రానున్న మెస్సియా

23 1. ”ప్రభువు ప్రజలను చెల్లాచెదరుచేసి, నాశ నము చేయు రాజులు శాపగ్రస్తులు.” 2. యిస్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులనుగూర్చి ఇట్లు చెప్పుచున్నాడు: ”మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదరుచేసి ఆవలకు వెళ్ళగ్టొితిరి. కనుక మీ దుష్కార్యములకుగాను నేను మిమ్ము శిక్షింతును.

3. నా ప్రజలలో మిగిలియున్నవారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశములనుండి మరల ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలనుకని అధిక సంఖ్యాకులగుదురు. 4. నేను వారిని సంరక్షించుటకు గాను రాజులను నియమింతును. వారికిక వెరపును, భీతియునుండవు. వారిలో ఎవడును నాశనము కాడు. ఇది ప్రభుడనైన నా పలుకు.

5.           ”ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నేను దావీదు వంశమునుండి నీతిగల1 రాజును

               ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి.

               రాజు విజ్ఞానముతో పరిపాలించును.

               దేశమందంతట నీతిన్యాయములు నెలకొల్పును.

6.           అతని పరిపాలనాకాలమున

               యూదా భద్రముగా జీవించును.

               యిస్రాయేలీయులు శాంతితో మనుదురు.

               ‘ప్రభువు మనకు రక్షణము’ అని

               అతనికి పేరిడుదురు.

7. ప్రభువిట్లనుచున్నాడు: క్రొత్తకాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు, ‘యిస్రాయేలును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము’ అని చెప్పరు.       

8. ప్రజలు, ‘యిస్రాయేలీయులును ఉత్తరదేశము నుండియు వారు చెల్లాచెదరైన అన్యదేశముల నుండియు తోడ్కొనివచ్చిన సజీవుడైన ప్రభువుపేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము’ అని పలుకుదురు. వారు తమ నేలమీదనే జీవింతురు.”

కపట ప్రవక్తల గూర్చి

9.           నా హృదయము వేదనచెందుచున్నది.

               నేను గడగడ వణకుచున్నాను.

               ప్రభువును, ఆయన పవిత్రనామమును

               తలంచుకొని త్రాగి

               మత్తెక్కినవానివలె తూలుచున్నాను.

10. దేశము వ్యభిచారులతో నిండిపోయినది.

               వారు దుష్టజీవితము గడిపిరి.

               తమ అధికారమును దుర్వినియోగము చేసిరి.

               ప్రభువు శాపమువలన

               దేశము విలపించుచున్నది.

               గడ్డిబీళ్ళు ఎండిపోయినవి.

11.           ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”ప్రవక్తలును, యాజకులును భక్తిహీనులైరి.

               వారు నా దేశముననే దుష్కార్యములు

               చేయుచుండగా నేను చూచితిని.

12.          వారిత్రోవ చీకితో నిండియుండును.

               వారు దానిలో జారిపడుదురు.

               నేను, వారిని కాలుజారి పడిపోవునట్లు చేయుదును

               వారికి శిక్షాకాలము సమీపించుచున్నది.

               నేను వారిని నాశనము చేయబోవుచున్నాను.

               ఇది ప్రభుడనైన నా పలుకు.

13.          నేను సమరియా ప్రవక్తల పాపము చూచితిని.

               వారు బాలు పేరు మీద ప్రవచనములు పలికి,

               నా ప్రజలను పెడత్రోవ ప్టించిరి.

14.          కాని యెరూషలేము ప్రవక్తలు ఇంతకంటెను

               ఘోరకార్యములు చేయగా చూచితిని.

               వారు వ్యభిచారముచేసి అనృతములు పలికిరి.

               ప్రజలు దుష్కార్యములు చేయుటకు సాయపడిరి.

               కావున ఎల్లరును చెడ్డపనులే చేయుచున్నారు. నామట్టుకు నాకు వారెల్లరును సొదొమ గొమొఱ్ఱా

               ప్రజలవలె కనిపించుచున్నారు.”

15.          కనుక సైన్యములకు అధిపతియు,

               ప్రభుడనైన నేను యెరూషలేము ప్రవక్తలను గూర్చి

               ఇట్లు చెప్పుచున్నాను:

               ”వారివలన దేశమున అవిశ్వాసము వ్యాపించెను

               గాన నేను వారిచే చేదుకూరలు తినిపింతును,

               విషజలములు త్రాగింతును.”

16.          సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”మీరు ఈ ప్రవక్తల పలుకులు ఆలింపవలదు.

               వారు మిమ్ము మభ్యపెట్టుచున్నారు.

               వారు మీతో చెప్పు సంగతులు

               తమకు తాము కల్పించుకొనిన దృశ్యములే కాని,

               నా నోినుండి వచ్చిన పలుకులు కావు.

17.          నా పలుకులు ఆలింపనొల్లని జనులతో

               వారు ‘మీకు క్షేమము కలుగును’

               అని చెప్పుచున్నారు.

               మూర్ఖపు హృదయముగల ప్రజలతో

               ‘మీకు ఎి్ట కీడును వాిల్లదు’

               అని పలుకుచున్నారు.”

18.          నేను ఇట్లనుకొింని: ఈ ప్రవక్తలలో

               ప్రభువు  వాక్కులు ఆలించి,

               అర్థము చేసికొనునట్లు

               ఆయన సభలో నిలుచువాడెవడు?

               ఆయన పలుకులు గ్రహించి

               వాిని లక్ష్యము చేసినవాడెవడు?

19.          ప్రభువు కోపము తుఫానువింది.

               అది దుర్మార్గులపై ప్రభంజనమువలె వీచును.

20.        ప్రభువు తన సంకల్పమును నెరవేర్చువరకును

               ఆయన ఆగ్రహము చల్లారదు.

               రానున్న కాలమున ఆయన ప్రజలు

               ఈ సంగతిని బాగుగా అర్థము చేసికొందురు.

21. ప్రభువు ఇట్లనెను:

               నేను పంపకున్నను ఆ ప్రవక్తలు పరుగెత్తిపోయిరి.

               నేను వారికి సందేశము విన్పింపకున్నను

               వారు ప్రవచనములు చెప్పిరి.

22.        వారు నా సభలో నిలచి ఉండినయెడల

               నా ప్రజలకు నా సందేశమును

               తెలియజేసియుందురు.

               వారిని తమ దుష్టమార్గమునుండి

               మరల్చియుందురు.

               తమ దుష్టకార్యములనుండి

               వైదొలగించి ఉందురు.

23.        నేను దగ్గరలో ఉన్నపుడు మాత్రమే దేవుడనై,

               దూరముననున్నపుడు దేవుడను కాకుందునా?

24.         ఎవడైన నా కంటపడకుండ

               రహస్యముగా దాగుకోగలడా?

               నేను భూమ్యాకాశములందంతట ఉండువాడను.

25. నా పేరు మీదుగా కల్ల ప్రవచనములు పలుకు ఆ ప్రవక్తలేమి చెప్పుచున్నారో నేనువింని. నేను వారికి కలలో నా సందేశమును వినిపించితినని వారు పలికిరి.

26. ఈ ప్రవక్తలు తాము సృజించుకొన్న అబద్ద సందేశములతో నా ప్రజలను ఇంకను ఎన్నాళ్ళు అపమార్గము ప్టింతురు?

27. వారు తాము చెప్పు స్వప్నవృత్తాంతముల ద్వారా నా ప్రజలు నన్ను విస్మరింతురని భావించుచున్నారు. పూర్వము తమ పితరులు బాలును కొలిచి,  నన్ను మరచిపోయినట్లే జరుగునని తలంచుచున్నారు.

28. కలగన్న ప్రవక్తను తన కలను వివరింపనిండు. కాని నా నుండి సందేశ మును వినిన ప్రవక్త దానిని యథార్థముగా ప్రకింప వలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము?

29. నా వాక్కు నిప్పువలె దహింపదా? సమ్మెటవలె రాళ్ళను బ్రద్దలుచేయదా?

30. ఒకరి మాటలను ఒకరు తస్కరించి, వానిని దైవసందేశమువలె ప్రకటన చేయు ప్రవక్తలనిన నాకుగిట్టదు.

31. తమ సొంత మాటలనే ‘ఇది ప్రభువు వాక్కు’ అని ప్రకటన చేయు ప్రవక్తలనిన నాకుగిట్టదు.

32. కల్లలతో గూడిన కలలను ప్రవచనములుగా చెప్పు ప్రవక్తలనిన నాకు గిట్టదు. వారు ఈ కలలను ప్రకటనముచేసి తమ అబద్ధములతోను, ప్రగల్భములతోను నా ప్రజలను అపమార్గము ప్టించుచున్నారు. నేను వారిని పంపలేదు. పొండని వారికి ఆజ్ఞ ఈయలేదు. వారి వలన నా ప్రజలక్టిె లాభమును కలుగలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

33. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: ప్రజలుకాని, ప్రవక్తకాని, యాజకుడుకాని ప్రభువు భారము (సందేశము) ఏమిటని నిన్ను అడిగినచో నీవు వారితో ”మీరే ఆయనకు భారమైతిరి. ఆయన మిమ్మెత్తి ఆవల పారవేయును” అని చెప్పుము.

34. ప్రజలలో ఎవడైనాకాని, ప్రవక్తకాని, యాజకుడుకాని ‘ప్రభువు భారము’ అన్న పదమును వాడెనేని నేను అతడిని, అతడి కుటుంబమును కూడ దండింతును.

35. ప్రతివాడును తన మిత్రులను కాని, బంధువులను కాని ‘ప్రభువేమి జవాబు చెప్పెను? ఆయనేమి పలికెను?’ అని మాత్రమే అడుగవలెను.

36. అంతే కాని ఎవడును ”ప్రభువు భారము” అన్న పదములను వాడరాదు. ఎవడైన వాడెనేని వానికి నా సందేశము భారమై తీరును. ప్రజలు సజీవుడును సైన్యములకు అధిపతియును తమ దేవుడునైన ప్రభువు మాటలకు అపార్థము కల్పించిరి.

37. ‘ప్రభువు ఏమి జవాబు చెప్పెను? ఆయనేమి పలికెను?’ అని మాత్రమే జనులు ప్రవక్తలను అడుగవలెను. 38. ప్రజలు నా ఆజ్ఞ  మీరి ”ప్రభువు భారము” అను మాటలను వాడరాదు. వాడుదురేని, 39. నేను వారిని పైకెత్తి దూరముగా విసరివేయుదును. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన నగరమును గూడ ఈ రీతిగనే విసరి పార వేయుదును.

40. వారికి శాశ్వతమైన అవమాన మును, అపకీర్తిని కలిగింతును. జనులు వానినెన్నికిని మరచిపోరు.”