విరోధులు అడ్డువచ్చుట

4 1. మేము గోడ కట్టుచున్నామని విని సన్బల్లటు ఆగ్రహము చెందెను. మమ్ము గేలిచేసెను.

2. అతడు తన మిత్రులు, సమరియాసైనికులు వినుచుండగా ”ఈ వాజమ్మలేమి చేయగలరు? వీరు పట్టణమును పునర్నిర్మింపగలరా? బలులర్పించగలరా? పని ఒక్క రోజులో ముగించగలరా? ఈ మొనగాండ్రు బూడిద కుప్పనుండి రాళ్ళెత్తి భవనములు కట్టుదురా?” అని పరిహసించెను.

3. అప్పుడతని ప్రక్కనే నిలుచుండి యున్న అమ్మోనీయుడు తోబియా ”వారేమి గోడ కట్ట గలరు? గుంటనక్క ఆ గోడమీదికెగిరినచో దాని రాళ్ళు కూలిపడును”అనెను.

4. అప్పుడు నేను ”ప్రభూ! వారు మమ్మెట్లు పరిహసించు చున్నారో చూచితివిగదా? వారి వేళాకోళము వారికే చుట్టుకొనునుగాక! శత్రువులు వారిని బందీలను చేసి ప్రవాసమునకు కొనిపోవుదురు గాక!

5. నీవు వారి పాపములను మన్నింపవలదు, విస్మ రింపవలదు. మేము గోడను కట్టుకొనుచుండగా వారు మమ్ము ఎగతాళిచేసిరి గదా!” అని ప్రార్ధించితిని.

6. మేము మాత్రము గోడకట్టుచునేయుింమి. ప్రజలు ఉత్సాహముతో పనిచేసిరి కనుక అది సగ మెత్తువరకు లేచెను.

7. సన్బల్లటు, తోబియా, అరబ్బులు, అమ్మోనీ యులు, అష్డోదు పౌరులు మేము గోడ కట్టుచున్నామని, గోడలోని బీటలన్నిని పూడ్చివేయుచున్నామని విని ఆగ్రహించిరి.

8. కనుక వారందరు ఏకమైవచ్చి యెరూషలేమును ఎదిరించి మా పనికి అంతరాయము కలిగింపవలెనని కుట్రపన్నిరి.

9. కాని మేము ప్రభువును ప్రార్ధించి వారిరాకను గుర్తించుటకై మా ప్రజలను రేేేయిపగలు కాపుప్టిెతిమి.

10. యూదీయులు ”బరువులెత్తువారికి శక్తి రోజు రోజుకు సన్నగిల్లిపోవుచున్నది. తొలగింప వల సిన చెత్త ఇంకను విస్తారముగానున్నది. ఇక ఈ గోడను మనము ముగింపలేము”అనిరి.

11. మా శత్రువులు తాము ఆకస్మికముగా వచ్చి మా మీద పడువరుకు మేము వారిని గుర్తింపలేమనుకొనిరి. మమ్ము చంపి, మా పని ఆపివేయవచ్చునని తలంచిరి.

12. మా శత్రువుల నడుమ వసించు యూదులువచ్చి నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావల యునని, పదేపదే మమ్ము అర్ధింపగా 13. అందు నిమిత్తము గోడవెనుకనున్న దిగువ స్థలములలోను, ఎగువస్థలములలోను ఉన్న జనులను వారివారి కుటుంబముల ప్రకారము వారి  కత్తులు, బల్లెములు, విండ్లు ఇచ్చి కాపుంచితిని.

14. మా జనులు భయపడు చుండిరి. కనుక నేను వారిని, వారి నాయకులను, అధికారులను హెచ్చరించుచు ”మీరు శత్రువులను చూచి భయపడవలదు. మన ప్రభువెంత ఘనుడో, ఎంత భయంకరుడో స్మరించుకొనుడు. మీరు మీ తోడి జనము కొరకు, మీ పిల్లలకొరకు, మీ భార్యల కొరకు, మీ నివాసము మీకుండునట్లు పొరాడుడు” అని పలికితిని.

15. మా శత్రువులు మేము వారి పన్నా గములను గుర్తించితిమనియు, ప్రభువు వారి యత్న మును విఫలము చేసెననియు గ్రహించిరి. మేమంద రము మరల గోడకట్టుటకు పూనుకొింమి.

16. ఆనాి నుండి మా ప్రజలలో సగము మంది మాత్రమే పనిచేసిరి. మిగిలిన సగము మంది బల్లెములు, డాళ్ళు, విండ్లు, కవచములు తాల్చి, గోడకు కాపు కాచిరి. మా నాయకులు గోడ కట్టువారికి పూర్తిగా మద్దతునిచ్చిరి.

17. గోడ కట్టువారు ఒక చేతపని చేయుచు మరియొకచేత ఆయుధము తాల్చిరి.

18. పని వారందరు నడుమునకు కత్తి వ్రేలాడగట్టుకొనిరి. అపాయమును ఎరిగించుచు బాకానూదువాడు నా ప్రక్కనే ఉండును.

19. నేను ప్రజలతో వారి నాయ కులతో అధిపతులతో ”మనము చాలదూరమువరకు విస్తరించియున్న గోడమీద పనిచేయుచున్నాము. ఒకరి కొకరము చాల ఎడముగ ఉన్నాము.

20. బాకా చప్పుడు విన్పింపగనే ఎక్కడున్నా మీరెల్లరు నా చుట్టు ప్రోగుకండు. మనదేవుడు మన పక్షమున పోరాడును”   అని  నుడివితిని.

21. ఆ రీతిగా ప్రతిదినము మాలో సగము మంది వేకువజాము నుండి రేయిచుక్కలు కన్పించు వరకు పనిచేసిరి. మిగిలిన సగముమంది బల్లెములు చేప్టి గోడకు గస్తుతిరిగిరి.

22. నేనింకను ప్రజలతో ”మీరెల్లరు మీ మీ సేవకులతో రేయి నగర ముననే ఉండిపొండు. మనము పగలెల్ల పనిచేసి రేయి పట్టణమునకు కావలికాయుదము” అని చెప్పితిని.

23. నేను, నా మిత్రులు, నా సేవకులు అంగరక్షకులు రాత్రిబట్టలు మార్చుకోమైతిమి. నిత్యము ఆయుధ ములు తాల్చియేయుింమి.

Previous                                                                                                                                                                                                  Next