లైంగిక నియమములు

18 1-2. యిస్రాయేలీయులకు ఈ ఆజ్ఞలు వినిపింపుమని ప్రభువు మోషేతో  చెప్పెను.

3. ”నేను మీ ప్రభుడనైన దేవుడను.  మీరు ఐగుప్తున వసించితిరి కదా! ఆ ప్రజలవలె ప్రవర్తింపకుడు. ఇప్పుడు నేను మిమ్ము కనాను మండలమునకు తోడ్కొనిపోనున్నాను. మీరు అచి ప్రజలవలె వర్తింపకుడు. వారి ఆచారము లను పాింపకుడు.

4. మీరు నా ఆజ్ఞలను చేకొని వాని ప్రకారము నడచుకొనుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

5. మీరు నా ఆజ్ఞలను, చట్టములను అను సరింతురేని వానివలన జీవమును బడయుదురు. నేను ప్రభుడను.

6. మీలో ఎవరు తమ రక్తసంబంధులను వివస్త్రులను చేయరాదు. నేను మీ ప్రభుడను.

7. నీ తండ్రిని దిగంబరుని చేయరాదు. అతడు నీ తండ్రి. నీ తల్లిని వివస్త్రను చేయరాదు. ఆమె నీ తల్లి.

8. నీ తండ్రియొక్క ఇతర భార్యలను కూడి అతనిని అవమాన పరుపవలదు.

9. నీ సోదరినికాని, మారు సోదరిని కాని కూడరాదు. ఆమె మీ ఇంట పెరిగినను, పెరగ కున్నను ఈ నియమము వర్తించును.

10. నీ మనుమ రాలిని కూడరాదు. అది నీకే అవమానకరము.

11. నీ తండ్రికి మరియొక భార్యవలన ప్టుిన యువతిని కూడరాదు. ఆమె నీకు మారుచెల్లెలు.

12. నీ మేనత్తను కూడరాదు. ఆమె నీ తండ్రికి బంధువు.

13. నీ తల్లి సోదరిని కూడరాదు. ఆమె నీ తల్లికి బంధువు.

14. నీ పినతండ్రి భార్యను కూడరాదు. ఆమె నీకు పినతల్లి.

15. నీ కోడలిని కూడరాదు. ఆమె నీ కుమారునకు భార్య.

16. నీ మరదలిని కూడరాదు. ఆమె నీ సోదరుని భార్య.

17. నీవొక స్త్రీనికూడినచో మరల ఆమె కుమార్తెనో మనుమరాలినో కూడరాదు. వారు నీకు రక్తసంబంధులు అగుదురు. గనుక అది వావి వరుసలు లేని లైంగిక సంబంధమగును.

18. నీ భార్య బ్రతికియుండగా ఆమె సోదరిని పరిగ్రహింప రాదు, కూడరాదు.

19. ముట్టుతను కూడరాదు.

20. పరుని భార్యను కూడరాదు. అి్ట కార్యమువలన నీవు అశుచిమంతుడవు అగుదువు.

21. మీ పిల్లలను మోలెకు దేవతకు దహనబలిగా అర్పింపరాదు. అి్ట చెయిదమువలన మీరు మీ ప్రభువైన దేవుని నామ మును అమంగళము చేయుదురు. నేను మీ ప్రభువును.

22. మీరు స్వలింగ మైథునమునకు పాల్పడరాదు. అది జుగుప్స కలిగించు కార్యము.

23. స్త్రీ పురుషులు ఎవరైనను జంతుసంపర్కము చేయరాదు. అి్ట వైపరీత్య మునకు పాల్పడువారు అశుచిమంతులు అగుదురు.”

24. ఇి్ట క్రియలద్వారా మీరు అపవిత్రులు కావలదు. ఇి్ట చెయిదములకు పాల్పడుటవలననే నేను మీ చెంతనుండి వెళ్ళగ్టొిన జనులు అపవిత్రులైరి.

25. వారి పాపములవలన ఈ నేల అపవిత్రమైనది. కనుక ప్రభువు ఈ నేలను శిక్షించి అది తనమీద వసించువారిని విసర్జించునట్లు చేసెను.

26-27. వారు హేయమైన కార్యములు చేసి ఈ దేశమును అపవిత్రము చేసిరి. కాని మీరట్లు చేయరాదు. మీరు యిస్రాయేలీయులైనను, మీ చెంతవసించు అన్యజాతి వారైనను ప్రభువు ఆజ్ఞలను, చట్టములను పాింప వలెను.

28. అప్పుడు ఈ దేశము పూర్వము తన యందు వసించినవారిని విసర్జించినట్లుగా మిమ్ము విసర్జింపదు. 29. ఇి్ట ఏహ్యమైన పనులు చేయువారు దైవప్రజలనుండి వెలివేయబడుదురు.

30. మీరు నా ఆజ్ఞలు పాింపుడు. మీకు పూర్వము ఇచట వసించిన ప్రజలవలె మీరు నీచమైన పనులు చేయకుడు. ఇి్ట చెయిదములకు పాల్పడి అపవిత్రులు కావలదు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము