విభిన్న రచనలు

సిద్కియాకు పట్టనున్న దుర్గతి

34 1. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, అతనిసైన్యము, అతని ఏలుబడిలోనున్న రాజ్యములు, జాతులు, యెరూషలేమును, దాని చుట్టుపట్లనున్న నగరములను ముట్టడించుచున్నకాలమున, ప్రభువు నుండి యిర్మీయాకు వచ్చినవాక్కు.

2. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నన్ను యూదారాజగు సిద్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లు చెప్పుమనెను: ”ప్రభువు పలుకిది. నేనీ నగరమును బబులోనియా రాజునకు ఒప్పగింతును. అతడు దీనిని కాల్చివేయును.

3. నీవును తప్పించుకోజాలవు. విరోధులు నిన్ను పట్టు కొని ఆ రాజునకు ఒప్పగింతురు. నీవతనిని ముఖా ముఖి దర్శించి మ్లాడుదువు. నిన్ను బబులోనియాకు బందీనిగా గొనిపోవుదురు.’

4. సిద్కియా! నేను నిన్ను గూర్చి చెప్పు పలుకులాలింపుము: ‘నీవు పోరున చని పోవు.

5. ప్రశాంతముగనే కన్ను మూయుదువు. ప్రజలు నీకు పూర్వము ఏలిన రాజులను పాతి ప్టిె నపుడు సాంబ్రాణిపొగవేసిరి. వారు నీకును అట్లే చేయు దురు. నీవు చనిపోయినపుడు ప్రజలు ”అయ్యో! ప్రభూ!” అనుచు శోకింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.’

6. నేనీ పలుకులెల్ల యెరూషలేమున సిద్కియా రాజునకు విన్నవించితిని.

7. అపుడు బబులోనియా రాజు సైన్యము ఆ నగరమును ముట్టడించుచుండెను. ఆ దండు అదే సమయమున లాకీషు, అసేకా పట్టణ ములను కూడ ముట్టడించుచుండెను. యూదాలో మిగిలియున్న సురక్షితపట్టణములు అవి రెండే.

ప్రజలు బానిసలను వంచించుట

8. సిద్కియా రాజును, యెరూషలేము ప్రజలును కలిసి బానిసలకు విముక్తి దయచేయవలయునని ఒప్పందము చేసికొనిరి.

9. ఎల్లరును హీబ్రూజాతి వారైన తమ ఆడ, మగబానిసలకు విముక్తినిచ్చుటకును, సజాతీయులను ఎవరిని బానిసలను చేయకుండుట కును నిర్ణయించుకొనిరి.

10. ఆ నిర్ణయము చొప్పున ప్రజలును, వారి నాయకులును తమ బానిసలకు విడుదలనిచ్చుటకు అంగీకరించిరి. వారిచే మరల దాస్యము చేయించుకోరాదని  నిశ్చయించుకొనిరి. కనుక వారిని వెళ్ళిపోనిచ్చిరి.

11. కాని ఆ ప్రజలు కొంతకాలము తరువాత తమ మనసు మార్చుకొనిరి. తమ దాసదాసీ జనమును నిర్బంధముచేసి మరల బందీలను గావించిరి.

12. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను:

13. ”యిస్రాయేలు దేవుడైన ప్రభువు ప్రజలతో ఇట్లు చెప్పుచున్నాడు: నేను మీ పితరులను బానిసల కొంపయైన ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు వారితో నిబంధనము చేసికొింని. నేను వారితో ఇట్లింని.

14. ‘ఏడేండ్లు కడచిన తరువాత మీరు సజాతీయులైన మీ హీబ్రూ బానిసలను వెళ్ళిపోనీయవలెను. ఆరేండ్లు ఊడిగము చేసినపిదప వారికి విముక్తి ఒసగవలెను.’ కాని మీ పితరులు నన్ను లక్ష ్యము చేయలేదు, నా మాటలు వినలేదు.

15. నేడు మీరు మీ మనసు మార్చుకొని నాకు ప్రీతి కలిగించు కార్యము చేసితిరి. మీరు మీ సోదరులకు స్వేచ్ఛను ఒసగుదుమని ప్రక ించితిరి. నా పేర వెలసిన ఈ మందిరమున, నా యెదుట మీరు ఒప్పందము చేసికొింరి.

16. కాని యింతలోనే మీరు మరల మనసు మార్చుకొని నాకు అవమానము కలిగించితిరి. మీరు విడుదల దయచేసి స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చిన దాసదాసీజనమును మరల బంధించితిరి. వారిని నిర్బంధముగా బానిసలను చేసితిరి.

17. కనుక ఇపుడు ప్రభుడనైన నేను చెప్పునదే మనగా: మీరు నా ఆజ్ఞమీరితిరి. మీ సోదరులకు స్వేచ్ఛనీయరైతిరి. కావున నేనే మీకు స్వేచ్ఛనిత్తును. అది పోరు, కరువు, అంటు రోగములవాతబడి మీరు చచ్చు స్వేచ్ఛయే. లోకములోని జాతులెల్ల మిమ్ము అసహ్యించుకొనును.

18-19. యూదా యెరూషలేము అధిపతులును, ప్రాసాదాధిపతులును, యాజకులును, నాయకులును తాము రెండుభాగములుగా విభజించిన కోడెదూడ మాంసఖండముల మధ్యన నడచి నాతో నిబంధనము చేసికొనిరి. కాని వారు నా యెదుట చేసికొనిన నిబంధనమును మీరిరి. దాని నియమ ములు పాింపరైరి. కావున తాము రెండుఖండ ములుగా కోసి వాని మధ్య నడచిన కోడెదూడకు ఏ గతి పట్టెనో ఆ గతినే వారికిని ప్టింతును.

20. నేను వారిని తమను చంపజూచు శత్రువులచేతికి అప్ప గింతును. పకక్షులును, వన్యమృగములను వారి శవము లను తినివేయును.

21. నేను యూదారాజు సిద్కియాను, అతడి అధికారులనుగూడ తమను చంప జూచు శత్రువుల చేతికప్పగింతును. ఇప్పుడు ముట్టడి నాపివేసి, మీ యొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనియా రాజు సైన్యమునకు వారినప్పగింతును.

22. నేను వారికి ఆజ్ఞనీయగా, వారు మరల ఈ నగరము మీదికి వత్తురు. దీనిని ముట్టడించి వశముచేసికొని కాల్చి వేయుదురు. నేను యూదా నగరములను నరసంచా రములేని ఎడారులుగా మార్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”