పండ్రెండు రాళ్ళను స్మారకార్థముగా నిలుపుట

4 1. జనులందరు యోర్దాను నదిని దాటుట పూర్తియైన తరువాత యావే యెహోషువతో 2-3. ”ఈ జనులనుండి తెగకు ఒక్కని చొప్పున పండ్రెండు మందిని ఎన్నుకొనుము. యోర్దాను నడుమ యాజకులు నిలిచిన చోటునుండి పండ్రెండురాళ్ళను తీసికొని పోయి, రాత్రి బసచేయుచోట ఉంచుడని వారిని ఆజ్ఞ్ఞా పింపుము” అని పలికెను.

4. అంతట యెహోషువ, యిస్రాయేలీయుల నుండి తెగకు ఒకని వంతున పండ్రెండు మందిని ఎన్నుకొని వారిని పిలచి ఇట్లు చెప్పెను.

5. ”యోర్దాను నదిమధ్యకు పోయి మీ దేవుడైన యావే మందసము నిలిచిన స్థలము నుండి యిస్రాయేలీయుల తెగల లెక్క చొప్పున మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాతిని భుజమున పెట్టుకుని తీసుకొనిరండు” అని చెప్పెను. 6. ఈ రాళ్ళు మీకు జ్ఞాపకచిహ్నముగా నుండును. రాబోవు కాలమున ఈ రాళ్ళెందుకని మీ పిల్లలు అడిగినప్పుడు, 7. ‘యావే నిబంధనమందసము యోర్దాను నదిని దాటుచుండగా ఆ మందసము ఎదుట నదీప్రవాహము ఆగిపోయెను. ఆ రాళ్ళు యిస్రాయేలీయులకు ఆ విషయమును ఎల్లప్పుడును గుర్తుచేయుచుండును’ అని వారికి చెప్పుడు.”

8. యిస్రాయేలీయులు యెహోషువ చెప్పినట్లు చేసిరి. యావే యెహోషువతో చెప్పినట్లు తెగల లెక్క చొప్పున యోర్దాను నది నడుమనుండి పండ్రెండు రాళ్ళను తీసికొని శిబిరమునకు మోసికొనిపోయి అచ్చటపాతిరి.

9. యెహోషువ యోర్దానునది నడుమ నిబంధనపెట్టె మోయు యాజకులు నిలబడిన చోట కూడ పండ్రెండురాళ్ళను పాతించెను. అవి నేికిని అక్కడ కలవు.

నదిని దాటుటను ముగించుట

10. ప్రజలతో చెప్పుమని యావే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు   ఆజ్ఞాపించిన ప్రకారము నెరవేరువరకు యాజకులు నిబంధనమందసమును మోయుచు యేినడుమ నిలుచుండిరి. ప్రజలు తొందరగా నదిని దాిరి.

11. జనులందరు దాిన తరువాత నిబంధనమందసముతో యాజకులు దాిరి.

12. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధతెగలవారిలో జనులు మోషే వారిని ఆజ్ఞాపించినట్లు ఆయుధములు ధరించి, యిస్రాయేలు ప్రజల ఎదుట యుద్ధసన్నద్ధులై నదిని దాిరి.

13. యుద్ధమునకు యోగ్యులైన యోధులు దాదాపు నలువదివేల మంది ఆయుధములు ధరించి ప్రభువు సన్నిధిలో యెరికో మైదానమువైపు యుద్ధముచేయుటకై నదిని దాిరి.

14. ఆనాడు యిస్రాయేలీయుల ముందు యావే యెహోషువను ఘనపరచి, వారు మోషేను గౌరవించినట్లు అతనియెడలను జీవితకాల మంతయు గౌరవము కలిగియుండునట్లు చేసెను.

15-16. ”నిబంధనపెట్టెను మోయుచున్న యాజకు లను యోర్దాను నది నుండి బయికి రమ్మని చెప్పుము” అని యావే యెహోషువను ఆజ్ఞాపించెను.

17. ”నది నుండి వెలుపలకురండు” అని యెహోషువ యాజకు లతో పలికెను.

18. యావే నిబంధనపు పెట్టెను మోయుచున్న యాజకులు నదినుండి పైకివచ్చి గట్టుపై కాలుమోపగానే నదిలోని నీరు మునుపి చోికి చేరుకొని పూర్వపురీతినే గట్లు పొర్లి ప్రవహించెను.

గిల్గాలునకు చేరుట

19. మొదినెల పదవరోజున జనులు యోర్దాను నుండి వెడలివచ్చి యెరికో పట్టణమునకు తూర్పు వైపునున్న గిల్గాలులో దిగిరి.

20. నదినుండి తెచ్చిన పండ్రెండురాళ్ళను యెహోషువ గిల్గాలులో నిలిపెను.

21. అతడు యిస్రాయేలీయులతో, ”రాబోవు కాల మున మీ పిల్లలు ఈ రాళ్ళెందుకని మిమ్ము అడిగి నప్పుడు 22-23. ‘యిస్రాయేలీయులు ఎండిన నేలపై యోర్దానును దాిరి. మేము దాటు వరకు మా దేవుడైన యావే యోర్దాను నీళ్ళను ఇంకించెను. పూర్వము మా దేవుడైన యావే మేము దాటు వరకు రెల్లుసముద్రపు నీళ్ళను కూడ ఇట్లే ఇంకించెను.

24. భూమిమీద సకలజాతి జనులు యావే బాహుబలమును గుర్తించి ఆ ప్రభువుపట్ల భయభక్తులు చూపుటకొరకు అతడిట్లు చేసెను’ అని చెప్పుడు” అని పలికెను.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము