నిబంధనమందసము, లేవీ యాజకత్వము

10 1. ప్రభువు నాతో ”నీవు మొదిసారివలె మరల రెండురాతిపలకలు చెక్కుకొని కొండయెక్కి నా వద్దకురమ్ము. ఆ పలకలు ఉంచుటకు ఒక కొయ్య పెట్టెను తయారు చేయుము.

2. నీవు పగులగ్టొిన ఆ మొది పలకలమీద వ్రాసిన మాటలు నేను మరల వీనిమీద వ్రాయుదును. నీవు వీనిని కొయ్యపెట్టెలో  పెట్టవలెను” అని చెప్పెను.

3. కనుక నేను తుమ్మ కొయ్యతో మందసమును చేసితిని. మునుపివలె రెండు రాతిపలకలను చెక్కుకొని కొండమీదికి తీసికొనిపోతిని.

4. పూర్వరీతిగనే ప్రభువు ఆ పలకలమీద పది ఆజ్ఞలను వ్రాసెను. మీరు కొండచెంత సమావేశ మైనప్పుడు ఆయన పర్వతము మీద మంట నడుమ నుండి మీకు ఆదేశించిన ఆజ్ఞలు ఇవియే. అంతట ప్రభువు ఆ పలకలను నాకొసగెను.

5. అటు పిమ్మట నేను కొండ దిగివచ్చి యావే ఆజ్ఞాపించినట్లే ఆ రాతి పలకలను చెక్కపెట్టెలో పదిల పరచితిని. నేివరకును అవి దానియందే ఉన్నవి.

6. అటు తరువాత యిస్రాయేలీయులు యాకాను ప్రజలదైన బేరోతునుండి మోసేరా చేరిరి. అచట అహరోను చనిపోగా పాతిప్టిెరి. అహరోను కుమారుడు ఎలియెజెరు తండ్రికి బదులుగా యాజకుడయ్యెను. 7. అచినుండి వారు గూద్గోదా చేరుకొనిరి. ఆ తావు నుండి నీివనరులు గల యోత్బాతానునకు వెళ్ళిరి.

8. ఆ సమయమున నిబంధనమందసమును మోయుట కును, యాజకులుగా సేవచేయుటకును, దేవునిపేర ప్రజలను దీవించుటకును ప్రభువు లేవీతెగవారిని నియమించెను. నేికీ వారు ఈ కార్యములు చేయు చునేయున్నారు.

9. ఈ కారణమున ఇతర తెగలకు వలె లేవీతెగకు భూమి లభింపదయ్యెను. మీ ప్రభువైన దేవుడు సెలవిచ్చినట్లే, యాజకులై యావేకు పరిచర్య చేయుటయే వారిఆస్తి.

10. ఆ రీతిగా నేను మొదిసారివలె మరల నలుబదిపగళ్ళు, నలుబదిరాత్రులు కొండమీద గడపితిని. ప్రభువు రెండవసారికూడ నా మొర ఆలకించి మిమ్ము నాశనము చేయడయ్యెను.

11. ఆ మీదట ఆయన నన్ను మిమ్మును నడిపించుకొని పొమ్మని చెప్పెను. మనము వెళ్ళి తాను పితరులకు వాగ్ధానము చేసిన నేలను స్వాధీనము చేసికోవలెనని ఆదేశించెను.

హృదయశుద్ధి

12. కనుక యిస్రాయేలీయులారా! ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకొనునదేమి? ఆ ప్రభువునెడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞలనెల్ల పాించు టయు, పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను ఆయనను ప్రేమించిసేవించుటయు, 13. మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభువు ఆజ్ఞలను విధులనెల్ల పాించుటయు- అంతియేగదా!

14. ఆకాశమహాకాశములు ఆ ప్రభునవి. ఈ భూమియు, దీనిమీదగల సమస్తవస్తువులును ఆయనవి.

15. అి్టవాడు కూడ మీ పితరులను గాఢముగా ప్రేమించెను. వారి తరువాత సకల ప్రజలను కాదని వారిసంతతియైన మిమ్మే ఎన్నుకొనెను. నేివరకును మీరు ఆయనప్రజలై ఉన్నారు.

16. కావున మీరు హృదయశుద్ధినిపొంది మీ తలబిరుసుతనమును విడ నాడుడు.

17. యావే దేవాదిదేవుడు, ప్రభువులకెల్ల ప్రభువు. ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. ఆయన పక్షపాతముచూపడు, లంచముపుచ్చుకొనడు.

18. ఆ దయామయుడు అనాథశిశువులకు, విధవలకు న్యాయము జరిగించును. పరదేశులను ఆదరించి వారికి అన్నవస్త్రములను దయచేయువాడు.

19. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు. మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంిరి గదా!

20. మీరు యావేపట్ల భయభక్తులతో మెల గుడు. ఆయనను సేవింపుడు. ఆయనను నమ్ముడు. ఆయన పేరిటనే బాసచేయుడు.

21. ఆ ప్రభువునే మీరు కీర్తింపవలయును, ఆయనే మీ దేవుడు. మీరు కన్నులార చూచిన ఈ మహత్తరములైన అద్భుత కార్యములనెల్ల కావించినవాడు ఆయనయే.

22. మీ పితరులు ఐగుప్తునకు వెళ్ళినపుడు కేవలము డెబ్బది మంది మాత్రమే. కాని నేడు ఆయన మిమ్ము ఆకాశ నక్షత్రములవలె విస్తరిల్లజేసెను.

Previous                                                                                                                                                                                                      Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము