షిమ్యోను తెగ

19 1. చీట్లు వేయగా వచ్చిన రెండవవంతు చీి షిమ్యోను కుటుంబముల వారికి లభించెను. వారి వంతు భూమి యూదీయుల వారసత్వభూమి మధ్య నుండెను.

2-6. వారికి లభించిన పట్టణములు  బేర్షెబా, షేబ, మోలడా, హాసారు-షువాలు, బాలా, ఏజెము, ఏల్తోలాదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్‌మార్కబోతు, హాసారు-సూసా, బేత్‌లెబావోతు, షారుహేను వానివాని పల్లెలతో కూడి మొత్తము పదు మూడు  నగరములు.

7.అలాగే ఆయిన్‌, రెమ్మోను, ఏతేరు, ఆషాను వానివాని పల్లెలతో గూడి నాలుగు నగరములు.

8. వీనితో పాటు బాలత్‌-బేయేరు వరకు నేగెబురామా వరకు వ్యాపించియున్న పల్లెలు అన్నియు వారివే.

9. షిమ్యోను కుటుంబముల వారికి లభించిన వారసత్వభూమి ఇదియే. యూదా తెగవారికి లభించిన భాగము చాలపెద్దది. కనుక షిమ్యోను వారసభూమి యూదా నుండే పంపిణీచేయబడెను. కనుకనే షిమ్యోను తెగకు వచ్చిన వంతు యూదా వారసత్వభూమి మధ్య నున్నది.

సెబూలూను తెగ

10. చీట్లు వేయగా వచ్చిన మూడవ చీి సెబూలూను తెగకు లభించెను. వారి నేల సరీదు వరకు వ్యాపించెను.

11. వారి సరిహద్దు తూర్పు వైపున మరాలతు వరకును పోయి దబ్బెషేత్తును యోక్నెయామునకు ఎదుటనున్న వాగును దాటెను.

12. తూర్పు వైపున ఆ సరిహద్దు సరీదు నుండి ఖిస్లోత్తు-తాబోరు వరకు అక్కడి నుండి దాబ్రత్తు వరకును యాఫియా వరకు వ్యాపించెను.

13. అక్కడి నుండి తూర్పుగా బోయి గత్‌-హెఫెరు ఎత్కాకాసీను చేరెను. అక్కడి నుండి రిమ్మోను దాిపోయి నేయా చేరెను.

14. ఉత్తరమున హన్నతోను వైపు వంగి యిఫ్తాయేలు మైదానము చేరెను.

15. పైగా కత్తాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అను పన్నెండు పట్టణములు వాని పల్లెలు వారివే. 16. ఈ పట్టణములు వాని పల్లెలు సెబూలూను తెగవారి వారసత్వభూమి లోనివే.

యిస్సాఖారు తెగ

17. చీట్లు వేయగా నాలుగవవంతు చీి యిస్సాఖారు తెగవారు పొందిరి.

18. వారి మండలము యెస్రెయేలు వరకు వ్యాపించెను.

19-21. కెసుల్లోతు, షూనెము, హాఫరా యీము, షియోను, అనహారతు, రబ్బీతు, కిషియోను, ఏబేసు, రేమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా,  బెత్పాసేసు నగరములు వారివే.

22. వారి సరిహద్దు తాబోరు మీదుగా పోయి షహసుమా, బేత్‌షెమేషు దాి యోర్దాను చేరెను. అవి యన్నియు వానివాని పల్లెలతో జేరి పదునారు నగరములు.

23. ఈ నగరములు పల్లెలు వారివారి కుటుంబముల ప్రకారము యిస్సాఖారు తెగలకు చెందినవి.

ఆషేరు తెగ

24. చీట్లువేయగా ఐదవవంతు ఆషేరు తెగవారు పొందిరి.

25-26. హెల్కాత్తు, హాలి, బేతెను, అక్షాఫు, అల్లమ్మేలెకు, ఆమదు, మీషాలు వారి మండలము లోనివే. పడమట కర్మెలు, లిబ్నాత్తు ఎల్లలు.

27. వారి సరిహద్దు తూర్పువైపున బేత్‌దాగోను వరకు పోయి, సెబూలూను చేరి, ఉత్తరమున ఇఫ్తాయేలు లోయచొచ్చి, అటుమీద బెతేమెకు, నెయీయేలుచేరి, ఉత్తరమున కాబూలు వరకును పోయెను.

28.  ఎబ్రోను, రేహోబు, హమ్మోను, కానా కలుపుకొని పెద్దసీదోను వరకు పోయెను.

29. ఆ సరిహద్దు అక్కడి నుండి వెనుకకు తిరిగి రామా చేరి తూరు, హాషా దుర్గములను కలుపుకొని సముద్రము చేరెను. మహలబు, అక్సీబు, ఉమ్మ, ఆఫెకు, రహోబు అను ఇరువది రెండు పట్టణములను వారి పల్లెలను గూడ కలుపుకొనెను.

30-31. ఈ పట్టణములు పల్లెలు ఆషేరు తెగకు చెందినవే.

నఫ్తాలి తెగ

32. చీట్లు వేయగా ఆరవ వంతు చీి నఫ్తాలి తెగలవారు పొందిరి.

33. వారి మండలము హెరేపు నుండి సనాన్నీము సింధూరము మీదుగా ఆదమీ నేగెబు చేరి యాబ్నీలు నందలి లాక్కూము వరకు పోయి యోర్దాను చేరెను.

34. వారి పడమి సరిహద్దు ఆస్నోత్తు తాబోరు మీదుగా, హక్కోకు మీదుగా పోయి దక్షిణమున సెబూలూనును, పడమ ఆషేరును, తూర్పున యోర్దానును చేరెను.

35-38. వారి రక్షితపట్టణములు సిద్దీము, సేరు, హమ్మతు, రక్కాత్తు, కిన్నెరెతు, ఆదమా, రామా, హాసోరు, కేదేషు, ఎద్రేయి, ఎన్‌-హాసోరు, యిరోను, మిగ్దావేలు, హోరెము, బేత్‌అనాతు, బేత్‌షెమేషు అనునవి వానివాని పల్లెలతో పాటు పందొమ్మిది

39. ఈ పట్టణములు పల్లెలు వారివారి పట్టణముల ననుసరించి నఫ్తాలి తెగకు చెందినవి.

దాను తెగ

40. చీట్లు వేయగా ఏడవవంతు చీి దానుతెగ వారు పొందిరి.

41-46. సోరా, ఏష్టవోలు, ఈర్షెమేషు, షాలబీను, అయ్యాలోను, ఈత్లా, ఏలోను, తిమ్నా, ఏక్రోను, ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు, యెహూదా,  బెన్బేరెకు, గాత్రిమ్మోను, మెయార్కోను, యోప్పా వైపుగల నేలతోపాటు రక్కోను వారి మండలముననే కలవు.

47. దానీయులు వారి భూభాగము కోల్పోవుటచే, ఆ తెగవారు బయలుదేరి లేషేము మీద యుద్ధము చేసి, దానిని పట్టుకొని కొల్లగ్టొి, స్వాధీన పరుచుకొని దానిలో వసించి తమ వంశకర్తయగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అని పేరు ప్టిెరి.

48. ఈ పట్టణములు పల్లెలు వారివారి కుటుంబ ముల ననుసరించి దానుతెగకు చెందినవి.

49. ఇంతితో వంతులువేసి నేలను పంచు కొనుట ముగిసెను. నూను కుమారుడు యెహోషువకు కూడ యిస్రాయేలీయులు తమతోపాటు వారసత్వము నిచ్చిరి.

50. యెహోషువ ఎఫ్రాయీము పీఠభూముల లోని తిమ్నాత్‌సెరా పట్టణమునడుగగా, యావే ఆజ్ఞ చొప్పున ఆ నగరమును అతనికిచ్చివేసిరి. యెహోషువ పట్టణమును మరల నిర్మించి దానియందు వసించెను.

51. షిలో నగరమున యావే ఎదుట సమావేశపు గుడారము గుమ్మమునొద్ద యాజకుడైన ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, ఆయా కుటుంబ ముల పెద్దలు కలసి వంతులువేసి యిస్రాయేలు తెగలకు పంచియిచ్చిన వారసత్వభూములివియే. ఈ రీతిగా భూవిభజన ముగిసెను.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము