1 1. పెద్దనైన నేను నిజముగా ప్రేమించు నా ప్రియ గాయునకు: 2. నా ప్రియమిత్రుడా! నీకు సర్వదా శుభమగునుగాక! నీ ఆత్మనందు వర్థిల్లుచున్నట్లే, శారీర కముగా సుఖముగ ఉందువుగాక అనియు ప్రార్థించు చున్నాను.
3. నీవు సత్యమున జీవించునట్లే నీ సత్య ప్రవర్తనను గూర్చి కూడ ఇచ్చట చేరిన కొందరు సోదరులుచెప్పగా విని అమితముగా సంతోషించితిని.
4. నా బిడ్డలు సత్యమును అనుసరించుచున్నారు అని వినుట కంటె నాకు ఆనందదాయకమగు విషయము వేరొకటి లేదు.
గాయు, యోహాను పొగడ్త
5. ప్రియ మిత్రుడా! సోదరులకు ముఖ్యముగా పరదేశులకును నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్లుగ చేయుచున్నావు.
6. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగ నీవు వారిని సాగనంపుట యుక్తము.
7. ఏలయన, అన్యులనుండి ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి.
8. కనుక మనము సత్య వ్యాపకములో తోటిపనివారమగునట్లు వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము.
దియోత్రెఫె, దెమేత్రి
9. దైవ సంఘమునకు నేను ఒక చిన్న లేఖ వ్రాసితిని. కాని వారికి నాయకత్వము వహింపవలెనని ఉన్న, దియోత్రెఫె మా అధికారమును అంగీకరించుట లేదు.
10. కనుక నేను వచ్చినపుడు అతడు చేయు పనులను గూర్చియు, మమ్ము గూర్చి పలికెడు చెడు మాటలను గూర్చియు, సర్వమును విశదము చేసెదను. కాని అది చాలదన్నట్లు అతడు సోదరులను ఆహ్వా నించుటకు నిరాకరించును. ఆహ్వానింపదలచిన వారిని కూడ ఆటంకపరచును. వారిని దైవ సంఘమునుండి వెడలగొట్టుటకు ప్రయత్నించును.
11. ప్రియమిత్రమా! చెడునుకాక మంచిని మాత్రమే అనుసరింపుము. మంచి చేయువాడు దేవునకు చెందినవాడు. చెడు చేయువాడు దేవుని చూడలేడు.
12. అందరు దెమేత్రిని గూర్చి మంచియే పలుకుచున్నారు. సత్యమే అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చినది. నేను కూడ అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాను. నా సాక్ష్యము సత్యమని నీకు తెలియును.
తుది శుభాకాంక్షలు
13. నేను నీకు చెప్పవలసినది చాలా ఉన్నది. కాని, లేఖ ద్వారా తెలుపుటకు నాకు ఇష్టము లేదు.
14. నేను మిమ్ము త్వరలో కలిసికొనగలనని ఆశించు చున్నాను. అప్పుడు ముఖాముఖిగా సంభాషించెదను.
15. నీకు సమాధానము కలుగును గాక! నీ స్నేహి తులు అందరును శుభాకాంక్షలు పంపుచున్నారు. మన స్నేహితులందరికిని నా శుభాకాంక్షలను అంద జేయుము.