విజయగీతము
యావే సేవకుడైన దావీదు అతని శత్రువులందరి నుండియు, ప్రధానముగా సౌలు చేతిలోనుండియు తనను తప్పించిన దినమున యావేను స్తుతించి పాడిన కీర్తన
18 1. యావే! నేను నిన్ను ప్రేమించుచున్నాను.
నా బలము నీవే.
2. ప్రభువు నాకు శిల, కోట.
నా దేవుడు నన్ను ఆపదలనుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును.
ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు,
రక్షణసాధనము, ఆశ్రయస్థానము.
3. నేను ప్రభువునకు మొరపెట్టగా
అతడు నన్ను శత్రువులనుండి కాపాడెను.
ఆయన స్తుతింపదగినవాడు.
4. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను.
అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను.
5. పాతాళపాశములు నన్ను చుట్టుకొనెను.
మృత్యుబంధనములు నన్ను పెనవేసికొనెను.
6. నా ఆపదలో నేను ప్రభువునకు మొరప్టిెతిని. నా దేవుని వేడుకొింని.
ఆయన తన దేవాలయమునుండి
నా వేడుకోలు ఆలించెను.
నా మొర ఆయన చెవిని పడెను.
7. అపుడు ప్రభువు కోపోద్రిక్తుడుకాగా
భూమి కంపించి దద్దరిల్లెను,
పర్వతముల పునాదులు వణకెను.
8. ఆయన నాసికారంధ్రములనుండి
పొగలు ఎగసెను.
ఆయన నోినుండి
సర్వమును దహించు జ్వాలలును,
గనగనమండు నిప్పుకణికలును బయల్వెడలెను.
9. ప్రభువు ఆకాశమును
తెరవలె తొలగించి కిందికి దిగివచ్చెను.
ఆయన పాదముల క్రింద
కారుమబ్బులు క్రమ్మియుండెను.
10. ఆయన కెరూబుదూతమీద
స్వారిచేయుచు వచ్చెను.
వాయువు రెక్కలమీదకెక్కి శీఘ్రముగా విచ్చేసెను.
11. అంధకార తెర ఆయనను క్రమ్మియుండెను.
దట్టమైన నల్లని నీలిమబ్బులు
ఆయనకు గుడారమైయుండెను.
12. ఆయన ముందట మెరుపులు మెరసెను.
వానినుండి వడగండ్లు,
గనగనమండు నిప్పుకణికలును వెడలెను.
13. ప్రభువు ఆకాశమునుండి గర్జించెను.
మహోన్నతుని ధ్వని విన్పించెను.
14. అతడు బాణములు రువ్వి శత్రువులను
చిందరవందర చేసెను.
మెరుపులు విసరి వారిని చీకాకుపరచెను.
15. ప్రభూ! నీవు శత్రువులను గద్దించుచు
నీ నాసికారంధ్రములనుండి
ఉగ్రశ్వాసమును విడువగా
సముద్రగర్భము తేటతెల్లగా కన్పించెను.
జగత్తు పునాదులు స్పష్టముగా చూపట్టెను.
16. ప్రభువు ఆకాశమునుండి దిగివచ్చి
తన చేతితో నన్ను పట్టుకొనెను.
అగాధజలరాశిలోనుండి నన్ను బయటకిలాగెను.
17. బలాఢ్యులైన నా ప్రత్యర్థులనుండి,
నన్ను ద్వేషించు విరోధులనుండి
ఆయన నన్ను కాపాడెను.
వారు నా కంటెను బలవంతులు.
18. నాకు ఆపద వాిల్లినపుడు
శత్రువులు నా మీదికెత్తివచ్చిరి.
కాని ప్రభువు నన్ను ఆదుకొనెను.
19. ఆయన నన్ను
విశాలమైన స్థలమునకు తోడుకొనివచ్చెను.
నేననిన ప్రభువునకు ఇష్టము
కనుక నన్ను కాపాడెను.
20. నేను ధర్మమును పాించితిని కనుక
ప్రభువు నన్ను సన్మానించెను.
నేను నిర్దోషిని కనుక నన్ను బహూకరించెను.
21. నేను ప్రభువు ఆజ్ఞలకు విధేయుడనైతిని.
దుష్టపూరితముగ ఆయననుండి వైదొలగనైతిని.
22. నేనతని విధులనెల్ల పాించితిని.
ఆయన ఆజ్ఞలనేమాత్రము మీరనైతిని.
23. ఆయన నన్ను దోషరహితునిగా ఎంచెను.
నేను కిల్బిషమునకు దూరముగా ఉంిని.
24. నేను ధర్మవర్తనుడను గనుక
ప్రభువు నన్ను సత్కరించెను.
నా విశుద్ధవర్తనమునకు తగినట్లుగా
నాకు ప్రతిఫలమొసగెను.
25. ప్రభూ!
నీవు దయగలవారిపట్ల దయచూపింతువు,
యదార్ధవంతులయెడల
యదార్ధవంతుడివిగా ఉందువు.
26. విశుద్ధులపట్ల విశుద్ధుడవుగాను,
కపాత్ములయెడల కపటముగను వర్తింతువు.
27. నీవు వినయాత్ములను రక్షింతువు.
పొగరుబోతులను మన్నుగరపింతువు.
28. ప్రభూ! నీవు నా దీపమును వెలిగింతువు.
నా త్రోవలోని చీకిని తొలగింతువు.
29. నీ బలముతో నేను శత్రుసేనలను జయించి,
వారి దుర్గములను స్వాధీనము చేసికొందును.
30. ఈ దేవునిమార్గములు పరిపూర్ణమైనవి.
ప్రభుని వాగ్ధానములు నమ్మదగినవి.
తనను ఆశ్రయించిన వారిని
ఆయన డాలువలె కాపాడును.
31. ప్రభువుతప్ప దేవుడెవడు? ఆ దేవుడు తప్ప
మనలను ఆధారశిలగా కాపాడువాడెవడు?
32. నాకు బలము దయచేయు దేవుడతడే.
నా మార్గమును సురక్షితము చేయువాడతడే.
33. ఆయన నా పాదములను
జింక పాదములవలె దృఢము చేసెను.
నేను జారిపడకుండ
కొండకొమ్మున నిల్చునట్లు చేసెను.
34. ఆయన నాకు యుద్ధము చేయుటకు
తర్ఫీదు నిచ్చెను.
కనుక నేను బలిష్ఠమైన
ధనుస్సును ఉపయోగింపగల్గితిని.
35. నీవు నాకు నీ రక్షణడాలు నందించితివి.
నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను.
నీ కరుణవలన నేను గొప్పవాడనైతిని.
36. నీవు నేను ఇరకాటమున చిక్కకుండునట్లు చేసితివి.
కావున నేను కూలిపోనైతిని.
37. నేను నా శత్రువులను వెన్నాడి పట్టుకొింని.
వారిని నాశనము చేసినదాక
పోరునుండి వెనుదిరుగనైతిని.
38. నేను వారిని పడగొట్టగా వారు పైకి లేవజాలరైరి.
వారు ఓడిపోయి నా పాదముల చెంతపడిరి.
39. రణమున పోరాడుటకు
నీవు నాకు శక్తిని ఒసగితివి.
నా శత్రువులు నాకు లొంగిపోవునట్లు చేసితివి.
40. నా విరోధులు నా ఎదుినుండి
పారిపోవునట్లు చేసితివి.
నన్ను ద్వేషించువారిని
నేను హతమార్చునట్లు చేసితివి.
41. శత్రువులు మొరప్టిెరిగాని
వారిని రక్షించు వాడెవడును లేడయ్యెను.
వారు ప్రభువునకు మనవి చేసిరిగాని
ఆయన వారికి ప్రత్యుత్తరమీయలేదు.
42. నేను వారిని గాలికెగిరిపోవు
ధూళివలె పొడిపొడి చేసితిని.
వీధులోని బురదనువలె నలుగద్రొక్కితిని.
43. నా మీద తిరుగుబాటు చేసిన వారినుండి
నీవు నన్ను కాపాడితివి.
అన్యజాతులకు నన్ను అధిపతినిగావించితివి. నేనెన్నడును ఎరుగని జనులు నాకిపుడు దాసులైరి.
44. వారు నా పేరు వినగనే
నాకు విధేయులగుచున్నారు.
అన్యజాతి ప్రజలు
నాకు లొంగి దండము పెట్టుచున్నారు.
45. అన్యులు ధైర్యముకోల్పోయి గడగడవణకుచు
తమ కోటలనుండి కదలి వచ్చుచున్నారు.
46. ప్రభువునకు దీర్ఘాయువు,
నా రక్షకునకు నమస్క ృతులు.
నన్ను కాపాడిన దేవునకు మహాస్తుతులు.
47. ఆయనవలన నేను నా విరోధులను జయించితిని.
అన్యజాతులు నాకు లొంగిపోయినవి.
48. ఆయన నా శత్రువులనుండి నన్ను విడిపించెను.
నా మీదికి లేచువారికంటె
ఎక్కువగా నన్ను లేవనెత్తును.
హింసాత్ముల చెరనుండి నన్ను విడిపించును.
49. కనుక ప్రభూ! అన్యజాతుల నడుమ
నేను నిన్ను కొనియాడెదను.
నీ దివ్యనామమును స్తుతించి కీర్తించెదను.
50. ప్రభువు తన రాజునకు
మహావిజయములు దయచేయును.
అతడు తాను ఎన్నుకొనిన దావీదునకును
అతని సంతతికిని కలకాలము కరుణచూపును.