3   1. ఆ నగరముల ప్రజలెల్లరు హోలోఫెర్నెసు నొద్దకు దూతలనంపి అతనికి ఈ క్రింది సందేశమును వినిపింపుడని చెప్పిరి.

2. ”మేమెల్లరము మహా ప్రభువైన నెబుకద్నెసరుకు దాసులము. మేము నీ ముందు సాగిలపడెదము. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయ వచ్చును.

3. మా ఇండ్లు, భూములు, గోధుమచేలు, గొఱ్ఱెలమందలు, గొడ్లమందలు, గొఱ్ఱెలదొడ్లు నీ ఆధీనముననున్నవి. వానిని నీ ఇష్టము వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చును.

4. మా పట్టణములు పౌరులు నీచెప్పుచేతలలో ఉందురు. వారిని నీ చిత్తము చొప్పున వినియోగించుకొనుము.” 5. ఆ దూతలు హోలోఫెర్నెసునొద్దకు వచ్చితమ సందేశమును విన్పించిరి.

6. అంతట అతడు సైన్యముతో సముద్రతీరము నకు వెళ్ళి, ప్రతి సురక్షిత పట్టణమున సైన్యములను నిలిపెను. ప్రతి పట్టణమునుండి కొందరు వీరులను ఎన్నుకొని తన సైన్యమున చేర్చుకొనెను.

7. ఈ నగర ముల పౌరులును, చుట్టుపట్లనున్న పట్టణముల ప్రజలును పూలదండలతో సితారా వాయించుచు నాట్యము చేయుచు ఎదురొచ్చి హోలోఫెర్నెసునకు స్వాగతము చెప్పిరి. 8. అయినను అతడు వారి దేవళములను పడగ్టొించెను. పూజావనము లను నరికించెను. స్థానికదైవములనెల్ల రూపుమాపవలెననియు, సకలజాతులును  నెబుకద్నెసరునే దేవునిగా అంగీకరించి, పూజింపచేయవలెననియు అతడు ముందుగనే ఆజ్ఞలు పొందియుండెను.

9. పిదప హోలోఫెర్నెసు దోతాను సమీపమున నున్నఎస్డ్రలోనుచేరువకువచ్చెను. ఈ దోతాను యూదయా లోని పెద్ద పర్వతశ్రేణికెదురుగానున్నది.

10. అతడు గెబా, స్కితోపోలిసు నగరముల మధ్య శిబిరము పన్నెను. తన సైన్యమునకు వలసిన వస్తుసంభారములను చేకూర్చు కొనుటకుగాను అచట ఒక నెలకాలము విడిదిచేసెను.