4. దెబోరా – బారాకు

4 1. ఏహూదు చనిపోవగానే యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి.

2. కనుక యావే వారిని హాసోరు రాజైన యాబీను చేతికి అప్పగించెను. యాబీను సైన్యాధిపతి సీస్రా. అతడు అన్యజాతులకు చెందిన హరోషెతు నగరమున నివసించుచుండెను.

3. యాబీనునకు తొమ్మిదివందల ఇనుపరథములు కలవు. అతడు ఇరువది ఏండ్లు యిస్రాయేలీయులను పీడించి పిప్పి చేసెను. ఆ బాధ భరింపలేక వారు యావేకు మొర పెట్టుకొనిరి.

దెబోరా

4. ఆ రోజులలో దెబోరా అను ప్రవక్తి యిస్రా యేలీయులకు తీర్పుతీర్చుచుండెను. ఆమె లప్పీదోతు భార్య.

5. ఎఫ్రాయీము కొండలలో రామా, బేతేలు నగరములకు మధ్యనున్న ”దెబోరా ఖర్జూరము చెట్టు” క్రింద కూర్చుండియుండెడిది. యిస్రాయేలీయులు ఆమెచెంతకు వచ్చి తమ తగవులను పరిష్కరించు కొనెడి వారు. 6. ఆమె ఒకనాడు నఫ్తాలి మండలము నందలి కేదేషుకు చెందిన అబీనోవము కుమారుడు బారాకును పిలిపించి ”వినుము, యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞ ఇది. నీవు నఫ్తాలి, సెబూలూను మండలముల నుండి పదివేలమంది యోధులను ప్రోగుజేసికొని తాబోరు కొండకు నడువుము.

7. యాబీను సైన్యాధిపతియైన సీస్రా సైన్యములతో, రథములతో వచ్చి కీషోను వాగు వద్ద నిన్ను ఎదు ర్కొనునట్లు చేయుదును. అతనిని నీ వశము చేయు దును” అని చెప్పెను.

8. బారాకు ఆమెతో ”నీవును నా వెంట వచ్చెదవేని నేను వెళ్ళెదను. నీవు రావేని నేనును వెళ్ళను” అనెను.

9. దెబోరా ”నేను తప్పక నీతో వత్తును. కాని ఈ పయనము వలన నీకు కీర్తి కలుగదు. ప్రభువు సీస్రాను ఒక ఆడుపడుచు చేతికి అప్పగించును” అని చెప్పెను. అంతట దెబోరా బారాకుతో కేదేషునకు వెడలిపోయెను. 

10. బారాకు సెబూలూను, నఫ్తాలి వీరులను కేదేషునకు పిలిపింపగా పదివేలమంది వచ్చి అతనిని అనుసరించిరి. దెబోరా బారాకు వెంటవెళ్ళెను.

కేెనీయుడైన హెబెరు – సీస్రా పరాజయము

11. అపుడు కేనీయుడైన హెబెరు కేనీయులతోను, మోషే మామయగు హోబబు సంతతివారితోను సంబంధము త్రెంచుకొని కేదేషు చెంతగల సాననీము లోని సింధూర వృక్షమువద్ద వసించుచుండెను.

12-13. అబీనోవము కుమారుడు బారాకు తాబోరు కొండమీద దండుదిగియున్నాడని విని సీస్రా తన సైన్యములను, తొమ్మిది వందల ఇనుపరథములను ప్రోగుచేసికొనెను. అతడు అన్యజాతులు వసించు హరోషెతు నుండి తన దళము లన్నిని పిలిపించి కీషోను లోయలో ప్రోగుచేసెను.

14. అపుడు దెబోరా బారాకును హెచ్చరించి ”పోయి శత్రువుపై పడుము. నేడు యావే సీస్రాను నీ వశము చేసెను. ప్రభువు నీ సైన్యమునకు ముందుగా తరలి పోవును” అని చెప్పెను. బారాకు పదివేలమందిని వెంటనిడుకొని తాబోరు కొండదిగి శత్రువు ఎదుికి వచ్చెను.

15. బారాకు రాగానే యావే సీస్రాకు, అతని రథములకు, సైన్యము లకు భయము ప్టుించి వారిని కలవరపరచెను. సీస్రా రథముదిగి బ్రతుకు జీవుడాయని పిక్కబలముకొలది పారిపోయెను.

16. బారాకు అతని రథములను, సైన్యములను హరోషెతు-హగోయిము వరకు తరిమి కొట్టెను. సీస్రా సైన్యమంతయు కత్తివాదరకు ఎర యయ్యెను. ఒక్కడు కూడ తప్పించుకొనలేదు.

సీస్రావధ – యిస్రాయేలీయుల విముక్తి

17. సీస్రా కేనీయుడైన హెబెరుని భార్య యాయేలు వసించు గుడారమువైపు పరుగెత్తెను. ఆ రోజులలో కేనీయుడైన హెబెరునకు, హాసోరు రాజైన యాబీనునకు పొత్తు కలదు.

18. యాయేలు సీస్రాకు ఎదురుపోయి ”దొరా! ఇటురమ్ము. మా గుడారమున వసింపుము. ఇచటనేమియు భయపడనక్కరలేదు”  అని  అతనిని ఆహ్వానించెను. అతడు ఆమె గుడారమున ప్రవే శించెను. యాయేలు సీస్రాను కంబళితో కప్పెను.

19. అతడు నాకు దప్పికయగుచున్నది. కొంచెము దాహమిమ్మనెను. ఆమె సీస్రాకు పాలతిత్తివిప్పి త్రాగు టకు పాలుపోసి మరల అతనిని కంబళితో కప్పెను.      

20. సీస్రా యాయేలుతో ”నీవు గుడారము తలుపు నొద్ద నిలువుము. ఎవరైన వచ్చి ‘ఇచట ఇతరులెవరైన ఉన్నారా’ అని అడిగినయెడల ఎవ్వరునులేరని చెప్పుము” అని  పలికెను.

21. సీస్రా అలసిసొలసియుండెను. గనుక మైమరచి గాఢనిద్ర కలిగియుండెను. యాయేలు గుడారపు మేకును, సుత్తెను తీసికొని మెల్లమెల్లగా అతని యొద్దకువచ్చి, మేకును అతని కణతలలో ప్టిె కొట్టగా అది నేలలోనికి దిగబడిపోయెను. ఆ రీతిగా సీస్రా ప్రాణములు విడిచెను.

22. అంతలో బారాకు సీస్రాను వెదకుకొనుచు వచ్చెను. యాయేలు అతనికి ఎదురుపోయి ”నా వెంటరమ్ము. నీవు వెదకు మను జుని చూపింతును” అనెను. అతడు యాయేలు గుడార ములోనికి పోయిచూడగా కణతలో దిగబడిన మేకుతో సీస్రా చచ్చిపడియుండెను.

23. ఆ రీతిగా యావే నాడు యిస్రాయేలీయుల ముందర కనానురాజు యాబీను పొగరణగించెను.

24. ఆ పిమ్మట యాబీను మీద యిస్రాయలీయులదే పైచేయి అయ్యెను. చివరకు వారతనిని పూర్తిగా అణగద్రొక్కిరి.

Previous                                                                                                                                                                                                      Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము