ఐగుప్తుదేశమునుండి విడుదల

ఐగుప్తున యిస్రాయేలీయులు వృద్ధిచెందుట

1. ఐగుప్తుదేశమునకు తమతమ కుటుంబము లతో యాకోబు వెంటవెళ్ళిన యిస్రాయేలీయుల పేరులివి: 2. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, 3. యిస్సాఖారు, సెబూలూను, బెన్యామీను, 4. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.

5. యాకోబు సంతతివారు మొత్తము డెబ్బదిమంది. అంతకుముందే యోసేపు ఐగుప్తుదేశమున ఉండెను. 6. కొంతకాలమునకు యోసేపు, అతని సోదరులు, వారితరమువారు అందరును మరణించిరి.

7. యిస్రాయేలీయులు పెక్కుమంది పిల్లలనుకని, లెక్కకు మిక్కుటముగా పెరిగిరి. వారు అసంఖ్యాకముగా పెరిగి విస్తరిల్లి ప్రబలులైరి. నేల యీనినట్లు ఎక్కడ చూచినను యిస్రాయేలీయులే.

హెబ్రీయుల బాధలు

8. అప్పుడు యోసేపు పుట్టుపూర్వోత్తరములు తెలియని ఒక కొత్తరాజు ఐగుప్తుదేశమున సింహాసనమును అధిష్టించెను.

9. ఆ రాజు తన పరిజనులతో ”ఈ యిస్రాయేలీయుల సంతతి మనకంటే విస్తారమై బలిష్టముగానున్నది.

10. వారు ఇకముందు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడచు కొనవలయును. కానిచో యుద్ధములు వచ్చినపుడు వారు మన శత్రువుల పక్షమునచేరి మనలను ఎదిరింతురు. మన దేశమునుండి తప్పించుకొని పారిపోయెదరు” అనెను.

11. ఆ మాటలనుబ్టి రాజాధికారులు యిస్రాయేలీయులచే వ్టెిచాకిరి చేయించి, వారిని అణగద్రొక్కుటకై వారిమీద దాసాధ్యకక్షులను నియమించిరి. ఈ విధముగా యిస్రా యేలీయులు ఫరోరాజునకు గిడ్డంగులుండు నగరము లయిన పీతోమును, రామెసేసును నిర్మించిరి.

12. రాచిరంపాన ప్టిెనకొలది యిస్రాయేలీయులు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తుదేశీయులు యిస్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి. వారికి భయపడిరి.

13.వారు నిర్దాక్షిణ్యముగా యిస్రాయేలీ యులను బానిసలుగా చేసిరి.

14. వ్టెిచాకిరితో ఇటుక తయారీపనులు,  మ్టిపనులు, అన్నిరకముల  పొలము పనులు చేయించి వారి బ్రతుకును భరింప రానిదిగా చేసిరి. బండపనులన్నిని వారినెత్తిన రుద్దిరి.

15. తరువాత ఐగుప్తురాజు షీఫ్రా, పూవా అను హెబ్రీయుల మంత్రసానులతో మ్లాడెను.

16. అతడు వారితో ”మీరు హెబ్రేయ స్త్రీలకు కాన్పు చేయునపుడు వారికి ఏ బిడ్డపుట్టునో కన్నువేసి ఉండుడు. మగపిల్లవాడైనచో వెంటనే చంపుడు. ఆడుపిల్లయైనచో ప్రాణములతో వదలుడు” అని చెప్పెను.

17. కాని మంత్రసానులకు దైవభీతి కలదు. వారు రాజాజ్ఞలను మీరిరి. ప్టుిన మగపిల్లలను చంపరైరి.

18. అందుచేత ఐగుప్తురాజు మంత్ర సానులను పిలిపించి ”మీరు ఈ పని ఏల చేసితిరి?  మగపిల్లలను  ఏల ప్రాణములతో వదలితిరి?”  అని అడిగెను.

19. వారు ”ప్రభూ! హెబ్రీయ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వింవారుకాదు. వారు మిక్కిలి సత్తువ కలవారు. మంత్రసాని రాకముందే సులభముగా ప్రసవింతురు” అని చెప్పిరి.

20. దేవుడు ఆ మంత్రసానులపట్ల కనికరము చూపెను. యిస్రాయేలీయులు అంత కంతకు పెరిగి మిక్కిలి ప్రబలిరి.

21. మంత్రసానులు దేవునికి భయపడినవారగుటచే, ఆయన వారి వంశ ములను కూడ నిలిపెను.

22. అంతట ఫరోరాజు ”హెబ్రీయులకు ప్టుిన మగపిల్లలను నైలునదిలో పారవేయుడు. ఆడపిల్లలను మాత్రము బ్రతుకనిండు” అని తన ప్రజలను ఆజ్ఞాపించెను.

Previous                                                                                                                                                                                                Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము