యోసేపు చరిత్ర యోసేపు అతని సోదరులు

1. తన తండ్రి పరదేశిగ స్థిరపడిన కనాను దేశమునందే యాకోబు నివసించెను.

2. అతని వంశీయుల వృత్తాంతమిది. యోసేపు పదునేడేండ్ల ప్రాయమువాడయ్యెను. అతడింకను చిన్నవాడు. సోదరులతో కలిసి తండ్రిమందలను మేపెడివాడు. ఆ సోదరులెవరోకారు, యోసేపు సవతి తల్లులు బిల్హా, జిల్ఫాల పుత్రులే. అతడు సోదరులుచేసిన చెడుపనులు తండ్రికి చెప్పెను.

3. ముదిమిని ప్టుినవాడు కావున యిస్రాయేలు యోసేపును ఇతర కుమారులకంటె ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగుచేతుల నిలువుటంగీని క్టుించెను.

4. తమకంటె ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియ ముగా మ్లాడరైరి.

5. యోసేపు ఒక కల కనెను. దానిని గూర్చి సోదరులకు చెప్పగా వారతనిని మునుపికంటె ఎక్కువగా ద్వేషింపసాగిరి.

6. యోసేపు సోదరులతో ”నేను  కన్నకలను  గూర్చి చెప్పెదను. వినుడు.

7. మనము పొలములో పనలు కట్టుచుింమి. నేను క్టిన పన చివాలునలేచి నిలువుగా నిలబడెను. మీ పనలేమో దానిచుట్టుచేరి సాగిలబడినవి” అని చెప్పెను.

8. అది విని వారు ”ఏమేమి! మాకు రాజువై మా మీద పెత్తనము చేయవలెనను కొనుచున్నావా?” అనిరి. యోసేపు స్వప్నపు సుద్దులను వినిన సోదరులు మునుపికంటె ఎక్కువగా అతనిని ద్వేషించిరి.

9. యోసేపు మరియొక కల కనెను. సోదరులతో ”నేను మరొక కల కింని. వినుడు. సూర్యచంద్రులు, పదునొకండు నక్షత్రములు నాకు నమస్కరించెను” అనిచెప్పెను.

10. అతడు ఈ కలను గురించి సోదరుల తోను, తండ్రితోను చెప్పెను. దానికి తండ్రి ”ఇది ఎక్కడికల? నేను, మీ అమ్మ, నీ సోదరులు, మేమందరము వచ్చి నీ ముందు సాష్టాంగప్రణామము చేయవలయునాయేమి?” అని మందలించెను.

11. అతని సోదరులు అతనిపై అసూయపడిరి. కాని తండ్రి మాత్రము ఆ కలను మరవలేదు.

సోదరులు యోసేపును అమ్ముట

12. యోసేపు  సోదరులు  తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి.

13. యిస్రాయేలు యోసేపుతో ”నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా! రమ్ము. నిన్నుకూడ వారి దగ్గరకు పంపెదను” అనెను. యోసేపు ”నేను సిద్ధముగా ఉన్నాను” అనెను.

14. యిస్రాయేలు ”వెళ్ళి నీ సోదరుల యోగక్షేమ మును, మందల మంచిచెడ్డలను తెలిసికొని మరలి వచ్చి, నాకేమాట చెప్పుము” అని యోసేపుతో అనెను. ఈ విధముగా యాకోబు యోసేపును హెబ్రోను లోయ నుండి పంపగా అతడు షెకెమునకు వచ్చెను.

15. అక్కడ పొలములో తిరుగుచున్న యోసేపును ఒక మనుష్యుడు  కలిసికొని  ”నీవేమి  వెదకుచున్నావు?” అని అడిగెను.

16. యోసేపు అతనితో ”నేను నా సోదరులను వెదకుచున్నాను. వారెక్కడ మందలను మేపుచున్నారో తెలిసిన  దయచేసి   చెప్పుడు” అనెను.

17. అంతట ఆ  మనుష్యుడు  ”వారు ఇక్కడినుండి సాగి పోయిరి. దోతాను వెళ్ళుదమని వారిలో వారు అను కొనుచుండగా వింని” అని చెప్పెను. యోసేపు సోదరులుప్టిన బాటనేపోయి, వారిని దోతానులో చూచెను.

18. వారు అతనిని దూరాన ఉండగనే  చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్రపన్నిరి.

19. వారు ”ఇదిగో! కలలుగనువాడు వచ్చుచున్నాడు.

20. రండు! వీనినిచంపి గోతిలో పారవేసి అడవిమృగము మ్రింగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము” అని తమలో తాము అనుకొనిరి.

21. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను.

22. ”మనకు ఈ రక్తపాతమేల? యోసేపును ఈ అడవియందలి గోతిలో త్రోయుడు. అతనికి ప్రాణహాని చేయకుడు” అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను.

23. యోసేపు సోదరుల దగ్గరకొచ్చెను. వారు అతడు ధరించిన పొడవుచేతుల నిలువుటంగీని తీసివేసిరి.

24. అతనిని గోతిలో పడదోసిరి. అది వ్టిగొయ్యి. దానిలో నీళ్ళులేవు.

25. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదునుండి ఐగుప్తుదేశమునకు పోవు యిష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. యిష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలమును, బోళమును, లేపనద్రవ్యమును తీసికొనిపోవుచుండిరి.

26. అప్పుడు  యూదా తన సోదరులతో ”యోసేపును చంపి, అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును?

27. రండు! అతనిని యిష్మాయేలీయులకు అమ్మివేయు దము. మనము అతనికి హానిచేయరాదు. అతడు మన రక్తమాంసములు పంచుకొని ప్టుిన తమ్ముడు గదా!?” అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి.

28. ఇంతలో మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతిమీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకిలాగిరి. అతనిని ఇరువది  వెండినాణెములకు యిష్మాయేలీయు లకు అమ్మిరి. యిష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి.

29. పిమ్మట రూబేను గోతిదగ్గరకు వెళ్ళిచూడగా, దానిలో యోసేపు కనబడ లేదు.

30. అతడు తన వస్త్రములు చించుకొనుచు, సోదరులదగ్గరకు వెళ్ళి ”అయ్యో! చిన్నవాడు గోతిలో లేడు. ఇక నేనేమి చేయుదును? ఎక్కడికి వెళ్ళుదును?” అని విలపించెను.

31. యోసేపు  సోదరులతని పొడువు చేతుల నిలువుటంగీని తీసికొనిరి. ఒక మేకపిల్లను చంపి, దాని నెత్తుిలో నిలువుటంగీని ముంచిరి.

32. దానిని తండ్రియొద్దకు తెచ్చి. ”ఇది మా కంటబడినది. ఇది నీ కొడుకు అంగీయో కాదో గుర్తింపగలవా?” అని అడిగిరి. 

33. యాకోబు దానిని గుర్తుప్టి ”ఇది నా కుమారుని అంగీయే. ఏ మాయదారి మృగమో యోసేపును ముక్కలుముక్కలుగా చేసి మ్రింగివేసినది” అనెను.

34. అతడు తన వస్త్రములను చించుకొనెను. నడుమునకు గోనెపట్ట కట్టుకొనెను. ఎన్నో రోజులు కొడుకును తలచుకొని అంగలార్చెను.

35. యాకోబు కుమారులు, కుమార్తెలు అతనిని ఓదార్చుటకెంతో ప్రయత్నించిరి. కాని అతనికి కొంచెముకూడ ఓదార్పు కలుగలేదు. ”నేను ఇట్లే ఏడ్చుచు ఏడ్చుచు నా కుమారునితో పాటు మృతలోకము చేరెదను” అని యాకోబు అనెను. ఈ విధముగా యాకోబు యోసేపు కొరకు విలపించెను.

36. ఇది ఇట్లుండగా మిద్యానీయులు ఐగుప్తుదేశమున యోసేపును పోతీఫరు నకు అమ్మిరి. పోతీఫరు ఫరోరాజుకడనున్న ఉద్యోగి, రాజసంరక్షకులకు నాయకుడు.

Previous                                                                                                                                                                                                     Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము