యూదా విగ్రహారాధనము, శిక్ష

17 1. ప్రభువు ఇట్లనుచున్నాడు: ”యూదా ప్రజల పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది. ఆ పాపము వారి హృదయఫలకముపై వజ్రపుమొనతో వ్రాయబడియున్నది. వారి బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడియున్నది.

2-3. యూదా ప్రజలు పరదైవముల పీఠములను మననము చేసుకొను చున్నారు. పచ్చనిచెట్ల క్రిందను తిప్పలమీదను, పొల ములోని కొండలమీదను, అషేరా దేవతకు పాతిన కొయ్యగడెలచెంత పూజలు చేయుచున్నారు. నేను మీ పాపములకు శిక్షగా శత్రువులు మీ సొత్తును, నిధులను కొల్ల గొట్టుకొని పోవునట్లు చేయుదును.

4. నేను మీకొసగిన నేలను మీరు విడనాడకతప్పదు. మీరు మీకు తెలియని దేశమున మీ శత్రువులకు ఊడిగము చేయవలసివచ్చును. నా కోపము నిప్పువలె రగుల్కొని, ఆరకమండును”.

విజ్ఞాన వాక్యములు

5.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”నన్ను విడనాడి నరుని నమ్మువాడు,

               నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు.

6.           అతడు ఎడారిలో ఎదుగు తుప్పవింవాడు.

               అతనికి ఎి్ట మేలును కలుగదు.

               ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో,

               ఏమియు పెరుగని చౌిపఱ్ఱలో ఎదుగును.

7.            కాని ప్రభువును నమ్మి

               నాపై ఆధారపడువానిని నేను దీవింతును.

8.           అతడు ఏిఒడ్డున నాటబడిన చెట్టువలెనుండును.

               అది ఎదుగుచు నీిచెంతకు వ్రేళ్ళు జొన్పించును.

               అది బెట్టకు భయపడదు,

               దాని ఆకులు పచ్చగానుండును,

               వానలు కురువకున్నను దానికి చింతలేదు,

               అది ఎల్లపుడు పండ్లు కాయుచుండును.”

9.           హృదయము అన్నింకంటెను మోసకరమైనది. దాని రోగము కుదర్చలేము.

               దానినెవడు అర్థము చేసికోగలడు?

10.         నరుని ప్రవర్తనబ్టి వాని క్రియలఫలము చొప్పున

               ప్రసాదించుటకు ప్రభుడనైన నేను

               హృదయమును పరిశీలించువాడను,

               అంతరింద్రియములను పరీక్షించువాడను.

11.           అన్యాయముగా ధనమును ఆర్జించువాడు

               తాను పెట్టనిగ్రుడ్లను పొదుగు

               కౌజుపిట్ట వింవాడు.

               అతడు సగప్రాయముననే

               తన సంపదను విడువవలసి వచ్చును.

               కడన వాడు మందమతిగా గణింపబడును.

దేవాలయముమీద నమ్మకము

12.          అనాదినుండి ఉన్నతమైన పర్వతముపై

               నిలిచియున్న మహిమాన్వితమైన

               సింహాసనమువింది మన దేవాలయము.

13.          ప్రభూ! యిస్రాయేలు ఆశ నీవే.

               నిన్ను విడనాడువారు అవమానము చెందుదురు.

               వారు జీవజలములబుగ్గవైన

               నిన్ను పరిత్యజించిరి గాన

               ధూళిమీద వ్రాసిన పేర్లవలె

               అదృశ్యులగుదురు.

శత్రువులను శిక్షింపుమని దేవునికి ప్రార్థన

14.          ప్రభూ! నీవు నాకు చికిత్సచేసినచో

               నేను సంపూర్ణారోగ్యమును బడయుదును.

               నీవు నన్ను రక్షించినచో

               నేను సంపూర్ణరక్షణ పొందుదును.

               నీవే కారణభూతుడవు కాగా

               నేను నిన్నే స్తుతింతును.

15.          ప్రజలు నాతో ”ప్రభువు వాక్కులు ఏమైనవి?

               అది మనమీదికి రానిమ్ము చూతము”

               అనుచున్నారు.

16.          కాని ప్రభూ! నీవు వారికి చెడుచేయవలెనని

               నేను నిన్నెన్నడును ఒత్తిడిచేయలేదు.

               నేను వారికి కీడు కలుగవలెనని కోరుకోలేదు.

               ఈ సంగతి నీకు తెలియును.

               నా పలుకులను నీవు ఎరుగుదువు.

17.          ఆపదలో నీవు నాకు ఆశ్రయణీయుడవు.

               నీవు నాకు భయంకరుడవు కావలదు.       

18.          నేను గాదు, నన్ను హింసించువారే

               అవమానము చెందుదురుగాక!

               నేనుగాదు, వారే భయకంపితులు అగుదురుగాక!

               నీవు వారిని నాశనము చేయుము,

               సర్వనాశనము చేయుము.

విశ్రాంతిదినమును పాింపవలెను

19. ప్రభువు నాతో ఇట్లనెను: ఓయి! నీవు యూదా రాజులు వచ్చుచు పోవుచుండు ప్రజా ద్వారము వద్దకుపోయి అచట నా సందేశము విని పింపుము. అటుపిమ్మట యెరూషలేము ద్వారము లన్ని చెంతకునుపొమ్ము.

20. యూదారాజులును, ప్రజలును, ఆ ద్వారములలో ప్రవేశించు యెరూషలేము పౌరులును నా మాటలను ఆలింపవలెనని చెప్పుము.

21. నీవు వారికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము. మీకు ప్రాణములమీద తీపికలదేని విశ్రాంతిదినమున బరువులు మోయకుడు. యెరూషలేము ద్వారముల గుండ వేనిని మోసికొనిరావలదు.

22. విశ్రాంతి దినమున మీ ఇండ్లనుండి ఎి్టబరువులను మోసికొని రావలదు. మీరు ఆ దినమున ఎి్ట పనియు చేయ రాదు. నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లే, మీరు దానిని పవిత్రదినముగా ఎంచవలెను.

23. మీ పిత రులు నా పలుకులు ఆలింపలేదు, లక్ష్యము చేయలేదు. పైగా వారు మొండివారై నాకు లొంగరైరి. నా ఉపదేశ మును అంగీకరింపరైరి.

24. కాని మీరు నా మాటలను జాగ్రత్తగా వినుడు. మీరు విశ్రాంతిదినమున ఈ నగరద్వార ములగుండ ఎి్ట బరువులను మోసికొని రాకూడదు. మీరు ఆ రోజును పవిత్రదినముగా గణింపుడు. ఆ రోజు ఎి్టపనులను చేయకుడు.

25. అప్పుడు దావీదు సింహాసనముపై కూర్చుండు రాజులు, రాజకుమారులు ఈ ద్వారములగుండ లోనికి ప్రవేశింపగలుగుదురు. వారుతమ అధికారులతోను, యూదాప్రజలతోను, యెరూషలేము పౌరులతోను కలిసి రథములపైనను, గుఱ్ఱములపైనను ఎక్కి రావచ్చును. యెరూషలేము కూడ నిత్యము ప్రజలతో క్రిక్కిరిసియుండును.

26. ప్రజలు యూదా నగరములనుండియు, యెరూషలేము పరిసర ప్రాంతములనుండియు, బెన్యామీను మండ లమునుండియు, కొండపాదులనుండియు, పర్వత సీమలనుండియు, దక్షిణ యూదానుండియు వత్తురు. అటులవచ్చి వారు నా దేవళమున దహనబలులను, సమాధానబలులను, ధాన్యబలులను, కృతజ్ఞతా బలులను అర్పింతురు. సాంబ్రాణిపొగ వేయుదురు. 

27. కాని మీరు నేను ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును పవిత్రదినముగా గణింపరేని, యెరూషలేము వీధులగుండ బరువులు మోయుటమానరేని, నేను ఆ నగరద్వారములకు నిప్పింంతును. నగరములోని ప్రాసాదములు మంటలలో బుగ్గియగును. ఆ మంట లను ఎవరును ఆర్పలేరు.