ముఖ్య నగరములు
ఆశ్రయపట్టణములు
20 1-2. ఆ తదుపరి యావే యెహోషువతో ”నీవు యిస్రాయేలీయులతో ఆశ్రయపట్టణములను ఎన్నుకొనుమని చెప్పుము. నేను ముందుగనే ఈ సంగతి మోషే ద్వారా తెలియజేసితిని.
3. తెలియకయే పొరపాటున ఎవరినైన చంపినచో, వారు ఈ పట్టణ ములలో తలదాచుకోవచ్చును. పగతీర్చుకోగోరిన వారినుండి ఈ నగరములు రక్షణ కల్పించును.
4. ఇతరులను చంపినవాడు ఈ పట్టణములలో శరణు పొందవచ్చును. అతడు మొదట నగరద్వారమువద్ద నిలిచి పెద్దలకు తన సంగతి తెలుపవలెను. వారతనిని నగరమునకు తోడ్కొనిపోయి, ఉండుటకు వసతి నీయవలెను.
5. పగతీర్చుకోగోరిన హతుని తరుపు వారు హంతకుని వెన్నాడివత్తురేని మీరతనిని ప్టి ఈయరాదు. అతడు పగప్టి చంపవలెనని తలంప కయే, అనుకోకుండ పొరుగువానిని చంపి వచ్చెనుగదా!
6. అట్లు పారివచ్చిన హంత నగర సమాజము తనకు తీర్పు చెప్పువరకును, తాను వచ్చినపుడు పదవిలో నున్న ప్రధానయాజకుడు మరణించు వరకును, ఆశ్రయ నగరముననే ఉండవలెను. అటు పిమ్మటగాని అతడు స్వీయనగరమునందలి తన ఇంికి పయనమై పోరాదు” అని పలికెను.
7. కనుక నఫ్తాలి పర్వతసీమయందలి గలలీలోని కేదేషు, ఎఫ్రాయీము మన్నెములోని షెకెము, యూదా కొండసీమలోని కిర్యతార్బా అనబడిన హెబ్రోను నగర ములను ఆశ్రయపట్టణములుగా నిర్ణయించిరి.
8. యోర్దానునకు ఆవల యెరికోకు తూర్పు వైపుననున్న ఎడారి పీఠభూములలోని రూబేను తెగలో బేసేరును, గాదు తెగలో రామోత్గిలాదును, మనష్షే తెగలో బాషాను మండలపు గోలానును ఆశ్రయపట్టణము లుగా నిర్ణయించిరి.
9. యిస్రాయేలీయులుగాని, వారితో జీవించుచున్న అన్యదేశీయులు గాని ఎవరి నైనను తెలియక పొరపాటున చంపినపుడు ఈ నగర ములలో శరణు పొందవచ్చును. నగర సమాజముల నుండి తీర్పు పొందువరకు పగ తీర్చుకోగోరిన హతునివైపు వారి నుండి తప్పించుకోవచ్చును.