గరుడపకక్షులు – ద్రాక్షలత

17 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! యిస్రాయేలీయులకు ఒక పొడుపుకథను సామెతరూపమున చెప్పుము.

3. ప్రభువైన దేవుడు ఇట్లు నుడువుచున్నాడని చెప్పుము:

               ఒక పెద్ద గరుడపక్షి కలదు.

               దానికి సొగసైన రంగురంగుల ఈకలును,

               పొడవైన రెక్కలును కలవు.

4 .అది లెబానోను కొండకెగిరిపోయి

               మెత్తని దేవదారు చిరుకొమ్మను విరిచి,

               కానాను దేశమునకు కొనిపోయి

               వర్తకుల నగరమున దానిని నాటెను.    

5.           అటుపిమ్మట దేశపువిత్తనములు కొనిపోయి

               నీరు సమృద్ధిగా లభించుచోట

               సారవంతమైన నేలలో నాటెను.

6.           అది చిగురించి ద్రాక్షవల్లి అయ్యెను.

               అది ఎత్తు పెరగకయే విశాలముగా రెమ్మలు చాచెను.

               దాని రెమ్మలు ఆ గరుడపక్షివైపుగా అల్లుకొనెను.

               వ్రేళ్ళు నేలలోనికి పారెను.

               అది తీగలతోను రెమ్మలతోను అలరారెను.

7.            మరియొక పెద్ద గరుడపక్షి కలదు.

               దానికి పొడవైన రెక్కలును,

               దట్టమైన ఈకలును గలవు.

               ఆ ద్రాక్షవల్లి నీరు సమృద్ధిగా లభించు

               సారవంతమైన నేలలో నాటబడినది.

               అది అచట రెమ్మలు చాచి, పండ్లు కాచి

               పెద్ద చెట్టుగా ఎదుగవచ్చును.

8.           అయితే అది ఆ తావునుండి ప్రక్కకుతొలగి

               తన వ్రేళ్ళను రెమ్మలను ఈ పక్షివైపునకు మళ్ళించి

               దానినుండి నీళ్ళు పొందగోరెను.

9.           యావే ప్రభుడనైన నా పలుకులుగా నీవిట్లు చెప్పుము

               ”ఆ ద్రాక్షవల్లి పెంపుజెందునా?

               జనులు దానిని వ్రేళ్ళతో పెకలింపరా?

               దానిపండ్లను దులిపివేయరా?

               దాని రెమ్మలను విరిచి వానిని ఎండగొట్టరా?

               ఆ తీగను పెరికి వేయుటకు

               మహాబలముకాని, మహాజాతికాని కావలయునా?

10.         ఆ ద్రాక్షను అచట నాినను అది పెంపుజెందునా?

               తూర్పు గాలిసోకి కమిలిపోదా?

               తానుపెరుగుతావుననే వాడిపోదా?”

11. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 12. ”నీవా తిరుగుబాటుదారులను ఈ సామెత మీకర్థమైనదా? అని అడుగుము. వారితో ఇట్లు చెప్పుము. బబులోనియా రాజు యెరూషలేమునకు వచ్చి అచి రాజును, అధికారులను తనతో బబులోనియాకు కొనిపోయెను.

13. అతడు రాజవంశీయుని ఒకనిని ఎన్నుకొని అతనితో నిబంధనము చేసికొనెను. అతడు విశ్వాస పాత్రుడుగా మెలుగునట్లు ప్రమాణము కూడ చేయించు కొనెను. ఆ దేశములో ప్రముఖులైనవారిని జామీనుగా గూడ గొనిపోయెను.

14. ఆ దేశము మరల తిరుగుబాటు చేయక తనకు లొంగియుండవలెననియు, అది తాను చేసికొనిన ఒడంబడికను నిలబెట్టుకోవలె ననియు అతనికోరిక.

15. కాని యూదారాజు అతనిపై తిరుగుబాటు చేసెను. ఐగుప్తునకు దూతలనంపి అశ్వములను, పెద్ద సైన్యమును పంపుమని అడిగించెను. కాని అతడు విజయము పొందునా? ఇి్ట చెయిద మునకు పాల్పడినవాడు శిక్ష తప్పించుకొనునా? నిబంధనమును మీరినవాడు దండనమునకు గురి కాకుండునా?

16. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నా జీవముతోడు. ఆ రాజు తనను సింహాసనమెక్కించిన బబులోనియా రాజునకు అపకారము చేసెను. తాను అతనికి చేసిన బాసతప్పెను. తాను చేసికొనిన నిబంధన మును మీరెను. కనుక అతడు బబులోనియాలోనే చచ్చును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

17. బబులోనీయులు వచ్చి ముట్టడిదిబ్బలుపోసి, గోతులుత్రవ్వి, బురుజులు క్టి పెక్కు జనులను చంపునపుడు, ఫరోరాజు ఎన్ని మహాసైన్యములను పంపినను అతనిని కాపాడలేడు.

18. అతడు తాను చేసిన బాసను, నిబంధనమును మీరెను. ఇి్ట చెయిదమునకు పాల్పడినవాడు ఇక తప్పించుకోజాలడు.”

19. యావే ప్రభువు పలుకులివి: ”నా జీవము తోడు. అతడు నా పేరు మీదుగా చేసికొనిన నిబంధన మును మీరెను గనుక నేను అతనిని శిక్షింతును.

20. నేను నా వలపన్ని అతనిని పట్టుకొని బబులోనియాకు కొనిపోయి అచట శిక్షింతును. అతడు నాకు ద్రోహము చేసెను.

21. అతని సైనికులలో మెరికల విం వారు పోరున కూలుదురు. మిగిలినవారు నలుదిక్కులకు చెదరిపోవుదురు. అప్పుడు ఈ పలుకులు ప్రభుడనైన నా పలుకులని మీరు గ్రహింతురు.”

మరల మంచిరోజులు వచ్చును

22.        యావే ప్రభువు పలుకిది:

               ”నేను ఎత్తయిన దేవదారుమీది

               మెత్తనికొమ్మను విరిచి ఉన్నతమైన

               పర్వతముపై నాటుదును.

23.         ఎత్తయిన యిస్రాయేలు కొండపై నాటుదును.

               అది కొమ్మలు చాచి, కాయలు కాచి

               గొప్ప దేవదారు వృక్షమగును.

               వివిధ జాతిపకక్షులు దానిపై వసించును.

               దాని కొమ్మలలో ఆశ్రయము బడయును.

24. దేశములోని వృక్షములన్నియు నేను

               ప్రభుడనని గ్రహించును.

               నేను ఎత్తయిన చెట్లను నరుకుదును.

               కురచగానున్న చెట్లను  ఎత్తుగా చేయుదును.

               పచ్చనిచెట్లు ఎండిపోవునట్లును, ఎండినచెట్లు

               పచ్చబడునట్లును చేయుదును.

               నేను చేయుదునన్న కార్యమును చేసితీరుదును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు”.