ఉపోద్ఘాతము:
పేరు: ఈ గ్రంథమునకు హీబ్రూభాషలో ”దిబరే హయ్యామీమ్” అనియు, ఆంగ్లములో ”క్రానికల్స్” అనియు పేరు. దీనికి తెలుగు అనువాదము ”అనుదిన చర్యలు”. ఇవి రాజుల కాలము నాి దినచర్యలు కాబ్టి ”రాజుల దినచర్యల గ్రంథము” అని నామకరణము చేయడము సమంజసమే. కతోలికేతర బైబిలులో ఈ పేరును ”దిన వృత్తాంతములు” గా సూచించారు. ‘వృత్తాంతము’ అను మాటకు, ‘చర్య’ అను మాటకు తేడాలున్నను మూలసందేశము ఒక్కియే.
కాలము: క్రీ.పూ. దాదాపు 4వ శతాబ్దము నాికి క్రోడీకరింపబడినది. క్రీ.పూ. 1000 – 960 మొది గ్రంథము నాి కాలవ్యవధి.
రచయిత: ”దినచర్యల లేఖకుడు” (క్రానికల్స్) అనబడే లేవీయాజకుడు.
చారిత్రక నేపథ్యము : రాజుల దినచర్య రెండు గ్రంథములు, ఎజ్రా గ్రంథము (ఎజ్రా+నెహెమ్యా)తో జత చేయబడి ఏక గ్రంథముగా వుండెడివి. ఈ నాలుగు గ్రంథములు కలసి ఆరాధన, వంశావళుల విషయములో దృఢమైన ఆసక్తిని కనపరచాయి. బబులోను చెరనుండి విడుదల పొంది, యూదా శేషజనులుగా తిరిగివచ్చిన ప్రజలకు, వారి ముందున్న జీవితమును గూర్చి ఆత్మీయదృష్టితో బోధించినదే ఈ గ్రంథము.
ముఖ్యాంశములు: బబులోను వలసానంతరము యూదులు తమ సొంతరాజులు, ఆరాధన దేవాలయము లేనప్పుడు, యోరుషలేము దేవాలయవర్ణన, నూతన దైవార్చనపద్ధతుల వర్ణన, ఆచరణ ద్వారా సమాజమును పునర్వవస్థీకృతము చేయుచూ యిస్రాయేలీయులు తమ ఉనికిని, గుర్తింపును, ఐక్యతను చాటుకున్నారు. అందువల్లెనే ఈ గ్రంథములలో ముఖ్యముగా దావీదు, సొలోమోను, హిజ్కియా, యోషియా మున్నగు రాజులు దేవాలయమును, ఆరాధనను ప్రోత్సహించినవారుగా ప్రస్తావించబడ్డారు. లేవీ యాజకుడైన గ్రంథకర్త, ఆ దేవాలయ ఆరాధనను నడిపించే లేవీ యాజకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ దేవాలయ ఆరాధన ద్వారా దేవుడు తమ మధ్య ఉన్నాడని వారి విశ్వాసము. యిస్రాయేలీయుల తెగలవంశావళుల ప్టికలను తిరిగి ప్రస్తావించడం ద్వారా దేవుని ప్రజలు నిబంధనప్రజగా ఎలావృద్ది చెందారో చూపించడము జరిగింది.
క్రీస్తుకు అన్వయము: దావీదుతో దేవుని నిబంధన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దావీదు రాజవంశావళులు క్రీస్తు మెస్సయ రాకడకు మార్గము సుగమమము చేశాయి.