ఐగుప్తు

29 1. అంతట పదియవయేడు పదియవనెల పండ్రెండవదినమున ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! నీవు ఐగుప్తురాజును తెగడుము. అతనికిని అతని దేశమంతికిని దండనము తప్పదని చెప్పుము. 3. యావే ప్రభుడనైన నా పలుకులుగా అతనితో ఇట్లు చెప్పుము:

               ఐగుప్తురాజా! నేను నీకు శత్రువును.

               నీవు పెద్ద మకరమువలె నదిలో పరుండిఉంివి.

               నైలునది నాది, నేనే దానిని చేసితిని

               అని నీవు పలుకుచున్నావు.

4.           నేను నీ దౌడలకు గాలము తగిలింతును.

               నీ నదిలోని చేపలు నీ పొలుసులకు

               అంిపెట్టుకొని ఉండునట్లు చేయుదును.

               నేను నిన్నును, నీకు అంిపెట్టుకొనియున్న మత్స్యములను

               నైలు నదినుండి బయికి లాగుదును.  

5.           నిన్నును నీ మీనములను ఎడారిలో

               పడవేయుదును.

               నీ దేహము భూమిపైన పడును.

               నిన్నెవ్వరును పాతిపెట్టరు.

               వన్యమృగములు పకక్షులు నిన్ను తినివేయును.

6.           అప్పుడు ఐగుప్తు జనులెల్లరును

               నేను ప్రభుడనని గ్రహింతురు.

               యిస్రాయేలీయులు

               ఐగుప్తీయులమీద ఆధారపడిరి

               కాని మీరువారికి రెల్లుకాడవిం వారైతిరి.      

7.            వారు మీమీద ఆనుకొనగా

               మీరు రెల్లువలె విరిగి వారి ప్రక్కలలో

               గుచ్చుకొింరి.

               వారు మీమీద ఆనుకొనగా,

               మీరు విరిగి వారి నడుములకు

               కలక ప్టుించితిరి.

8. కనుక ప్రభుడనైన నేను నీతో ఇట్లు చెప్పుచున్నాను: నేను మీ మీదికి ఖడ్గములను పంపుదును. మీరును, మీ పశువులను ఖడ్గములతో వధింపబడుదురు.

9. ఐగుప్తు ఎడారి అగును. అప్పుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.

మీరు ‘నైలు నది మాది, మేమే దానిని చేసితిమి’ అని వాకొింరి.

10. కావున నేను మీకును, మీ నైలునదికిని శత్రువునగుదును. నేను ఐగుప్తును నాశ నము చేసి ఎడారి కావింతును. ఉత్తరమున మిగ్దోలు నుండి దక్షిణమున సెవెనే వరకును, కూషు సరిహద్దుల వరకును, దానిని మరుభూమిని చేయుదును.

11. ఇక ఆ దేశముగుండ నరులుకాని, జంతువులుకాని నడువవు. నలువది యేండ్లపాటు దానిలో ఎవరును వసింపరు.

12. నేను ఐగుప్తును ప్రపంచములోకెల్ల ఘోరమైన ఎడారిని చేయుదును. దాని నగరములు నలువది యేండ్లపాటు పాడువడి ఉండును. అంతగా పాడువడిన పట్టణములు మరెచ్చటను ఉండవు. నేను ఐగుప్తీయులను శరణార్థులను చేయుదును. వారు ఇతర దేశములలో పరజాతుల మధ్య నివసింతురు.

13. యావే ప్రభువు పలుకులివి: నలువదియేండ్ల తరువాత నేను ఐగుప్తీయులను వారు చెల్లాచెదరైన జాతుల నడుమనుండి మరల తోడ్కొని వత్తును.

14. చెరలోనున్న ఐగుప్తీయులు తిరిగి తమ జన్మభూమియైన పత్రోసునందు వసించునట్లు చేయుదును. అచట వారు దుర్భలమైన రాజ్యమును స్థాపించుకొందురు.

15. ఐగుప్తు అన్నికంటే దుర్బలమైన రాజ్యమగును. అది ఇక మీదట ఇతర జాతులను ఏలజాలదు. నేను దానిని పూర్తిగా తగ్గింతును. కనుక అది ఇతరులను పరిపాలింపజాలదు.

16. యిస్రాయేలీయులు ఐగుప్తు మీద మరల ఆధారపడరు. ఐగుప్తు దుర్గతినిచూచి, దానిని నమ్ముకొనుట తప్పని గ్రహింతురు. అప్పుడు యిస్రాయేలీయులు నేను ప్రభుడనని గుర్తింతురు”.

నెబుకద్నెసరు ఐగుప్తును జయించును

17. అంతట ఇరువదియేడవ ఏడు, మొదినెల మొదిరోజున ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 18. ”నరపుత్రుడా! బబులోనియారాజైన నెబుకద్నెసరు తూరుపై దాడిచేసెను. ఆ ముట్టడివలన అతని సైనికుల తలలుబోడులైనవి. వారి భుజములు చితికి పోయినవి. అంత శ్రమపడినను ఆ దాడిలో అతనికి గాని, అతని సైనికులకుగాని ఎి్ట ప్రతిఫలమును ముట్టలేదు.

19. కనుక ఇప్పుడు యావేప్రభుడనైన నేనిట్లు నుడువుచున్నాను: ”నేను ఐగుప్తును నెబుకద్నెసరు రాజునకిత్తును. అతడు ఐగుప్తును కొల్లగ్టొి దాని సంపదను దోచుకొనిపోవును. ఆ సొత్తు అతని సైనికు లకు జీతమగును.

20. అతడు తూరుపట్టణమున చేసిన శ్రమకుగాను నేను ఐగుప్తును అతని వశము చేయుదును. అతని సైనికులు నా కొరకే కృషిచేసిరి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

21. ఈ కార్యము జరిగినపుడు నేను యిస్రాయేలీ యులను బలపరుతును. యెహెజ్కేలూ! అప్పుడు నీవు పదిమందికి వినిపించునట్లు మాటలాడగలుగుదువు. కావున ప్రజలు నేను ప్రభుడనని గుర్తింతురు.”