గెరారు సంఘటన

1. అబ్రహాము కాలములో ఒక కరువు వచ్చెను గదా! అదిగాక మరియొక కరువు దేశమున తాండ వించెను. ఈసాకు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళెను. అప్పుడు ఆరాజు గెరారులో ఉండెను.

2.దేవుడు ఈసాకునకు ప్రత్యక్షమై ”ఐగుప్తు దేశమునకు వెళ్ళకుము. నేను చెప్పినచోట ఉండుము.

3. ఈ దేశమునందే నివసింపుము. నేను నీకు చేదోడుగా ఉందును. నిన్ను దీవింతును. నీకు, నీ సంతతికి ఈ భూములనిత్తును. ఈ విధముగా నేను నీ తండ్రి అబ్రహామునకిచ్చిన మాట నెరవేర్చుకొందును.

4. నీ సంతతివారిని ఆకాశమందలి నక్షత్రములవలె లెక్కకు మిక్కుటమగునట్లు చేయుదును. ఈ భూము లన్నియు వారికి పంచిపెట్టుదును. భూలోకమందలి సకల జాతులవారు నీ సంతతిద్వార దీవెనలు పొందు దురు.

5. అబ్రహాము నామాట వినెను. నా ఆజ్ఞలను శిరసావహించెను. అతడు నేనుచేసిన కట్టడలు మీర లేదు. నేను కావించిన నియమములను ఉల్లంఘింప లేదు. కావుననే నిన్ను దీవించెదను” అనెను.

6. దేవుని మాటమీద ఈసాకు గెరారులో నివసించెను.

7. ఆ దేశీయులు తన భార్యను గూర్చి అడుగగా ఈసాకు ”ఆమె నా సోదరి” అని చెప్పెను. రిబ్కా తన భార్య అని చెప్పుటకు అతడు భయపడెను. రిబ్కా అందగత్తె. ఆమెవలన తనకు చావుమూడునని ఈసాకు తలంచెను.

8. వారు అక్కడ చాలకాలము నివసించిరి. ఒకనాడు ఫిలిస్తీయులరాజు అబీమెలెకు గవాక్షము నుండి ఈసాకు రిబ్కాతో సరసమాడుటచూచెను.

9. అతడు ఈసాకును పిలిపించి ”ఆమె నీ భార్యయే! అవునా? నీ ప్రాణాలమీదికి ఏమొచ్చి ఆమె నా సోదరి యని చెప్పితివి?” అనెను. ఈసాకు ”ఆమెవలన నాకు ప్రాణాపాయము కలుగునని తలంచి ఆ విధముగా చెప్పితిని” అనెను.

10. అంతట అబీమెలెకు ”ఎంత పనిచేసితివి? ఈ దేశప్రజలలో ఎవడో ఒకడు ఏ ఆటంకము లేకుండా ఆమెను కూడెడివాడు. అప్పుడు నీవేమో నింద మానెత్తికి చుట్టెడివాడవు” అనెను.

11. ఇట్లని అబీమెలెకు ఈసాకును గాని అతని యిల్లాలిని గాని ముట్ట్టుకొన్న వారికి చావుమూడునని తనప్రజలకు హెచ్చరిక చేసెను.

12. ఈసాకు అక్కడ పొలమున విత్తగా ఆ సంవత్సరమే నూరురెట్ల పంటచేతికి వచ్చెను. దేవుడు అతనిని దీవించెను.

13. అతడు క్రమక్రమముగా అభివృద్ధిచెంది చివరకు మహాసంపన్నుడయ్యెను.

14. అతని గొఱ్ఱెలుగొడ్లు మందలుమందలుగా పెరిగెను. అతనికి కావలసినంతమంది బానిసలుండిరి. అతని సిరిని చూచిన ఫిలిస్తీయులకు కన్నుకుట్టెను.

15. వారు ఈసాకు తండ్రి అబ్రహాము కాలమున బానిసలు త్రవ్విన బావులన్నిని మన్నుపోసి పూడ్చివేసిరి.

16. అబీమెలెకు ఈసాకుతో ”నీవు మాకంటె అధిక శక్తిమంతుడవైతివి. ఇక ఇక్కడనుండి వెళ్ళిపో!” అనెను.

17. ఈసాకు ఆ చోటువదలి, గెరారులోయలో గుడారములు వేసికొని, అక్కడనే నివసించెను.

18. ఫిలిస్తీయులు బావులు వ్టిపోవునట్లు చేసిరిగదా! కనుక, ఈసాకు అబ్రహాము కాలములో త్రవ్విన బావులన్నింని తిరిగి త్రవ్వించి వాికి తన తండ్రి ప్టిెన పేరులనే పెట్టెను.

19. ఈసాకు బానిసలు ఆ లోయలో బావిని త్రవ్వగా మంచిజలపడెను.

20. కాని గెరారు గొఱ్ఱెల కాపరులువచ్చి, ఆ నీళ్ళు మావియనుచు ఈసాకు గొఱ్ఱెలకాపరులతో వాదనకుదిగిరి. వారు తనతో జగడమాడుటచే ఈసాకు ఆ బావికి ”ఎసెకు”1 అను పేరు పెట్టెను.

21. ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్విరి. ఆ గొఱ్ఱెల కాపరులు దానికొరకును ప్లోాడిరి. కావున ఈసాకు ఆ బావికి ”సిత్నా”2 అనుపేరు పెట్టెను.

22. అతడు అక్కడినుండి కదలి పోయి మరియొకబావిని త్రవ్వించెను. దానికి ఏ జగడము లేదు. కావున ఈసాకు ఆ బావికి ”రెహోబోతు”3 అను పేరుప్టిె ”ఈనాికి దేవుడు మాకు కావలసినంతచోటు చూపించెను. మేమిక ఈ దేశమున అభివృద్ధి చెందగలము” అనెను.

23. ఈసాకు అక్కడనుండి బేర్షెబాకు వెళ్ళెను.

24. ఆ రాత్రి దేవుడు అచట ప్రత్యక్షమై అతనితో: ”నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను. భయపడకుము. నేను నీకు చేదోడుగా ఉందును. నా దాసుడు అబ్రహామును బ్టినిన్ను దీవింతును. నీ సంతతిని విస్తరిల్లచేయుదును.” అని అనెను.

25. ఈసాకు అక్కడ ఒక బలిపీఠమును నిర్మించెను. దేవుని ఆరాధించెను. అక్కడనే గుడారము వేసికొనెను. అతని బానిసలు అక్కడ కూడ ఒక బావిని త్రవ్విరి.

అబీమెలెకుతో ఒడంబడిక

26. అబీమెలెకు తన సలహాదారుడు అయిన అహూసతుతో, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చెను.

27. ఈసాకు వారితో ”మీరు ఇక్కడికి ఏలవచ్చితిరి? నామీద పగప్టి నన్ను తరిమివేసితిరే!” అనెను.

28. అంతట వారు ”దేవుడు నీకు చేదోడువాదోడుగా ఉండుట మేము మా కన్ను లార చూచితిమి. మనము ప్రమాణబద్ధులమై ఒక ఒడంబడిక చేసికొనుట మంచిదని తలంచితిమి.

29. మేము నిన్ను తాకనైనతాకలేదు. నీకు మేలుతప్ప కీడన్నది చేయలేదు. నిశ్చింతగా నీదారిన నిన్ను పోనిచ్చితిమి. నీకు దైవబలము కలదు. మేము నీకు కీడుచేయనట్టే, నీవును మాకు ఎి్టకీడును చేయనని మాటఇమ్ము” అనిరి.

30. అంతట ఈసాకు వారికి విందుచేసెను. వారు తినిత్రాగిరి.

31. వారు ప్రొద్దుననే లేచి పరస్పరము ప్రమాణములు చేసికొనిరి. పిదప ఈసాకు వారిని సాగనంపగా వారు మిత్ర భావముతో వెళ్ళిపోయిరి.

32. ఆనాడే ఈసాకు బానిసలువచ్చి తాము త్రవ్విన క్రొత్తబావిని గూర్చి చెప్పిరి. ”బావిలో నీళ్ళు  పడినవి” అని చెప్పిరి.

33. ఈసాకు ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడ ఆ నగరమును ‘బేర్షెబా’4 అను పేరిట పిలుచుచున్నారు.

హిత్తీయులతో ఏసావు పొత్తు

34. నలువదియవ యేట ఏసావు యూదితును, బాసెమతును పెండ్లియాడెను. యూదితు, హిత్తీయు డగు బీరీ కుమార్తె. బాసెమతు  హిత్తీయుడగు ఏలోను కుమార్తె.

35. ఈ ఇరువురివలన ఈసాకునకును, రిబ్కాకును తీవ్రమనస్తాపము కలిగెను.

Previous                                                                                                                                                                                               Next                                                                                     

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము