సమూవేలు – సౌలు

1. రాజనియామకము5

8 1. సమూవేలుకు పెద్దప్రాయము వచ్చెను. అందుచే అతడు తన ఇద్దరు కుమారులను యిస్రాయేలీ యులకు తీర్పరులను చేసెను.

2. వారిలో పెద్దవాని పేరు యోవేలు, చిన్నవాని పేరు అబీయా. వారిద్దరు బేర్షెబాలో న్యాయాధిపతులైరి.

3. కాని ఈ కుమారు లకు తండ్రి గుణములు అబ్బలేదు. వారు కాసులకు దాసులై లంచములు పుచ్చుకొని ధర్మమును చెరచిరి.

4. అందుచే యిస్రాయేలు వృద్ధులందరు ప్రోగై సమూవేలును కలిసికొనుటకు రామాకు వచ్చిరి.

5. అతనితో ”అయ్యా! నీవా, ప్రాయము చెల్లినవాడవు. నీ కుమారులందుమా, నీ అడుగుజాడలలో నడుచు వారుకారు. ఇక మాకు న్యాయము తీర్చువారులేరు. కనుక అన్యజాతులకువలె మాకును ఒక రాజును నియ మింపుము” అని విన్నవించుకొనిరి.

6. న్యాయము తీర్చుటకు రాజును నియమింపుమనిన పెద్దల వేడు కోలు సమూవేలునకు నచ్చలేదు. కనుక అతడు ప్రభువును ప్రార్థించెను.

7. యావే అతనితో ”ఈ ప్రజలమాట వినుము. వారు నిన్ను నిరాకరించలేదు, వారిని యేలకుండ నన్నే నిరాకరించుచుండిరి.

8. ఐగుప్తునుండి వీరిని విడిపించుకొని వచ్చిన నాినుండి ఈ జనులు నాక్టిె అపచారము చేయుచుండిరో నేడు నీకును అి్ట అపచారమే చేసిరి. ఈ ప్రజలు నన్ను విడచి వేరు దేవరలను కొలిచిరి.

9. నీవు ఇపుడు మాత్రము వారి మాటలను వినుము. అయినను వారిని గ్టిగా హెచ్చరించి చూడుము. రాజును నియమించినచో అతడు ఏ తీరున పరిపాలనము చేయునో ధృడముగా తెలియజెప్పుము” అనెను.

రాజును నియమించుట వలన కలుగు అనర్థకములు

10. ప్రభువు తనతో పలికిన పలుకులన్నియు రాజు కావలెనని అడుగుచున్న ప్రజలకు సమూవేలు తెలియబలికెను. 11. ”మీరు కోరుకొనిన రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు. అతడు మీ కుమారు లను తీసికొని వెళ్ళి తన రథములను తోలుటకు, గుఱ్ఱములను కాపాడుటకు వినియోగించుకొనును. వారతని రథములముందు పరుగెత్తువారినిగా చేయును.

12. తన సైన్యములలో వేయిమందికో, ఏబదిమందికో వారిని అధిపతులుగా నియమించును. వారిచే తన పొలములు దున్నించి కోతకోయించుకొనును. యుద్ధ ములకును, రథములకును వలసిన పనిముట్లను చేయించుకొనును.

13. మీ కుమార్తెలను తీసికొని వెళ్ళి అత్తరులు పూయుటకును, వంటలు వండుటకును, రొట్టెలు కాల్చుటకును వాడుకొనును.

14. మీ పొలములో సారముగల చేలను, మీ ద్రాక్షతోటలను, ఓలివుతోపులను గైకొని తన ఉద్యోగులకు ఇచ్చివేయును.

15. మీరు పండించిన పంటలో, కాయించిన ద్రాక్ష పండ్లలో పదియవవంతు తీసికొని తన నౌకరులకు ఇచ్చివేయును.

16. మీ బానిసలను, మీ గాడిదలలో పశులలో తానెన్నుకొన్నవానిని తీసికొని సొంతపనులు చేయించుకొనును. 17. మీ మందలలో పదియవ భాగము పుచ్చుకొనును. ఇక మీరందరు అతని బానిసల గుదురు.

18. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచు కొని ఒకనాడు పెద్దపెట్టున ఏడ్తురు. ఆనాడు ప్రభువు మీ మొర విన్పించుకోడు” అని చెప్పెను.

19. అయినను ప్రజలు సమూవేలు మాట పెడచెవిని ప్టిె మాకు రాజును నియమించి తీరవలయు నని పట్టుబ్టిరి. 20. ”ఇతర జాతులవలె మాకును రాజు కావలయును. మా రాజు మాకు న్యాయము చెప్పవలెను. మా యుద్ధములలో ముందు నడచి శత్రువులతో పోరాడవలయును” అని పలికిరి.

21. సమూవేలు ఈ మాటలన్నిని విన్నవానిని వినినట్లు యావేకు నివేదించెను.

22. ”వారి యిచ్చ వచ్చినట్లే రాజును నియమింపుము” అని ప్రభువు సమూవేలు నకు సెలవిచ్చెను. అంతట సమూవేలు ”మీమీ పట్టణ ములకు తిరిగిపొండు” అని ఆనతిచ్చి ప్రజలను సాగనంపెను.

Previous                                                                                                                                                                                                    Next