నీతిమంతుడును పవిత్రుడునైన దేవుడు

99 1.     ప్రభువు రాజు! జాతులు గడగడ వణకును.

                              ఆయన కెరూబులమీద ఆసీనుడగును.

                              నేల కంపించును.

2.           సియోనున ప్రభువు ఘనుడైయున్నాడు.

               ఆయన ఎల్లజాతులను మించినవాడు.

3.           భీకరమైన ఆయన మహానామమును

               ఎల్లరు స్తుతింతురుగాక! ఆయన పవిత్రుడు.

4.           మహారాజువైన నీవు న్యాయమును ప్రేమింతువు.

               నీవు ఋజువర్తనమును, నీతిన్యాయమును,

               ధర్మమును స్థాపించితివి.

               యాకోబు ప్రజలలో

               ఈ గుణములను నెలకొలిపితివి.

5.           మన ప్రభువైన దేవుని కొనియాడుడు.

               ఆయన పాదపీఠముచెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు.

6.           మోషే అహరోనులు ఆయన యాజకులు,

               సమూవేలు ఆయనకు ప్రార్థన చేసినవాడు.

               వారు ఆయనకు మనవి చేయగా

               ఆయన వారి వేడికోలును ఆలించెను.

7.            మేఘస్తంభమునుండి ఆయన వారితో మ్లాడెను

               ఆయన దయచేసిన శాసనములను,

               కట్టడలను వారు పాించిరి.

8.           మా ప్రభుడవైన దేవా!

               నీవు ప్రజలమొరలు ఆలించితివి.

               నీవు ఆ జనుల పాపములకు

               వారిని దండించినను వారిని మన్నించు

               దేవుడవని రుజువు చేసికొింవి.

9.           మన ప్రభువైన దేవుని కొనియాడుడు.

               ఆయన పవిత్రపర్వతముచెంత

               ఆయనను వందింపుడు.

               మన దేవుడైన ప్రభువు పవిత్రుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము