విశ్వసనీయుడైన ప్రభువు
ఎజ్రెహీయుడైన ఏతాను రచించిన ధ్యానకీర్తన
89 1. ప్రభూ! నేను నీ కృపను
ఎల్లపుడును గానము చేసెదను.
నీ విశ్వసనీయతను
రాబోవు తరములన్నికిని
నోరారా ఉగ్గడించెదను.
2. నీ కృప కలకాలము నిల్చుననియు,
నీ విశ్వసనీయత ఆకాశమువలె
శాశ్వతముగా ఉండిపోవుననియు ప్రకింతును.
3. ”నేను ఎన్నుకొనిన అతనితో
నేను నిబంధనము చేసికొింని.
నా సేవకుడైన దావీదునకు నేను మాటఇచ్చితిని.
4. నీ వంశజులు కలకాలము
పరిపాలనము చేయుదురు.
నేను నీ సింహాసనమును శాశ్వతముగా
నిలుపుదునని నేను అతనితో పలికితిని”
అని నీవు నుడివితివి.
5. ప్రభూ! ఆకాశము
నీ మహాకార్యములను కొనియాడును.
పవిత్రమైన దేవదూతల బృందము
నీ విశ్వసనీయతను స్తుతించును.
6. ఆకాశమున ప్రభువునకు సాియైనవాడు ఎవడు?
దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు?
7. దేవదూతల బృందము
ప్రభువును గాంచి భయపడును.
ఆయన తనచుట్టునున్న వారికెల్లరికి
భయంకరుడుగా కన్పించును.
8. సైన్యములకధిపతియైన యావే!
నీవలె బలాఢ్యుడైనవాడు ఎవడు?
నీవు విశ్వసనీయతనే వస్త్రముగా ధరింతువు.
9. నీవు కడలిపొంగును పాలింతువు.
ఉవ్వెత్తుగా లేచిన
సాగరతరంగములను అణచివేయుదువు.
10. నీవు జలభూతమైన రాహబును
శవమును చీల్చినట్లుగా చీల్చివేసితివి.
మహాపరాక్రమముతో
నీ శత్రువులను చెల్లాచెదరుచేసితివి.
11. భూమ్యాకాశములు నీవే.
లోకమును దానిలోని సమస్త వస్తువులును
నీవే చేసితివి.
12. నీవు ఉత్తరదక్షిణములను సృజించితివి.
తాబోరు హెర్మోను పర్వతములు
సంతసముతో నిన్ను కీర్తించును.
13. నీవు మిక్కిలి పరాక్రమవంతుడవు.
నీ హస్తము బలమైనది. నీ కుడిచేయి ఉన్నతమైనది
14. నీ రాజ్యము
నీతి న్యాయనిర్ణయములమీద నిల్చియుండును.
కృప, విశ్వసనీయత
నీముందట బంటులవలె నడచును.
15. నిన్ను ఆనందగీతముతో స్తుతించు ప్రజలు ధన్యులు
నీ ముఖకాంతియందు వారు నడుచుదురు.
16. నిన్ను తలంచుకొని దినమెల్ల సంతసింతురు.
నీ నీతిని గాంచి హర్షింతురు.
17. వారి కీర్తియు, బలమును నీవే.
నీ అనుగ్రహమువలన
మేము తల ఎత్తుకొని తిరిగెదము.
18. మమ్ము ఆదుకొను రాజు ప్రభువునకు చెందినవాడు
మా యేలిక
పవిత్రుడైన యిస్రాయేలు దేవునికి చెందినవాడు.
19. పూర్వము నీవొక దర్శనమున
నీ భక్తులతో ఇట్లు నుడివితివి.
”నేను ఒక వీరుని ఆదుకొింని.
ప్రజలనుండి నేను ఎన్నుకొనినవానిని
పైకి తీసికొనివచ్చితిని.
20. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని
పవిత్రతైలముతో అభిషేకించితిని.
21. నా బలము ఎల్లవేళల అతనికి తోడుగానుండును.
నా శక్తి అతనిని బలాఢ్యుని చేయును.
22. శత్రువులు అతనిని ఓడింపజాలరు.
దుర్మార్గులు అతనిని బాధింపజాలరు.
23. అతని విరోధులను నేను కూల్చివేసెదను.
అతనిని ద్వేషించువారిని హతము చేసెదను.
24. నా విశ్వసనీయత, స్థిరమైనకృప అతనితో ఉండును
నావలన అతడు విజయములు బడయును.
25. అతని హస్తమును సముద్రముమీద నిలుపుదును
అతని దక్షిణహస్తమును నదులమీద స్థాపింతును.
అతని ఆధిపత్యము చెల్లునట్లు చేయుదును.
26. అతడు నాతో ‘నీవే నాకు తండ్రివి, దేవుడవు,
రక్షణ దుర్గమవు’ అని చెప్పుకొనును.
27. నేను అతనిని నా జ్యేష్ఠ పుత్రుని చేసికొందును.
భూమిమీది రాజులలోనెల్ల
అత్యధికుని గావింతును.
28. నా స్థిరమైన కృపతో అతనిని నిలబెట్టుదును.
నేను అతనితో చేసికొనిన నిబంధనము
శాశ్వతముగా కొనసాగును, దృఢముగానుండును
29. అతని సింహాసనము
ఆకాశమువలె శాశ్వతముగానుండును.
అతని సంతతి ఎల్లకాలము
పరిపాలనము చేయును.
30. అతని అనుయాయులు
నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో,
నా ఆజ్ఞల ప్రకారము జీవింపనిచో,
31. నా కట్టడలను మీరినచో,
నా విధులను పాింపనిచో,
32. నేను వారి తప్పిదములకుగాను
వారిని దండముతో శిక్షింతును.
వారి పాపములకుగాను
వారిని కొరడాలతో దండింతును.
33. కాని నేను దావీదునకు
కృపను చూపుట మాత్రము మానను.
అతనికి చేసిన ప్రమాణమును రద్దుచేయను.
34. అతనితో చేసికొనిన
నిబంధనమును భంగపరుపను.
అతనికి ఇచ్చిన మాటను వమ్ముచేయను.
35. నేను దావీదుతో అబద్ధమాడనని
నా పవిత్రత మీదుగా
శాశ్వతముగా ప్రమాణము చేసితిని.
36. అతని వంశజులు కలకాలము కొనసాగుదురు.
అతని సింహాసనము
సూర్యుడు ఉన్నంతకాలము ఉండును.
37. అది మింటనుండు
నమ్మకమైన సాక్షియగు చంద్రునివలె
శాశ్వతముగానుండును”.
38. అయినను నీవు నీ అభిషిక్తునిపై కోపించితివి.
అతనిని నిరాకరించి విసర్జించితివి.
39. నీవు నీ సేవకునితో చేసికొనిన
నిబంధనమును మీరితివి.
అతని కిరీటమును నేలమీద పడవేసి
అవమానముపాలు చేసితివి.
40. అతని నగరప్రాకారములను పడగ్టొి,
అతని కోటలను పాడుచేసితివి.
41. దారిన పోవువారు
అతని సొత్తు దోచుకొనుచున్నారు.
సాివారు అతనిని చూచి నవ్వుచున్నారు.
42. అతని శత్రువులు
అతనిని ఓడించునట్లు చేసితివి.
వారినెల్ల ప్రమోదభరితులను చేసితివి.
43. అతని ఖడ్గము మొక్కపోవునట్లును,
అతడు పోరున ఓడిపోవునట్లును చేసితివి.
44. అతని రాజదండమును
అతనినుండి తొలగించితివి.
అతని సింహాసనమును నేలమీద కూలద్రోసితివి.
45. కాలము రాకముందే
అతనిని వృద్ధుని గావించితివి.
అతడిని అవమానమున ముంచితివి.
46. ప్రభూ! నీవెంతకాలము నీ దర్శనమును
నిరాకరింతువు? కలకాలమునా?
నీ కోపాగ్ని ఎంతకాలము మండును?
47. నా ఆయుష్కాలమెంత స్వల్పమైనదో
జ్ఞప్తికి తెచ్చుకొనుము.
నీవు నరులందరిని చచ్చుటకే సృజించితివని
గుర్తునకు తెచ్చుకొనుము.
48. చావును తప్పించుకొని
ఎల్లకాలము బ్రతుకగలవాడెవడు?
మృతలోకమును తప్పించుకోగలవాడు ఎవడు?
49. ప్రభూ! పూర్వము నీవు ప్రదర్శించిన కృప
నేడు కన్పింపదేమి?
నీ విశ్వసనీయత మీదుగా
నీవు దావీదునకు చేసిన ప్రమాణములు ఏవి?
50. నీ సేవకుడనైన నాకు కలిగిన
అవమానములను గుర్తింపుము.
ఈ అన్యజాతులవారు
నన్ను గేలిచేయు తీరును పరికింపుము.
51. ప్రభూ! శత్రువులు అభిషిక్తుని
ఎగతాళి చేయుచున్నారు.
అతడు ఎటు వెళ్ళినను గేలిచేయుచున్నారు.
52. ప్రభువునకు సదాస్తుతి కలుగునుగాక!
ఆమెన్, ఆమెన్.