మిత్రుడును అర్కీయుడైన హూషయి అబ్షాలోమును కలిసికొని ”రాజునకు దీర్ఘాయువు!” అని దీవించెను.

17. కాని అబ్షాలోము ”ఓయి! స్నేహితునిపట్ల నీ ప్రేమ ఈ పాిదేనా? నీవు నీ మిత్రునితో ఏల వెళ్ళవైతివి?” అని అడిగెను.

18. హూషయి అతనితో ”యావే, ఈ ప్రజలు, యిస్రాయేలీ యులు ఎవరిని కోరుకొందురో నేనును అతని బంటునే. నేను అతనికడనే పడియుందును.

19. పై పెచ్చు, దావీదు కుమారునికి గాక ఇంకెవరికి ఊడిగము చేయుదును? నేను నీ తండ్రిని కొలిచినట్లే నిన్నును కొలిచెదను” అనెను.

అబ్షాలోము దావీదు ఉంపుడుగత్తెలతో శయనించుట

20. అబ్షాలోము అహీతోఫెలుతో ”మాకు మంచి ఆలోచన చెప్పుము. ఇప్పుడేమి చేయుదము?” అనెను.

21. అతడు ”నీ తండ్రి నగరమున మంచిచెడ్డలు అరయుటకు తన ఉంపుడుగత్తెలను విడిచిపోయెను గదా! నీవు వారినికూడుము. దానితో యిస్రాయేలీయు లందరు నీవు తండ్రిని అవమానపరచితివని గ్రహించి ధైర్యముగా నీ పక్షమును బలపరుతురు” అని చెప్పెను.

22. కనుక మిద్దెపై అబ్షాలోమునకు డేరా వేసిరి. యిస్రాయేలీయులందరు చూచుచుండగనే అతడు ఆ గుడారమున తండ్రి ఉంపుడుగత్తెలతో శయనించెను.

23. ఆ రోజులలో అహీతోఫెలు ఇచ్చిన ఉపదేశము యావే తనను సంప్రదించిన వారికిచ్చిన ఉపదేశము వలె నుండెడిది. దావీదుగాని, అబ్షాలోముగాని అతని ఉపదేశమును అంత ఆదరముతో స్వీకరించెడివారు.

Previous                                                                                                                                                                                                     Next