గిబ్యోనీయులు యిస్రాయేలీయులతో సంధి చేసికొనుట

స్థానిక రాజులందరు ఏకమగుట

9 1-2. యోర్దానునకు ఈవలి ప్రక్క కొండలలోను, లోయలలోను, లెబానోను వైపునగల మహాసముద్ర తీరమున వసించు హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు,  పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన జాతులవారి రాజులందరు జరిగిన సంగతులు విని తమలో తాము ఏకమై యెహోషువతోను యిస్రాయేలీయులతోను యుద్ధము చేయ జతక్టిరి.

గిబ్యోనీయుల పన్నాగము

3. యెహోషువ యెరికో, హాయి పట్టణములను నాశనము చేసెనని గిబ్యోనీయులు వినినప్పుడు, 4. వారు కపోపాయమునకు పూనుకొని, రాయబారుల మని వేషము వేసుకొని, పాతగోతాములను, పిగిలి పోగా మరలక్టుిన ద్రాక్షసారాయపు తిత్తులను గాడిదలమీద వేసికొని పయనమైవచ్చిరి.

5. పాత బడిపోయి, కుట్టువడిన చెప్పులను, చినిగి చీలికలైన బట్టలను తొడుగుకొని వచ్చిరి. వారు తెచ్చుకొనిన రొట్టెలుగూడ ఎండి పొడుమగుచుండెను.

6. అలా వచ్చి గిబ్యోనీయులు, గిల్గాలు శిబిరమున యెహోషువను కలసికొనిరి. అతనితోను యిస్రాయేలీ యులతోను ”మేము దూరదేశమునుండి వచ్చితిమి. మీరు మాతో ఒడంబడిక చేసికొనుడు” అని అనిరి.

7. కాని యిస్రాయేలీయులు వారిని ”మీరు మా దాపు ననే వసించుచున్నారేమో! మరి మీతో ఒడంబడిక చేసికొనుటెట్లు?” అని అడిగిరి.

8. వారు యెహోషువతో ”మేము మీ దాసులముకదా!” అని యనిరి. యెహోషువ ”మీరెవరు? ఎచినుండి వచ్చుచున్నారు?” అని ప్రశ్నించెను.

9. వారు అతనితో, ”నీ దాసులమైన మేము దూరప్రాంతములనుండి వచ్చితిమి. నీవు కొలుచు యావే పేరు వింమి. ఆ దేవుడు ఐగుప్తీయు లను ఎట్లు మట్టుపెట్టెనో తెలిసికొింమి.

10. యోర్దాను నకు ఆవలివైపునున్న అమోరీయ రాజుల నిద్దరను, హెష్బోను రాజగు సీహోనును, అష్టారోతున వసించు బాషాను రాజగు ఓగును ఎట్లు అణగద్రొక్కెనో తెలిసి కొింమి.

11. మా పెద్దలు, పౌరులు మాతో ‘మీరు దారి బత్తెములు తీసికొని పయనమైపోయి ఆ ప్రజలను కలసికొని, మేము మీ దాసులము కనుక మాతో ఒడంబడిక చేసికొనుడు’ అని విన్నవింపుడనిరి.

12. ఇదిగో! మేము తెచ్చుకొనిన రొట్టెలను చూడుడు. మీ యొద్దకు రావలెనని పయనము క్టిన దినమున వీనిని మా ఇండ్లనుండి తెచ్చుకొింమి. అపుడవి వేడిగనే యుండినవి. కాని ఇపుడు ఎండిపోయి పొడుమగు చున్నవి.

13. ఈ తిత్తులును ద్రాక్షసారాయము పోసిన పుడు క్రొత్తవియే. కాని ఇప్పుడవి పిగిలిపోవుచున్నవి. ఈ దీర్ఘప్రయాణము వలన మా దుస్తులు, పాదరక్షలు కూడ పాడయిపోయినవి” అని చెప్పిరి.

14. యిస్రాయేలు నాయకులు గిబ్యోనీయులు సమర్పించిన భోజనపదార్థములను పుచ్చుకొని భుజించిరి. వారు యావేను సంప్రదింపలేదు.

15. యెహోషువ గిబ్యోనీయులతో శాంతిని పాింతునని బాసచేసి వారిని చంపనని ఒడంబడిక చేసికొనెను. యిస్రాయేలు నాయకులు ప్రమాణపూర్వకముగా ఆ ఒడంబడికను ధ్రువపరచిరి.

16. కాని ఒడంబడిక ముగిసిన మూడు రోజుల లోనే ఆ వచ్చినవారు ఆ సమీపమున యిస్రాయేలీ యుల చెంతనే వసించుచున్నారని తెలియవచ్చెను.

17. యిస్రాయేలీయులు తమ శిబిరమునుండి వెడలి వచ్చి మూడవరోజున గిబ్యోను, కెఫీరా, బెరోతు, కిర్యత్యారీము అను గిబ్యోనీయుల పట్టణములు చేరు కొనిరి.

18. కాని వారు ఆ పట్టణములను ముట్టడింప లేదు. యిస్రాయేలు నాయకులు తమదేవుడైన యావే పేర గిబ్యోనీయులతో శాంతిని పాింతుమని బాస చేసిరి గదా! కాని యిస్రాయేలు ప్రజలు మాత్రము తమ నాయకులమీద గొణగుకొనిరి.

గిబ్యోనీయులు యిస్రాయేలీయుల దాసులగుట

19. యిస్రాయేలు నాయకులు ”మనము యావే పేర ఈ ప్రజలకు ప్రమాణము చేసితిమి. కనుక ఇపుడు వీరిని చంపరాదు.

20. మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి దైవాగ్రహము రాకుండు నట్లు ఆ ప్రమాణము ప్రకారము వారిని బ్రతుక నిత్తుము అని నిశ్చయించుకొనిరి.

21. కాని వారు యిస్రాయేలు సమాజమునకు వంటచెరకు నరుకుకొని రావలెను. నీళ్ళు తోడుకొనిరావలయును” అని సంపూర్ణ సమాజమున పలికిరి. సమాజము అందులకు అంగీకరించెను.

22. యెహోషువ గిబ్యోనీయులను పిలువనంపి ”మీరు మా సమీపమునే వసించుచు దూరప్రాంతములనుండి వచ్చితిమని చెప్పి మమ్ము మోసగించిరి.

23. నేినుండి మీరు శాపగ్రస్తు లగుదురు గాక! నేను కొలుచు దేవునిమందిరమున బానిసలైయుండి వంటచెరకు, నీళ్ళుతోడి మోసికొని రండు” అనెను.

24. వారు యెహోషువతో ”నీ దాసులమైన మేము ఇట్లు కపోపాయము పన్నుటకు కారణము కలదు. నీ దేవుడైన యావే యిటవసించు ప్రజలను నాశనముచేసి ఈ దేశమును నీవశము చేయుమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చెనని నీ దాసులకు అగత్యముగా తెలియవచ్చినది. మీరు మా సమీపమునకువచ్చిరి. కనుక ఇక మమ్ము చంపి వేయు దురని భయపడితిమి.

25. మేమిపుడు మీ చేతులలోని వారము. మమ్మెట్లు చేయదలచుకొింరో అటులనే చేయుడు” అనిరి.

26. యెహోషువ యిస్రాయేలీ యుల బారినుండి గిబ్యోనీయులను రక్షించెను గనుక వారు చావు తప్పించుకొనిరి.

27. కాని నాినుండి యెహోషువ వారిని యిస్రాయేలు సమాజమునకు వంట చెరకు నరుకుకొని రావలయుననియు, నీళ్ళుతోడుకొని రావలెననియు ఆజ్ఞాపించెను. పైగా యావే ఎక్కడ ఆరాధింపబడినను అక్కడ వారు యావే బలిపీఠము నకు పై రీతిగనే ఊడిగము చేయవలెనని ఆజ్ఞాపించెను. నేివరకును ఆ నియమము చెల్లుచునేయున్నది.

Previous                                                                                                                                                                                                 Next