సిరియా యుద్ధము

సమరియా ముట్టడి

20 1. తనయొద్ద గుఱ్ఱములను, రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులు తోడుగా నుండ సిరియా రాజు బెన్హెదదు సైన్యమును ప్రోగు చేసుకొని సమరియాను ముట్టడించి వశము చేసికో పోయెను.

2. అతడు సమరియా పట్టణమందున్న యిస్రాయేలురాజు అహాబువద్దకు దూతనంపి ”బెన్హెదదు ఆజ్ఞ ఇది.

3. నీ ఇంటనున్న వెండిబంగారములు, నీ భార్యలలోను, పిల్లలలోను సొగసైనవారు నా వారు” అని వార్త చెప్పించెను.

4. అందులకు అహాబు ”నేను నీ ఆజ్ఞకు బద్ధుడను. నేనును, నా సమస్తమును నీ సొత్తే” అని ప్రతివార్త పంపెను.

5. కాని సిరియా రాజు దూతలు ఆ ప్రతివార్తనందించి, అహాబువద్దకు మరల తిరిగివచ్చి ”బెన్హెదదు ఆజ్ఞ ఇది. నీ వెండి బంగారములను, నీ భార్యలను బిడ్డలను నా వశము చేయవలయును.

6. రేపీపాికి నా సేవకులు నీ వద్దకువత్తురు. వారు నీ ప్రాసాదమును, నీ ఉద్యోగుల భవనములను గాలించి నీ కింకి  విలువగల వానినెల్ల తీసికొందురు” అని చెప్పిరి.

7. అహాబు యిస్రాయేలు నాయకులనందరిని పిలిపించి ”చూచితిరా! ఇతడు మనలను నాశనము చేయతలపెట్టెను. నేనితనికి వెండిబంగారములు మరియు భార్యలను, పిల్లలను వశము చేయననలేదు. ఇతడెట్లు హానిచేయ తలపెట్టుచున్నాడో తెలిసికొనుడు” అని పలికెను.

8. ఆ మాటలకు పెద్దలు, ప్రజలు ”నీవు సిరియా రాజును లెక్కచేయవద్దు. అతనాజ్ఞను పాింపవద్దు” అని సలహా ఇచ్చిరి.

9. కనుక అతడు బెన్హెదదు దూతలతో ”మీ రాజునకిట్లు విన్నవింపుడు. నీ మొది ఆజ్ఞను నేనంగీకరించెదను. కాని రెండవ ఆజ్ఞనంగీకరింపజాలను” అనెను.

10. అప్పుడు బెన్హెదదు ”నేను విస్తారసైన్యముతో వచ్చి నీ పట్టణమును నాశనము చేయుదును. నా సైనికులు నీ నగరమునందు రాళ్ళముక్కలను గూడ మిగులనీయరు. ఇట్లు చేయనేని దేవతలు నా ప్రాణ ములను బలిగొందురు” అని అహాబునకు ప్రతివార్త పంపెను.

11. యిస్రాయేలు రాజు ”కవచమును తాల్చినవాడుకాదు, దానిని విప్పినవాడు శూరుడు” అని అతనికి మరల వార్తపంపెను.

12. బెన్హెదదు అతని అనుచరులగు రాజులు శిబిరములలో కూర్చుండి మద్యమును సేవించుచుండగా అహాబు పంపిన వార్త చేరెను. వెంటనే బెన్హెదదు తన సైనికులు శత్రుపట్టణ మును ముట్టడించుటకు సిద్ధము కావలెనని ఆజ్ఞ ఇచ్చెను. సైనికులందరు యుద్ధమునకు సన్నద్ధులైరి.

యిస్రాయేలునకు విజయము

13. అంతట ఒక ప్రవక్త యిస్రాయేలు రాజు నొద్దకు వచ్చి ”యావే సందేశమిది. నీవు ఈ మహా సైన్యమును చూచి భయపడుచున్నావు కాబోలు. నేడే నీవు ఈ శత్రుబలమును జయింతువు. అప్పుడుగాని నేనే ప్రభుడనని నీవు గుర్తింపజాలవు” అని పలికెను.

14. అహాబు ”నాకెవరి సహాయము వలన విజయము సిద్ధించును?” అని ప్రశ్నించెను. ప్రవక్త ”రాష్ట్రపాలకుల అధీనముననున్న యువసైనికులు నీకు తోడ్పడుదురు” అని చెప్పెను. రాజు ”ఈ యుద్ధమున సేనానాయకుడు ఎవడు?” అని అడుగగా ప్రవక్త ‘నీవే’ అని జవాబిచ్చెను.

15. అహాబు ఆ యువసైనికులను పరిశీలింపగా వారు రెండువందలముప్పదిఇద్దరుండిరి. అటుతరువాత అతడు యిస్రాయేలు సైన్యమును పరిశీలించిచూడగా ఏడువేలమంది తేలిరి.

16. ఆనాడు మధ్యాహ్నము యుద్ధము ప్రారంభమయ్యెను. అప్పుడు బెన్హెదదు అతని అనుచరులు ముప్పదిఇద్దరు రాజులు శిబిరములలో తప్పత్రాగి మత్తెక్కి ఉండిరి.

17. పోరు మొదలుకాగా, యువసైనికులు ముందునడచిరి. సమరియానుండి కొందరు సైనికులు వచ్చుచున్నారని గూఢాచారులు బెన్హెదదునకు విన్నవించిరి.

18. పోరాటము కొరకొచ్చి నను, సంధికొరకొచ్చినను వారిని ప్రాణములతో ప్టి తీసుకొనిరండని బెన్హెదదు ఆజ్ఞ ఇచ్చెను.

19-20. యువసైనికులు ముందునడువ యిస్రాయేలుసైన్యము వారివెంటనడచెను. వారందరు ఎవరికి ఎదురైన శత్రు సైనికులను వారు చంపివేసిరి. వారిదాడికి నిలువలేక సిరియాసైన్యము పారిపోయెను. యిస్రాయేలుసైన్యము వారిని వెన్నాడెను. బెన్హెదదు కొందరు రౌతులు వెంటరాగా గుఱ్ఱమునెక్కి పలాయితుడయ్యెను.

21. యిస్రాయేలురాజు సిరియారాజు రథములను, గుఱ్ఱ ములను పట్టుకొనెను. సిరియారాజుకు పెద్ద ఓటమి కలిగెను.

విశ్రాంతి కాలము

22. అంతట ప్రవక్త అహాబునొద్దకు వచ్చి ”నీవు ఇక ఇంికి వెడలిపోయి నీ సైన్యమును బలపరచుకొ నుము. యుద్ధసన్నాహములు చేయుము. రానున్నయేడు సిరియారాజు మరల నీపైకి దండెత్తివచ్చును” అని చెప్పెను.

23. అట సిరియారాజు బంటులు అతనితో ”యిస్రాయేలు దేవుడు కొండలదేవుడు. కావుననే వారికి మనకంటె అధికబలము కలిగినది. మైదానమున పోరాడెదమేని మనము వారిని జయింపవచ్చును.

24. నీవు ఈ రాజులందరిని వదలించుకొని వీరికి బదులుగా సేనానాయకులను మన సైన్యమునకు అధిపతులుగా నియమింపుము.

25. నిన్ను వదలి పారిపోయినంత సైన్యమునే మరల ప్రోగుచేయుము. అన్ని గుఱ్ఱములను, అన్ని రథములను సమకూర్చు కొనుము. మేము యిస్రాయేలీయులతో మైదానమున పోరాడి వారిని జయింతుము” అనిరి. ఆ ఉపదేశ మును విని రాజు వారు చెప్పినట్లే చేసెను.

ఆఫెకువద్ద విజయము

26. మరుసి ఏడు బెన్హెదదు సిరియా సైనికులను ప్రోగుచేసికొనివచ్చి ఆఫెకువద్ద యిస్రాయేలీయుల నెదిరించెను.

27. యిస్రాయేలీయులు, వారినెదుర్కొన వచ్చి శత్రుసైన్యమునెదుట రెండుదండులుగా విడిది చేసిరి. పొలమున విస్తారముగా వ్యాపించియున్న సిరియాసైన్యముతో పోల్చిచూడగా యిస్రాయేలు దండులు రెండు మేకలమందలవలె కనిపించెను.

28. అప్పుడొక ప్రవక్త అహాబునొద్దకు వచ్చి ”యావే సందేశమిది. సిరియనులు నేను కొండల దేవుడ ననియు, మైదానము దేవుడను కాననియు పలికిరి. వారి మహాసైన్యమును నేను మీ వశము చేసెదను. అప్పుడు నీవు నీ ప్రజలు నేనే ప్రభుడనని గుర్తింతురు” అని చెప్పెను.

29. ఏడుదినములపాటు ఆ సైనికదళ ములు రెండు ఒకదానియెదుట ఒకి మోహరించి యుండెను. ఏడవదినమున యుద్ధము మొదలాయెను. యిస్రాయేలీయులు సిరియాబంటులను లక్షమందిని చంపిరి.

30. మిగిలినవారు ఆఫెకు పట్టణమునకు పారిపోగా అచట ప్రాకారములు కూలిపడి ఇరువది ఏడువేలమంది చనిపోయిరి.

బెన్హెదదు పట్టణమునకు పారిపోయి అట ఒక ఇంిలోపలి గదిలో దాగుకొనెను.

31. ఆ రాజో ద్యోగులు అతనితో ”అయ్యా! యిస్రాయేలు ప్రభువులు దయాపరులని వింమి. మేము నడుమునకు గోనె కట్టుకొని, తలమీద త్రాళ్ళువేసికొని, యిస్రాయేలు రాజు శరణుచొచ్చెదము. అతడు నిన్ను ప్రాణములతో విడువవచ్చును” అని పలికిరి.

32. రాజు అనుమతిపై వారట్లే అహాబు వద్దకు వెళ్ళి ”నీ దాసుడు బెన్హెదదు ప్రాణభిక్ష వేడుచున్నాడు” అని పలికిరి. అహాబు ”బెన్హెదదు ఇంకను బ్రతికియున్నాడా? సరియే, అతడు నాకు సోదరునివింవాడు” అనెను.

33. ఆ ఉద్యో గులు ఏదైన శుభసమాచారము విన్పించునేమో అని కనిపెట్టుకొనియున్నవారగుటచే, అహాబు ఈ మాటలు పలుకగనే ”అవును, బెన్హెదదు నీకు సోదరునివిం వాడు” అని బదులుపలికిరి. రాజు ”మీరు పోయి బెన్హెదదును తోడ్కొనిరండు” అనగా వారు వెడలిపోయి అతనిని వెంటబెట్టుకొనివచ్చిరి. బెన్హెదదు రాగానే అహాబు అతనిని తన రథముమీదికి ఎక్కించుకొనెను.

34. అతడు అహాబుతో ”మాతండ్రి మీ తండ్రి యొద్ద నుండి స్వాధీనము చేసికొనిన పట్టణములను తిరిగి నీకిచ్చివేయుదును. మా తండ్రి మీ సమరియాలో వర్తక కేంద్రమును నెలకొల్పినట్లే, నీవును మా దమస్కున వర్తకకేంద్రము నెలకొల్పుకోవచ్చును” అనెను. అహాబు ”ఈ షరతులపై నిన్ను స్వేచ్ఛగా వెడలిపోనిత్తును” అనెను. ఆ రీతిగా అహాబు బెన్హెదదుతో సంధిచేసికొని అతనిని స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చెను.

ప్రవక్త అహాబు వైఖరిని ఖండించుట

35. అంతట యావే ఆజ్ఞపై, ప్రవక్తల సమాజ మునకు చెందిన ప్రవక్తయొకడు తోడిప్రవక్తతో ”నీవు నన్నుకొట్టుము” అనెను. కాని తోడిప్రవక్త అతనిని కొట్టడయ్యెను.

36. అపుడు మొదిప్రవక్త రెండవ వానితో ”నీవు యావే ఆజ్ఞ మీరితివి కనుక నన్ను వీడి వెళ్ళిపోగానే సింహము నిన్ను చంపివేయును” అని చెప్పెను. ఆ రెండవప్రవక్త మొదిప్రవక్తను వీడి వెళ్ళిపోగానే ఒక సింహము అతనిమీదబడి వానిని చంపివేసెను.

37. మొదిప్రవక్త మరల వేరొకని వద్దకు వెళ్ళి ”నన్నుకొట్టుము” అనెను. ఆ రెండవవాడు అతనిని క్టొిగాయపరచెను. 38. గాయపడిన ప్రవక్త తన్ను గుర్తించుటకు వీలుకానట్లు ముఖమునకు గుడ్డతో కట్టుకట్టుకొని పోయి రాజపథమున నిలబడి రాజు రాకకై ఎదురుచూచుచుండెను.

39. అంతట అహాబు ఆ మార్గమున రాగా అతడు రాజును గొంతెత్తిపిలిచి ”ప్రభూ! నేను యుద్ధమున పోరాడుచుండగా తోడిసైనికుడు శత్రు సైనికునొకనిని చెరప్టి నా వద్దకు కొనివచ్చెను ‘నీవు వీనికి కావలి కాయుము. వీడు తప్పించుకొని పోయెనేని వీని ప్రాణ ములకు మారుగా నీ ప్రాణముపోవును, లేదా నీవు మూడువేల వెండినాణెములైన చెల్లింపవలెను’ అని చెప్పెను.

40. కాని ఈ దాసుడు ఏదో పనిలో చిక్కు కొని కొంచెము ఏమరియుండగా శత్రుసైనికుడు తప్పించుకొని పోయెను” అని చెప్పెను. అహాబు అతనితో ”ఇకనేమి, నీ శిక్షను నీవే నిర్ణయించుకొింవి. అపరాధము చెల్లింపుము” అనెను.

41. వెంటనే అతడు తన ముఖముమీది కట్టువిప్పగా రాజు అతడు ప్రవక్త యని గ్రహించెను.

42. అంతట ప్రవక్త రాజుతో ”యావే సందేశమిది. నేను శాపము పాలుచేసి చంపివేయుమని చెప్పిన నరుని నీవు ప్రాణ ములతో పోనిచ్చితివి. కనుక అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణము చెల్లింతువుగాక! అతని సైని కులకు మారుగా నీ సైనికులు ప్రాణములు కోల్పోవుదురు” అని పలికెను.

43. ఆ మాటలు విని రాజు విచారముతో ముఖము చిన్నపుచ్చుకొని సమరియా నగరమందలి తన మేడకు వెడలిపోయెను.