ప్రభువు బబులోనియాను శిక్షించును

51           1.            ప్రభువిట్లు చెప్పుచున్నాడు:

                              ”నేను బబులోనియా మీదికిని

                              దాని ప్రజల మీదికిని

                              వినాశ ఆత్మను  కొనివత్తును.

2.           పరదేశులను ఆ దేశము మీదికి పంపుదును.

               గాలి పొట్టునువలె వారు దానిని ఎగురగొట్టుదురు.

               ఆ దినము వచ్చినపుడు శత్రువులు

               ఆ దేశమును నలువైపులనుండి

               ముట్టడించి నాశనము చేయుదురు.

3.           ఆ దేశసైనికులకు బాణములు రువ్వుటకుగాని,

               ఆయుధములు ధరించుటకుగాని

               అవకాశము ఈయవలదు.

               అచి యువకులను గూడ వదలిపెట్టకుడు.

               దాని సైన్యమునంతిని నాశనము చేయుడు.

4.           ఆ దేశీయులు గాయపడి

               తమ నగరవీధులలోనే చత్తురు.

5.           యిస్రాయేలీయులును, యూదా ప్రజలును

               పవిత్రుడనైన నాకు ద్రోహముగా పాపము చేసిరి.

               అయినను సైన్యములకధిపతియైన నేను

               వారిని విడనాడలేదు.

6.           మీరు బబులోనియానుండి పారిపొండు.

               మీ ప్రాణములు కాపాడుకొనుడు.

               నేను బబులోనియాను దండించుచుండగా              మీరును ఆ దండనమున చిక్కిచావవలదు.

               ఇపుడు నేనాదేశముపై పగతీర్చుకొందును.

               అది తన దోషములకు తగినశిక్ష అనుభవించును.

7.            బబులోనియా నా చేతిలోని

               బంగారు పాత్రమువింది.

               అది లోకమంతిని తప్పత్రాగించెను. 

               సకలజాతులు దాని ద్రాక్షారసము

               త్రాగి మత్తిల్లినవి.

8.           బబులోనియా దిఢీలున కూలినది, నశించినది.

               మీరు దానికొరకు విలపింపుడు.

               దాని గాయములకు మందుతెండు.

               ఒకవేళ అది మరల కోలుకోవచ్చును.

9.           అచట వసించు పరదేశులు

               మనము ఈ దేశమునకు సాయము చేసితిమిగాని

               ఫలితము దక్కలేదు.

               ఇక దీనిని విడనాడి

               మన దేశమునకు వెళ్ళిపోవుదము.

               ప్రభువు శిక్ష ఆకాశమును అంటుచున్నది.

               అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది.

10. ప్రభువు తన ప్రజలనిట్లు చెప్పుమనెను:

               ”ప్రభువు మన న్యాయమును రుజువుచేసెను.

               మనము యెరూషలేమునకువెళ్ళి మన ప్రభువైన

               దేవుడేమి చేసెనో జనులకు తెలుపుదము”.

11. ప్రభువు బబులోనియాను చెరుపగోరెను

               గనుక మాదీయరాజులను రెచ్చగొట్టెను.

               బబులోనీయులు తన దేవళమును కూల్చిరి

               కనుక ఆయన వారికి ఈ రీతిగా

               ప్రతీకారము చేయును.

               ఆ దేశమును ముట్టడించు సైన్యాధిపతులారా!

               మీ బాణములకు పదును పెట్టుడు.

               మీ డాళ్ళను సిద్ధము చేసికొనుడు.   

12.          బబులోనియా నగర ప్రాకారములను

               ముట్టడించుటకు సంజ్ఞ చేయుడు.

               కావలివారిని బలపరుపుడు,

               గస్తీలను నియమింపుడు.

               మాటుండువారిని సిద్ధముచేయుడు

               అని పలుకుదురు.

               ప్రభువు తాను చెప్పినట్లే

               బబులోనీయులను దండించెను.

13.          ఆ  దేశమున జలము పుష్కలముగా నున్నది.

               దానికి పెక్కు నిధులున్నవి కాని,

               దానికి కాలము అసన్నమైనది.

               దానికి అన్యాయ లాభము ఇక దొరకదు

14.          నేను బబులోనియాను ముట్టడించుటకు

               పలువురిని కొనివత్తును.

               వారు మిడుతలదండువలె చూపట్టుదురు.

               విజయనాదము చేయుదురు.

               అని సైన్యములకు అధిపతియైన ప్రభువు

               తన జీవము తోడని ప్రమాణము చేసెను.

దైవస్తుతి

15.          ప్రభువు తన బలముచేత భూమిని చేసెను.

               తన జ్ఞానముతో లోకమును

               స్థిరముగా పాదుకొల్పెను.

               తన ప్రజ్ఞతో ఆకాశమును విశాలముగా విప్పెను.

16.          ఆయన ఆజ్ఞ ఈయగా ఆకాశము మీది

               జలములు ఘోషించును.

               ఆయన నేల అంచులనుండి

               మబ్బులను కొనివచ్చును.

               జడివానలో మెరుపులు మెరపించును.

               తన గిడ్డంగిలోనుండి గాలులను వదలును.

17.          ఆ దృశ్యమునుగాంచి జనులు విస్తుపోవుదురు. విగ్రహములను మలచువారు సిగ్గుపడుదురు. ఆ ప్రతిమలు నిరర్థకములు, నిర్జీవములు.

18.          అవి నిరుపయోగమైనవి, హాస్యాస్పదమైనవి.

               ప్రభువు వానికి తీర్పుచెప్పుటకు వచ్చినపుడు

               వానిని నాశనము చేయును.

19.          కాని యాకోబు స్వాస్థ్యదేవుడు,

               ఆ ప్రతిమలవిం వాడుకాదు.

               ఆయన సర్వమును చేసినవాడు.

               ఆయన యిస్రాయేలును తన ప్రజగా ఎన్నుకొనెను.

               సైన్యములకు అధిపతియైన ప్రభుడని

               ఆయనకు పేరు.

ప్రభువు సమ్మెట

20. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు:

               బబులోనియా! నీవు నా సమ్మెటవు,

               నా ఆయుధమువు.

               నేను నీ ద్వారా జాతులను,

               రాజ్యములను కూలద్రోసితిని.

21.          గుఱ్ఱములను, రౌతులను, రథములను,       సారథులను పడద్రోసితిని.    

22.        స్త్రీలను, పురుషులను, వృద్ధులను, యువకులను,

               బాలబాలికలను  సంహరించితిని.

23.        కాపరులను, వారి మందలను, రైతులను,

               వారికి దుక్కిదున్ను ఎద్దులను, పాలకులను,

               అధికారులను మట్టుప్టిెతిని.

24.         బబులోనియా దాని ప్రజలు యెరూషలేమునకు

               చేసిన అపకారమునకుగాను

               నేను వారికి ప్రతీకారము చేయుటను

               మీరు కన్నులారా చూతురు.

25.        బబులోనియా! నీవు ప్రపంచమును

               నాశనము చేయు కొండవిందానవు.

               కాని ప్రభుడనైన నేను నీకు శత్రువును. 

               నేను నిన్ను పట్టుకొని నేలమట్టము చేయుదును. నిన్ను బూడిదలో పడద్రోయుదును.

26.        నీ శిథిలములలోని మూలరాళ్ళనుగాని,

               పునాది రాళ్ళనుగానీ

               మరల భవనములు కట్టుటకు వాడరు.

               నీవు సదా ఎడారివయ్యెదవు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

బబులోనియా పతనము

27. బబులోనియాను ముట్టడించుటకు జెండానెత్తుడు.

               జాతులు వినునట్లుగా బాకానూదుడు.

               ఆ నగరముతో పోరాడుటకు

               జాతులను సిద్ధము చేయుడు.

               ఆరారతు, మిన్ని, ఆష్కెనసు రాజ్యములతో

               దాని మీదికి దండెత్తుడని చెప్పుడు.

               ముట్టడిని ప్రారంభించుటకొక

               సేనాపతిని నియమింపుడు.

               గుఱ్ఱములను మిడుతలదండువలె కొనిరండు.

28.        దానిమీద యుద్ధము చేయుటకు

               జాతులను సిద్ధము చేయుడు.

               మాదీయరాజులను, వారి నాయకులను,

               అధికారులను వారి అధీనముననున్న 

               దేశముల సేనలను పిలిపింపుడు.    

29.        ప్రభువు బబులోనియాను శిక్షించుటకు

               పూనుకొనెనుగాన భూమి కంపించుచున్నది.

               ఆయన దానిని నిర్మానుష్యమైన ఎడారిచేయును.

30.        బబులోనియా వీరులు యుద్ధముమాని

               తమకోటలలో దాగుకొనిరి.

               వారు బలమును కోల్పోయి స్త్రీలవలెనైరి.

               శత్రువులు ఆ నగర ద్వారములను పడగ్టొిరి.

               దానిలోని గృహములకు నిప్పింంచిరి.

31.          బంటువెంట బంటు, దూతవెంట దూత

               పరుగెత్తివచ్చి బబులోనియా  రాజుతో

               శత్రువులు నలువైపులనుండి

               నగరమున ప్రవేశించిరని చెప్పిరి.

32.        విరోధులు రేవులను పట్టుకొని

               కోటలను తగులబ్టెిరి.

               బబులోనియా సైన్యము భీతితో కంపించెను.

33.        త్వరలోనే శత్రువులు బబులోనీయులను

               హతముచేసి కళ్ళములోని

               ధాన్యమువలె త్రొక్కివేయుదురు.

               సైన్యములకు అధిపతియైన ప్రభుడను,

               యిస్రాయేలు  దేవుడనైన నా వాక్కిది.”

ప్రభువు ప్రతీకారము

34.         ”బబులోనియా రాజు యెరూషలేమును

               ముక్కలుచేసి భుజించెను.

               అతడు ఆ నగరమును పానీయము త్రాగిన

               పాత్రమువలె ఖాళీ చేసెను.

               మహాసర్పమువలె దానిని మ్రింగివేసెను.

               తనకు కావలసినవానిని తీసికొని

               ఇతర వస్తువులను ఆవల పారవేసెను.

35.        మమ్ము హింసించినందులకుగాను

               బబులోనియాకు శిక్షపడునుగాక” అని

               సియోను ప్రజలు పలుకుదురుగాక!

               ”మమ్ము బాధించినందులకుగాను

               అది దండనము అనుభవించునుగాక”

               అని యెరూషలేము ప్రజలు పలుకుదురుగాక!  

36.        ప్రభువు యోరూషలేము పౌరులతో ఇట్లనెను:

               ”నేను మీ కోపు తీసికొందును.

               మీకు కీడుచేసిన శత్రువులకు

               ప్రతీకారము చేయుదును.

               నేను బబులోనియా జలాధారములు

               వ్టి పోవునట్లును

               దాని నదులు ఎండిపోవునట్లును చేయుదును.

37.         ఆ దేశము పాడువడును.

               అచట వన్యమృగములు తిరుగాడును. 

               అచట నరుడెవడును వసింపడు.

               దానిని గాంచినవారెల్ల భీతి చెందుదురు.  

38.        బబులోనీయులు సింహమువలె గర్జింతురు.

               సింగపుపిల్లవలె బొబ్బరింతురు.

39.        వారు ఆశబోతులా?

               అయినచో నేను వారికి విందు సిద్ధముచేయుదును

               వారు తప్పత్రాగి మైమరుచునట్లు చేయుదును.

               ఆ జనులు నిద్రబోవుదురు, మరల మేల్కొనరు.

40.        నేను వారిని కబేళాకు గొనిపోవుదును.

               వారిని గొఱ్ఱెపిల్లలు, పొట్టేళ్ళు

               మేకపోతులవలె వధింతురు.

బబులోనియామీద శోకగీతము

41.          ప్రభువిట్లనెను:

               లోకమంతయు కొనియాడిన

               నగరము పట్టుబడినది.

               జాతులు దానిని చూచి విస్తుపోవును.

42.         సముద్రము దాని మీదికి పొరలెను.

               గర్జించు తరంగములు దానిని కప్పివేసెను.

43.         దాని చుట్టునున్న నగరములు

               నిర్మానుష్యమయ్యెను.

               ఎండిపోయిన ఎడారులయ్యెను.

               వానిలో ఎవడును వసింపడు.

               అటు ప్రక్కనెవడును పయనింపడు.

విగ్రహములకు శిక్ష

44. నేను బబులోనియా దైవమైన బేలును శిక్షింతును.

               అతడు అపహరించిన వస్తువులను

               తిరిగి తీసికొందును.

               జాతులు ఇక అతనిని పూజింపవు.

               ఆ నగర ప్రాకారములు కూలినవి.

45.         యిస్రాయేలీయులారా!

               మీరు నగరమునుండి పారిపోయి

               నా కోపమునుండి తప్పించుకొనుడు.

               మీ ప్రాణములు దక్కించుకొనుడు.

46.        కాని మీరు దైర్యమును కోల్పోవలదు.

               పుకారులు విని భయపడవలదు.

               దేశమున హింస జరుగుచున్నదనియో,

               ఒకరాజు మరియొక రాజుతో

               పోరాడుచున్నాడనియో, ఏవేవో వదంతులు

               ప్రతియేడు విన్పించుచుండును.

47.         నేను బబులోనియా విగ్రహములకు

               బుద్ధిచెప్పు కాలము వచ్చుచున్నది.

               ఆ దేశమంతయు అవమానమున మునుగును.

               ఆ దేశ ప్రజలెల్లరు చత్తురు.  

48.        బబులోనియా ఉత్తరమునుండి వచ్చిన

               శత్రువులకు చిక్కినపుడు భూమ్యాకాశములందలి

               ప్రాణులెల్ల ఆనందముతో కేకలిడును.

49.        ఆ నగరము లోకమందెల్లెడల

               జనులను చంపెను.

               పెక్కుమంది యిస్రాయేలీయులను సంహరించెను. 

               కావున ఇప్పుడది కూలితీరును

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

50.        ప్రభువు బబులోనియాలోని తన ప్రజలకిట్లు చెప్పెను

               మీరు మృత్యువును తప్పించుకొింరి.

               ఇక ఇచటనుండి వెడలిపొండు. జాగుచేయకుడు.

               ఈ దూరదేశమున మీ ప్రభుడనైన

               నన్ను స్మరించుకొనుడు.

               యోరూషలేమును గూర్చి తలంపుడు.

51.          ‘అన్యజాతులు మా పవిత్రమందిరమును

               ఆక్రమించుకొనినవిగాన మేము

               అవమానమునకు గురియై సిగ్గుచెందితిమి.

               మేము నిస్సహాయులమైతిమి’ అని

               మీరు పలుకుచున్నారు.

52.        నేను మీతో చెప్పునదేమనగా,

               నేను బబులోనియా విగ్రహములను

               దండించుకాలము వచ్చినది.

               ఆ దేశమందంతట క్షతగాత్రులు

               వేదనతో మూల్గుదురు.

53.        బబులోనియా ఆకసమునకెక్కి అచట

               బలిష్ఠమైన దుర్గమును నిర్మించుకొనినను

               నేనచికి కొల్లగొట్టువారిని పంపి

               దానిని నాశనము చేయింతును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

54.         బబులోనియాలో ఏడ్పులు

               విన్పించుచున్నవి వినుడు.

               మృతులకొరకు శోకాలాపములు

               విన్పించుచున్నవి వినుడు.

55.         నేను బబులోనియాను నాశనముచేసి

               దాని నోివెంట మాటరాకుండునట్లు చేయుదును

               సైన్యములు ఘోషించు అలలవలె దానిమీదపడి

               భీకరనాదముతో దానిని ముట్టడించును.

56.        ఆ దండులు బబులోనియాను

               నాశనము చేయుటకు వచ్చెను.

               దాని సైనికులు పట్టుబడిరి, వారి విల్లులు విరిగెను.

               నేను చెడును శిక్షించు దేవుడను.

               బబులోనియాను దానికి తగినట్లుగా దండింతును.

57.         నేను బబులోనియా రాజులను, జ్ఞానులను,

               నాయకులను, సైనికులను మత్తులను గావింతును.

               వారు శాశ్వతనిద్ర నిద్రింతురు,

               మరల మేల్కొనరు. ఇది రాజునైన నా వాక్కు.

               నేను సైన్యములకు అధిపతియైన ప్రభువును.

58.        విశాలములైన బబులోనియా

               ప్రాకారములు నేలమట్టమగును.

               ఉన్నతములైన

               దాని ద్వారములను కూల్చివేయుదురు.

               జాతుల కృషియంతయు వ్యర్థమగును.

               వారి శ్రమ అగ్గిపాలగును.”

యిర్మీయా సందేశమును

యూఫ్రీసు నదిలో పడవేయుట

59. సిద్కియారాజు ఆంతరంగిక కార్యదర్శి సెరాయా. అతడు నేరీయా కుమారుడు, మహాసేయా మనుమడు. సిద్కియా యూదాను పరిపాలించిన కాలము నాలుగవయేట సెరాయాకూడ ఆ రాజుతో పాటు బబులోనియాకు వెడలిపోవుచుండగా, నేనతని ద్వారా కొన్ని సందేశములు పంపితిని, 60. నేను బబులోనియాకు సంభవింపబోవు వినాశములన్నిని, ఆ దేశమునుగూర్చిన ఈ ఇతర అంశములను ఒక పొత్తమున వ్రాసితిని.

61. సెరాయాతో ఇట్లు చెప్పితిని: ”నీవు బబులోనియాకు వెళ్ళినపుడు ఈ పుస్తకమున వ్రాసిన సంగతులన్నింని అచి ప్రజలకు పెద్దగా చదివి వినిపింపుము.

62. అటు తరువాత ‘ప్రభూ! నీవు ఈ తావును నాశనము చేయుదునని పలికితివి కదా! ఈ దేశమున నరుడుకాని, జంతువు కాని ప్రాణములతో బ్రతకదని నుడివితివికదా! ఈ రాజ్యము కలకాలము వరకును ఎడారి అగునని చెప్పితివి కదా!’ అని ప్రకింపుము.

63. నీవు ఆ గ్రంథమును చదివిన తరువాత దానికి ఒక రాతిని క్టి యూఫ్రీసు నదిలోనికి విసిరివేయుము.

64. అప్పుడిట్లు చెప్పుము. ‘బబులోనియాకు ఇి్ట గతియే పట్టును. అది మునుగును, మరల పైకిలేవదు. ప్రభువు దానిమీదికి వినాశనమును గొనివచ్చును.’ ” యిర్మీయా వాక్యములు ఇంతితో ముగిసినవి.