22 1.మహాసంపదలకంటెను

                              మంచిపేరు మిన్న.

                              వెండి బంగారములు ఆర్జించుటకంటె

                              ప్రజల గౌరవమును బడయుటమేలు.

2.           దరిద్రులకు, ధనికులకు

               సామాన్య లక్షణము ఒకి కలదు.

               ఆ యిరువురిని కూడ ప్రభువే సృజించెను.

3.           వివేకి ఆపదను ముందుగనే పసిగ్టి

               దానినుండి తప్పించుకొనును.

               అవివేకి ఆపదలో కాలుప్టిె

               తత్ఫలితమును అనుభవించును.

4. వినయము, దైవభీతి కలవాడు

               సంపదలు, గౌరవము, దీర్ఘాయువు బడయును.

5.           దుష్టునిత్రోవ ముండ్లతో,

               ఉరులతో నిండియుండును.

               జీవితముపై ఆశగలవాడు ఆ త్రోవ త్రొక్కరాదు.

6.           బాలునికి తాను నడువవలసిన మార్గమునుగూర్చి

               బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదపగూడ

               ఆ త్రోవను విడనాడడు.

7.            ధనికుడు పేదవానిని బానిసగా ఏలును,

               అప్పుపుచ్చుకొన్నవాడు ఇచ్చినవానికి తొత్తగును.

8.           అన్యాయమును విత్తువాడు

               వినాశమునే కోసికొనును.

               అతడు సల్పు దుడ్డు కర్రవిం

               పరపీడనము అంతమొందును.

9.           తన భోజనమును పేదలకుగూడ

               వడ్డించు కరుణామయుడు

               దేవుని దీవెనలు పొందును.

10.         పొగరుబోతును బహిష్కరించినచో జగడములు,

               వివాదములు, దూషణములు సమసిపోవును.

11.           నిర్మల హృదయుని ప్రభువు ప్రేమించును.

               సంభాషణా చతురుడు రాజునకు స్నేహితుడగును.

12.          ప్రభువు అసత్యవాదుల పలుకులను భంగపరచి

               సత్యమును భద్రముగా కాపాడును.

13.          బయట సింహమున్నది,

               అది నన్ను వీధిలో చంపును అని

               సోమరిపోతు ఇల్లు కదలడు.            

14.          వ్యభిచారిణి సంభాషణము లోతైన గొయ్యివింది

               ప్రభువు చీదరించుకొనువాడు దానిలో కూలును.

15.          బాలుని హృదయములో

               మూర్ఖత్వము సహజముగనే ఉండును.

               బెత్తమును ఉపయోగించినచో అది తొలగిపోవును.

16.          దరిద్రులను పీడించి ధనవంతుడగువాడును

               తన సంపదలను ధనవంతులకు

               ఒసగువాడును నష్టపోవును.

3. విజ్ఞుల సూక్తులు

మొది సంకలనము

17.          జ్ఞానుల సూక్తులను సావధానముగా వినుము. వారి బోధలను జాగ్రత్తగా గ్రహింపుము.

18.          వీనిని జ్ఞప్తియందుంచుకొని

               కంఠత నేర్చుకొందువేని

               నీకు ఆనందము చేకూరును.

19. నీవు ప్రభువును విశ్వసించుటకుగాను

               నేను ఈ సూక్తులను ఇపుడు

               నీకు బోధింపబూనితిని.

20.        విజ్ఞానమును, హితోపదేశమును

               ఒసగు సూక్తులను ముప్పదింని

               నేను నీ కొరకు లిఖించితిని.

21.          ఈ వాక్యములు నీకు సత్యమును బోధించును.

               వీని సాయముతో నిన్ను పంపినవారికి

               నీవు తృప్తికరముగా జవాబు చెప్పగలవు.

               అవి ఇవి:

22.        పేదవానికి అండలేదుగదా అని

               వానిని మోసగింపకుము.

               రచ్చబండవద్ద నిస్సహాయుడై నిలిచియున్న

               దరిద్రుని అణగద్రొక్కకుము.

23.        ప్రభువు పేదలకోపు తీసికొనును.

               వారిని పీడించువారిని తాను పీడించును.

24.         కోపస్వభావునితో చెలిమి చేయవలదు.

               ఉగ్రస్వభావునితో కలిసి తిరుగవలదు.

25.        అటు చేయుదువేని నీవు కూడ

               వాని అవలక్షణము అలవరచుకొని

               వినాశనము తెచ్చుకొందువు.

26.        నీవు ఇతరులకు హామీగా ఉండవలదు

               ఇతరుల బాకీలకు నీవు పూచీపడవలదు.

27.         నీవు ఆ ఋణములను చెల్లింపజాలవేని

               ఋణకర్తలు నీ పడకనుగూడ కొనిపోయెదరు.

28.        పూర్వులు పాతించిన గట్టురాళ్ళను కదలింపకుము.

29.        తన పనిని నైపుణ్యముతో చేయువాడు

               రాజులకు పరిచారకుడగునేగాని

               సామాన్య జనులను సేవింపడు.