విజ్ఞానమును అర్జించు విధానము

3 1.         కుమారా!

                              నీవు నా ఉపదేశము మరువకుము.

                              నా ఆజ్ఞలు జాగ్రత్తగా పాింపుము.

2.           నా చట్టములను చేకొందువేని

               దీర్ఘాయుష్మంతుడవగుదువు.

               శాంతి సౌఖ్యములతో అలరారుదువు.

3.           నీవు కరుణను, విశ్వసనీయతను ఆలవరచుకొమ్ము

               వానిని దండలవలె నీ మెడలో ధరించుము.

               నీ హృదయ ఫలకముపై వ్రాసికొనుము.

4.           ఇట్లు చేయుదువేని దేవునికిని,

               నరులకును ప్రీతిపాత్రుడవగుదువు.

5.           నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము.

               నీ తెలివితేటలమీద ఆధారపడకుము.

6.           నీ కార్యములన్నిటను ప్రభువును స్మరింపుము. అతడు నీ పనులను సులభతరము చేయును.

7.            నేనే తెలివైనవాడను అనుకొనకుము.

               దైవభక్తితో దుష్కార్యములనుండి వైదొలగుము.

8.           అది నీ దేహమునకు ఆరోగ్యమును,

               నీ ఎముకలకు సత్తువను చేకూర్చిపెట్టును.

9.           నీకున్న సిరిసంపదలతో దేవుని పూజింపుము. నీకు పండిన పంటలో మొదిపాలు

               అతనికి అర్పింపుము.

10.         అప్పుడు నీ కొట్లు ధాన్యముతోను,

               నీ బానలు ద్రాక్షసారాయముతోను నిండును.

11.           కుమారా!

               ప్రభువు క్రమశిక్షణను తృణీకరింపకుము.

               ఆయన మందలింపులను అశ్రద్ధచేయకుము.

12.          తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించినట్లే

               ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుని చక్కదిద్దును

విజ్ఞానము సంతోషము నొసగును

13.          విజ్ఞానము నార్జించువాడు ధన్యుడు.

               వివేకము నలవరచుకొనువాడు కృతార్థుడు.

14.          వెండిబంగారములు చేకూర్చుకొనుటకంటె

               విజ్ఞానమును ఆర్జించుట మేలు.

15.          అది పగడములకంటె విలువైనది.

               రులు కోరుకొనునది ఏదియును 

               దానికి సాిరాదు.

16.          విజ్ఞానము కుడిచేత దీర్ఘాయువు ఉండును.

               ఎడమచేత సంపదలు, కీర్తి ఉండును.

17.          అది నీ జీవితమును ఆనందమయము చేయును.

               నీ మనుగడకు సంతృప్తిని ఒసగును.

18.          విజ్ఞానము

               తనను స్వీకరించువారికి జీవనవృక్షమగును.

               దానిని పొందువారు సంతోషముతో

               జీవించుదురు.

19.          ప్రభువు విజ్ఞానముతోనే భూమికి పునాదులెత్తెను

               వివేకముతోనే ఆకాశమును నెలకొల్పెను.

20.        ఆయన జ్ఞానమువల్లనే

               సముద్రములు పొంగుచున్నవి.

               మబ్బులు మంచు కురియించుచున్నవి.

21.          కుమారా! విజ్ఞాన వివేకములు అలవరచుకొనుము

               వానిని ఏనాడును ఆశ్రద్ధ చేయకుము.

22.        అవి నీకు జీవము నొసగును.

               నీ కంఠమునకు అలంకారములగును.

23.         విజ్ఞాన వివేకములతో

               నీవు సురక్షితముగా నడతువు.

               నీ అడుగులెచ్చటను తడబడవు.

24.         నీవు శయనించునపుడు భయపడక  

               నిశ్చింతగా నిద్రపోదువు.

25.        దుర్మార్గులకు వచ్చినట్లుగా,

               ఆకస్మాత్తుగా ఏమి ఉపద్రవములు వచ్చిపడునో

               అని నీవు భయపడవు.

26.        నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక

               ఆయన నిన్ను ఏ బంధములలోను చిక్కుకొననీయడు

27.         నీకు శక్తికలదేని ఇతరులు అడిగిన

               ఉపకారము చేయుటకు వెనుకాడకుము.

28.        పొరుగువానికి సత్వరమే సాయము

               చేయగలవేని చేసిపెట్టుము.

               ”మరల రమ్ము రేపు చేసిపెట్టెదను”

               అని జాప్యము చేయకుము.

29. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు

               నీ తోివానికి అపకారము చేయుకుము.

30.        నీకు ఏ అపకారమును తలపెట్టని

               నరునిమీదికి నిష్కారణముగా

               కయ్యమునకు కాలు దువ్వకుము.

31.          దౌర్జన్యపరుల లాభమునుజూచి అసూయపడకుము

               నీవు వారివలె ప్రవర్తింపబోకుము.

32.        ఎందుకన ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొని,

               సన్మార్గులను తన మిత్రులునుగా చేసికొనును.

33.        ఆయన దుష్టులకుటుంబములను శపించి,

               సత్పురుషుల గృహములను దీవించును.

34.         తనను అపహాసము చేయువారిని

               అపహాసము చేయును.

               వినయవంతులకు మాత్రము

               తన కృపను దయచేయును.

35.        జ్ఞానులకు కీర్తి అబ్బును.

               మూఢులు మాత్రము అవమానమున మునుగుదురు