ఉపోద్ఘాతము:
పేరు: న్యాయాధిపతుల గ్రంథము ద్వితీయోపదేశకారుని చారిత్రాత్మక గ్రంథములోని భాగము. ఈ గ్రంథము పేరు ఒక వ్యక్తియొక్క లేదా అంశముయొక్క పేరు గాక ఒక హోదాను సూచించును. యెహోషువ శకముతో పితామహులు లేదా ఏకవ్యక్తి నాయకత్వము ముగిసినది. రాచరికము అవతరించక ముందున్న కాలమును కొంతమంది వ్యక్తులు పూరించారు. వారిని న్యాయాధిపతులుగా పేర్కొనిరి.
రచయిత(లు): ద్వితీయోపదేశ చరిత్ర గ్రంథకర్తలు.
కాలము: క్రీ.పూ. 6వ శతాబ్దారాంభములో వ్రాసారు. వాగ్ధత్తభూమి అక్రమణ వర్ణనలు వున్నాయి. వారి పరిపాలనాకాలము క్రీ.పూ. 1275-1050 వరకు సాగినది.
చారిత్రక నేపథ్యము: న్యాయాధిపతుల యుగము 200-300 సం||ల వ్యవధిలోనుంటుంది. యెహోషువా మరణము నుండి సౌలు రాజ్యస్థాపన (క్రీ.పూ. 1050) వరకు మధ్యనున్న కాలము ఇది. ఈ కాలములో యిస్రాయేలీయుల తెగలసమాఖ్య యాజమాన్యము పునాదులు వేసుకున్నది. యిస్రాయేలీయులు, నాి కనానీయుల సంస్క ృతి, మతముచే ప్రభావితులయ్యారు. అందువలన వీరు యావే ఆరాధన సంప్రదాయాలకు దూరమయ్యారు (17:6; 18:1; 19:1; 21:25). వాగ్ధత్తభూమి యిస్రాయేలీయుల నేలగా మారినది. అయితే వారి అవిధేయతవలన ఈ నేలను పోగొట్టుకునే స్థాయికి చేరుకున్నారు.
ముఖ్యాంశములు: యెహోషువ కాలానంతరము రాజకీయ అనిశ్చిత నెలకొనెను. యిస్రాయేలీయులు తమ అవిధేయత, అవిశ్వాసము వలన కనానీయులతో కలిసి విగ్రహారాధికులై భ్రష్టులైరి. ప్రజలు హింసకు దౌర్జన్యమునకు గురియైరి. వారిని ఏకత్రాిపై నిలపవలసిన ఆవశ్యకత యేర్పడినది. యిస్రాయేలీయులను నిబంధనప్రకారము ప్రత్యేక ప్రజగా తీర్చిదిద్దాల్సిన అవసరమున్నది. కనాను మతసంస్కృతికి భిన్నముగా యిస్రాయేలీయుల మతాన్ని సంరక్షించాల్సిన తరుణము వచ్చినది. అస్థిరత, క్రమశిక్షణరాహిత్యాన్ని అంతమొందించాలి. మున్నగు అంశములన్నిని ఈ గ్రంథము చర్చించును.
క్రీస్తుకు అన్వయము: గ్రంథమునందు చెప్పబడిన నాయకులు ప్రతిఒక్కరు రక్షకుడిగా, పరిపాలకుడిగా మెలిగిరి. ఈ గ్రంధమునందు క్రీస్తు సర్వసంపూర్ణ నీతిమంతుడైన తీర్పరి, రాజు, యాజకుడు, పాలకుడు, న్యాయాధిపతి, అభిషిక్తుడుగా ప్రతిబింబించును. (3:10; 6:34; 11:29; 14:6,19; 15:14; లూకా 3:21-22).