దావీదు స్తుతిగీతము

22 1. యావే తనను సౌలు చేతులోనుండియు,  తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించి నందులకు కృతజ్ఞతగా దావీదు ఈ క్రింది గీత పదములతో యావేను స్తుతించెను.

2.           ”ప్రభువు నాకు దుర్గము, శిల, రక్షణము.

3.           అతడే నా దుర్గము కనుక నేనతని దాపుసొచ్చెదను. అతడే నా డాలు, నా ప్రాపు, 

               నన్ను కాచి కాపాడు రక్షణదుర్గము.

               యావే శత్రువులనుండి నన్ను కాపాడును.

4.           నేను యావే శరణుజొచ్చితిని,

               ఆయన ప్రశంసనీయుడు,

               శత్రువులనుండి నన్ను కాపాడువాడు.

5.           మృత్యువు యొక్క అలలు

               నా చుట్టు ఉవ్వెత్తుగ లేచినవి.

               దుష్టప్రవాహములు నన్ను ముంచివైచినవి.

6.           మృతలోకపాశములు నన్ను బంధించినవి.

               మరణపుటురులు నన్ను గ్టిగా బిగింపజొచ్చినవి.

7.            నా ఇక్కట్టులలో యావేకు మొరప్టిెతిని.

               ప్రభువును ఎలుగెత్తి పిలిచితిని.

               తన ఆలయమునుండి ఆయన నా మొర వినెను.

               నా గోడు యావే చెవినిబడెను.

8.           ప్రభువు కోపమునుచూచి నేల అదరి దద్దరిల్లెను.

               ఆకాశపునాదులు కంపించి గడగడ వణకెను.

9.           యావే ముక్కుపుటలనుండి పొగలు పుట్టెను. ఆయన నోినుండి

               నిప్పుకణికలు రాలి మంటలు లేచెను.

10.         ప్రభువు ఆకాశమును

               చిందరవందర చేయుచు దిగివచ్చెను.

               కారుచీకట్లు ఆయన పాదములను కమ్ముకొనెను.

11.           యావే కెరూబు దూతపైనెక్కి స్వారిచేసెను.

               వాయువురెక్కలపై కూర్చుండి విజయము చేసెను.

12.          ప్రభువు చీకటులతో ఒక గుడారము పన్నుకొనెను.

               ఆకాశమునందలి దట్టపు నీిమబ్బులు

               ఆయనను గొడుగువలె కప్పివైచెను.

13.          యావే ముందట ఒకమంట గుప్పించి ఎగసెను.

               నిప్పు కణికలు మిలమిల మెరసెను.

14.          యావే ఆకాశము నుండి గర్జించెను.

               మహోన్నతుడైన దేవుడు సింహనాదము చేసెను.

15.          ఆయన బాణములు విసరి

               జలములను చెల్లాచెదరు చేసెను.

               మెరుపులు విసరి నీళ్ళను కకావికలు చేసెను.

16.          యావే గద్దింపగా, ముక్కు రంధ్రముల నుండి

               శ్వాస వడిగా వదలగా, నీళ్ళన్నియు తొలగిపోయి కడలిగర్భము కాన్పించెను.

               నేలపునాదులు బయటపడెను.

17.          ప్రభువు ఆకసమునుండి దిగివచ్చి నన్నుచేకొనెను.

               నీళ్ళ నడుమనుండి నన్ను పైకిలేపెను.

18.          బలవంతులగు శత్రువులనుండి,

               నాపై బడిన పగవారినుండి,

               ప్రభువు నన్ను కాపాడెను.

19.          ఆ చెడుదినమున గిట్టనివారు నన్నెదిరించిరి.

               అయినను ప్రభువు నన్ను ఆదుకొనెను.

20.        యావే నన్ను ఒడ్డు చేర్చెను.

               నాయందు ఆయన ఆనందించెను గనుక

               యావే నాయందు కూర్మితో నన్నాదరించెను.

21.          నా నీతిని చూచి యావే నన్ను సంభావించెను.

               నా విశుద్ధవర్తనమును చూచి

               నన్ను బహుమానించెను.

22.         నేను ప్రభువు చట్టములు పాించితిని.

               యావేకట్టడలు జవదాటనైతిని.

23.         ప్రభుశాసనములు

               నా కన్నులఎదుట నిలుపుకొింని.

               ప్రభువు ఆజ్ఞలను అశ్రద్ధ చేయనైతిని.

24.         ఆయన ఎదుట

               నేను నిర్దోషిని అనిపించుకొింని.

               నేను పాపము చెంతకుపోనైతిని.

25.         నా నీతిని చూచి, నా విశుద్ధవర్తనమును చూచి

               యావే నాకు ప్రతిఫలమిచ్చెను.

26.        ప్రభూ!

               నీవు విశ్వసనీయులతో విశ్వసనీయుడవుగా,

               ఉత్తములతో ఉత్తముడవుగా వర్తింతువు.

27.         ఋజువర్తనులతో ఋజువర్తనుడవుగా,

               కపాత్ములతో కపటముగా ప్రవర్తింతువు.

28.        నీవు వినయవంతులను రక్షింతువు.

               తల బిరుసుతనముతో తిరుగు

               గర్వాత్ములను అణగద్రొక్కుదువు.

29.        యావే! నా దీపము నీవే.

               నా త్రోవను వెలిగించువాడవు నీవే.

30.        నీవు తోడైయుండగా

               నేను శత్రు సైన్యముల నెదిరింతును.

               నీవు బాసటయై యుండగా

               పగవారి కోటలు దాటుదును.

31.          ప్రభుమార్గము ఉత్తమమైనది.

               ఆయన వాక్కు నమ్మదగినది.

               యావే తన్నాశ్రయించిన వారిని

               డాలువలె కాచికాపాడును.

32.         యావే తప్ప దేవుడెవడు?

               యావే తప్ప మనకు ఆశ్రయదుర్గమెవడు?

33.         ప్రభువు నాకు బలమొసగును.

               నా కార్యములను నిర్దోషముగ తీర్చిదిద్దును.

34.         ప్రభువు నన్ను కొండకొమ్మున

               సురక్షితముగ నిలుపును.

               కొండబండ మీద నిలిచిన లేడి గిట్టలవలె

               నా పాదములను గ్టిగా నిల్పును.

35.         యావే నన్ను పోరునకు తర్ఫీదు చేయును.

               నా చేతులు కంచువింనైనను ఎక్కుబెట్టగలవు.

36.        ప్రభూ! నీవు నన్ను డాలువలె కాచి కాపాడుదువు. నన్ను కరుణతో మనిచి పెద్దచేయుదువు.

37.         నా పాదములకు వలసినంత చోటు చూపుదువు. నా అడుగులు తడబడనీయకుండ కాపాడుదువు.

38.        నా శత్రువులను వెన్నాడి తునుమాడెదను.

               నా పగవారిని తుదమ్టుించువరకు తిరిగిరాను.

39.        నేను శత్రువులను పడగొట్టెదను.

               నా విరోధులిక లేవలేరు.

               వారు నా పాదముల క్రింద పడిపోయిరి.

40.        ప్రభూ! శత్రువులతో పోరాడుటకై

               నాకు బలమొసగితివి.

               నాపైకి ఎత్తివచ్చిన వారిని నాకు లోబరచితివి.

41.          నీ కృపవలన వైరులు వెన్నిచ్చి పారిపోయిరి.

               నన్ను ద్వేషించిన పగవారినెల్ల మట్టుప్టిెతిని.

42.         వైరివర్గము ఆర్తనాదము చేసెనుగాని

               వారిని రక్షించు నాథుడెవ్వడును లేడయ్యెను.

               వారు యావేకు మొరప్టిెనను బదులు రాలేదు.

43.         శత్రువులను నలుగగ్టొి

               భూధూళివలె పొడిచేసితిని.

               త్రోవలోని మ్టిప్రోవువలె అణగద్రొక్కితిని.

44.         తిరుగుబాటు చేసిన ప్రజల నుండి

               నీవు నన్ను కాపాడితివి.

               వివిధ జాతులకు నన్ను ప్రభుని చేసితివి.

               కనివిని ఎరుగని జనులుకూడ నాకు దాసులైరి.

45.         అన్యప్రజలు నా మన్ననలు పొందుటకై వత్తురు.

               నా మాట వినగానే

               దాసులమని కైమోడ్పులు అర్పింతురు.

46.        నా పేరు చెప్పగనే

               వారి గుండెలు దడదడలాడును.

               వారు గడగడవణకుచు

               దుర్గములను వీడి నన్ను చూడవత్తురు.

47.         యావే సజీవుడు! నా దుర్గము స్తోత్రార్హుడు!

               నా రక్షకుడైన ప్రభువునకు స్తుత్యంజలులు!

48.        నా శత్రువులపై పగతీర్చుకొని

               వారిని నా వశము చేసినది ఆ ప్రభువే.

49.        శత్రువులనుండి నన్ను కాచికాపాడినది ఆ ప్రభువే. విరోధుల చేజిక్కకుండ

               నన్ను రక్షించునది ఆ ప్రభువే.

               నాపై ఎత్తివచ్చిన వారి బారినుండి

               నన్ను కాపాడునది ఆ ప్రభువే.

50.        కావున ప్రభూ!

               సమస్త జాతుల ఎదుట నేను నిన్ను స్తుతింతును.

               నీ నామమును ఎలుగెత్తి పాడెదను.

51.          ప్రభువు తన రాజునకు

               మహావిజయము ప్రసాదించును. 

               తన అభిషిక్తుని ఆదరమున చూచును.

               దావీదును అతని సంతతివారిని

               సదాజీవింపజేయును.”

Previous                                                                                                                                                                                                   Next